Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్లలో జగన్ బీసీలను మోసం చేసే కార్యక్రమాలు తప్ప ఏమీ చేయలేదు

– టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు

జగన్ రెడ్డి పాలనలో బీసీల అభివృద్ధి గాలికొదిలేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలను మోసం చేశారు. బీసీల అభివృద్ధి కోసం చంద్రబాబు 34 సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు.

స్థానిక సంస్థలలో బీసీల కోసం చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్ రెడ్డి 16,800 పోస్టులు కోత విధించి బీసీల వెన్ను విరిచారు. ఇళ్ల పట్టాల పేరుతో 8 వేల ఎకరాల బీసీల భూముల్ని దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గానికి పైసా ఖర్చు చేయలేదు. గత ఐదేళ్లలో బీసీలపై అనేక దాడులు, హత్యలు జరిగాయి ఈ హత్యలన్నింటికీ జగన్ రెడ్డి బాధ్యత వహించాలి. భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

బీసీలకు, చంద్రబాబుకు మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఈ నెల 5న డిక్లరేషన్ ప్రకటించనున్నాం. వైసీపీ ప్రభుత్వం బీసీ కులగణన, సామాజిక సాధికార బస్సుయాత్ర, సిద్ధం అంటూ ప్రజలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు కానీ, ప్రజలు మీకు బుద్ది చెప్పి గద్దె దించే రోజు దగ్గరలోనే ఉంది.

 

LEAVE A RESPONSE