– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతు భరోసా నగదు జమ కొనసాగుతోందని, అర్హులందరికీ రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. మొత్తం 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేశామని, ఈ మొత్తం రూ.530 కోట్లు అని వెల్లడించారు. రైతు భరోసా సొమ్మును బ్యాంకులో నుంచి తీసుకోవచ్చని తుమ్మల చెప్పారు.