Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జమానాలో పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్ష

• చంద్రబాబు పేదల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన 33 పథకాల్ని రద్దు చేయడమే జగన్ రెడ్డి వైద్యరంగంలో సాధించిన గొప్ప ప్రగతి
• చంద్రబాబు హయాంలో పేదలు తమ వైద్యం కోసం కేవలం రూ.950లు వెచ్చిస్తే, జగన్ రెడ్డి వచ్చాక ఆ వ్యయం రూ.5వేలకు చేరింది
• పేదల ఆరోగ్యం కోసం చంద్ర బాబు ప్రవేశపెట్టిన 33 పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి, వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య

పేదల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యంతో కూడా జగన్ రెడ్డి సర్కార్ చెలగాటమా డుతోందని, నాడు-నేడు పేరుతో వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించినట్టు సమీక్షల్లో ముఖ్యమంత్రి చెప్పుకోవడం తప్ప, వాస్తవంలో సకాలంలో ఎక్కడా నాణ్యమైన వైద్యం పేదలకు అందడం లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. చంద్రబాబు హయాంలో పేదలు తమ వైద్యం కోసం కేవలం రూ.950లు వెచ్చిస్తే, జగన్ రెడ్డి వచ్చాక ఆ వ్యయం రూ.5వేలకు చేరింది పేదల ఆరోగ్యం కోసం చంద్ర బాబు ప్రవేశపెట్టిన 33 పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి, వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు

“ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఇప్పటికీ పేదలకు అందని ద్రాక్షగానే తయారైంది. టీడీపీప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం కోసం 33 పథకాలు ప్రవేశపెట్టి, వారి జీవనప్రమాణాలు పెంచారు. ఈ వాస్తవం రాష్ట్రంలోని పేదలందరికీ తెలుసు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి ముందు, రాష్ట్రంలో ఒక్కో పేద రోగిపై అప్పుడున్నప్రభుత్వం సరాసరిన రూ.5వేల వరకు ఖర్చుచేసేది. అంతటి అనారోగ్యపరిస్థితులు అప్పుడు రాష్ట్రంలో ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఖర్చుని బాగా తగ్గించి, 2019 నాటికి కేవలం రూ.950కు పరిమితం చేశారు.

పేదల ఆరోగ్యం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, అన్నిరకాల వైద్యసేవలు అందించబట్టే ఆఖర్చు తగ్గింది. పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తూ ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారని గ్రహించిన టీడీపీప్రభుత్వం, పరిశుభ్రతకు అధికప్రాధాన్యత ఇచ్చి, పేదల్ని వివిధ రోగాల నుంచి కాపాడటమే గాక, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించింది. అలానే ఎక్కడికక్కడ ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్యసేవలు అందేలా అన్ని వసతులు కల్పించింది. పేదలకు సకాలంలో అన్నిరకాల వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంది.

చంద్రబాబు ప్రజారోగ్యం కోసం ప్రవేశపెట్టిన 33 పథ కాలు పేదల జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకొచ్చాయన్నది కాదనలేని వాస్తవం .అలాంటి పరిస్థితి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పరిస్థితి మొత్తం తలకిం దులైంది. ఇప్పుడు వైసీపీప్రభుత్వంలో ఒక్కో రోగికి ప్రభుత్వం రూ.4 నుంచి రూ.5వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరలా పేదలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, వేలకువేలు వైద్యానికే ధారపోయాల్సిన దుస్థితి దాపురించింది.

వైసీపీ హాయాంలో ప్రభుత్వాసుపత్రులు నరకకూపాల్ని తలపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లతో రోగులకు వైద్యసేవలు అందే దుస్థితికి ఆసుపత్రుల్ని తీసుకురావడమేనా వైద్యారోగ్య రంగాన్ని ఉద్ధరించడమని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు నరక కూపాల్ని తలపిస్తు న్నాయి. చెత్తకుండీలకు నిలయాలుగా, అత్యాచార కేంద్రాలుగా ఆసుపత్రులు మారడం నిజంగా బాధాకరం. నెల్లూరు ఆసుపత్రిలో వైద్యులు లేక సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లతో రోగులకు వైద్యసేవలు అందించడం ఎలాంటి ప్రగతో ముఖ్య మంత్రి సమాధానం చెప్పాలి. ఇదేనా వైద్యారోగ్యరంగాన్ని సంస్కరించడం అంటే అని జగన్ రెడ్డి ని ప్రశ్నిస్తున్నాం. బిడ్డను కోల్పోయిన తల్లితండ్రులు అంబులెన్సులు లేక మృతదేహాల్ని ద్విచక్రవాహనాలపై తీసుకెళ్లాల్సి రావడం ఎంతటి దుర్భరమో జగన్ రెడ్డి గ్రహించాలి.

పెత్తందార్లకు, పనికిరాని సలహాదార్లకోసం వేలకోట్లు దుర్వి నియోగం చేస్తున్న జగన్ రెడ్డి పేదల ఆరోగ్యం కోసం నిధులు వెచ్చించడానికి వెన కాడుతున్నాడు. నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కేంద్రం విడుదల చేస్తున్న కోట్లరూపాయాల్ని తన నకిలీ నవరత్నాలకు వెచ్చించడం ద్వారా జగన్ రెడ్డి పేదల ప్రాణాలతో చెలగాటమాడాడు. నిధుల కొరత ఉందని సాకులు చెబుతూ, అనేక వైద్యశాలల్లో వైద్యులు లేకుండానే ప్రభుత్వ వైద్యశాలల్ని ఈ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోంది.

కొన్నిచోట్ల వైద్యులు వారి సొంత ఖర్చుతో పేదలకు వైద్యం అందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిదిద్ది, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి చివరకు మాటతప్పి, మడమ తిప్పాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే, ముఖ్యమంత్రి వైద్యరంగాన్ని ఉద్ధరిం చాడని ఆయన మందీమార్బలం డప్పు కొడుతున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా మందులు.. సరైన పరికరాలు.. ఆఖరికి సిరంజీలు.. సూదులు.. పడకలు కూడా లేవన్నది వాస్తవం. కరోనా సమయంలో సరైన వైద్యసేవలు అందించని జగన్ సర్కార్ నిర్లక్ష్యం ఎందరినో బలితీసుకుంది

ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులకోసం వెళ్లిన గర్భిణుల్ని ప్రసవానంతరం ఒకే బెడ్ పై ఇద్దరు, ముగ్గుర్ని ఉంచుతున్నారు. చాలినన్ని పడకలు లేక, నాణ్యమైన వైద్యసే వలు అందించలేక, ఆఖరికి సరైన సిరంజీలు, సూదులు కూడా లేక, ఏం చేయాలో అర్థంకాక సర్కార్ దవాఖానాల్లోని వైద్యసిబ్బంది తలలు పట్టుకుంటు న్నారు. వైద్యరంగంలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి అంతా సాక్షి దినపత్రికలోని ప్రకటనలకే పరిమితమైందన్నది వాస్తవం. ఆఖరికి కరోనా సమయంలో సరైన వైద్యం అందక, మరీ దారుణంగా ఆక్సిజన్ అందక ఎందరో ప్రాణాలు కోల్పో యారు.

తిరుపతి రుయా ఆసుపత్రిలో చిన్నారులు సహా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్మార్ట్ ఫోన్లలో రిజిస్టర్ చేసుకుంటేనే పేదలకు మంచి వైద్యం అందుతుందని జగన్ సర్కార్ మెలిక పెట్టడం, వారి ఆరోగ్యంతో ఆటలాడ టం కాదా? టీడీపీప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల్లో 24 గంటల్లోనే పేదలకు నాణ్యమైన వైద్యసేవలు, అన్నిరకాల వైద్య పరీక్షలు లభించేవి. ఆసుపత్రుల్లోని రోగులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహారంతో పాటు నిత్యం వారి పడకలపై ఉండే దుప్పట్లను మార్చడం జరిగేది. దానికోసం రోజుకోరంగు దుప్పటిని పడకపై వేసేవారు. ఇందుకోసం సప్తవర్ణ దుప్పట్ల పేరుతో టీడీపీప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకమే అమలు చేసింది.

పడకలు.. వాటిపై వేసే దుప్పట్లు సహా మందులు, వైద్యపరీక్షలు.. చికిత్సల్లో నాణ్యమైన వైద్యసేవలు పేదలకు అందించిన ఘనత టీడీపీప్రభుత్వానిది. చంద్రబాబు హాయాంలో ప్రభుత్వపెద్దలు, కేబినెట్ మంత్రులు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు పొందింది నిజం కాదా? జగన్ రెడ్డి పాలనలో మంత్రులు కరోనా సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పక్కరాష్ట్రాల్లో చికిత్సపొందారు.

పాలన చివరి దశలో అయినా జగన్ రెడ్డి పేదల ఆరోగ్యంపై దృష్టిపెట్టకపోతే, ఎన్నికల్లో వారు ఆయనకు, ఆయన ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం

జగన్ రెడ్డి తన పాలన చివరి దశలో అయినా మేల్కొని పేదల ఆరోగ్యం కోసం మెరుగైన చర్యలు తీసుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీచేసి, అన్నిరకాల మందులు, శస్త్రచికిత్సలకు అవసరమైన అన్నిరకాల పరికరాలు, యంత్రాలు అందుబాటు లోకి తీసుకురావాలి. జగన్ ప్రభుత్వ ఆసుపత్రుల్ని పట్టించుకోకుండా ఇదే విధంగా పేదల ఆరోగ్యంతో చెలగాటమాడితే, వచ్చే ఎన్నికల్లో ఆ పేదలు ఆయనకు.. ఆయన ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెప్పడం ఖాయం.” అని ఆనంద్ సూర్య స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE