Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి సంక్షేమం పేరుతో చెప్పేదొకటి.. చేసేదొకటి

• దొంగబటన్లు నొక్కుతూ, మోసకారీ సంక్షేమంతో ప్రజల్ని వంచిస్తూ, అప్పుల ఊబిలో రాష్ట్రాన్నిముంచేసి, తనఖజానా నింపుకుంటున్న జగన్ రెడ్డి
• వైసీపీప్రభుత్వంలో పేదలకు అందుతున్న సంక్షేమం గోరంత.. జరుగుతున్న ప్రచారం కొండంత. సాక్షి మీడియా ప్రకటనల్లో కనిపిస్తున్న సంక్షేమ ఫలాలు, వాస్తవంలో కనిపించడంలేదు.
• జగన్ రెడ్డి హాయాంలో ధర పెరగని వస్తువు ఏదైనా ఉందా? పన్నులభారం పడని కుటుంబం ఒక్కటైనా ఉందా?
• జగన్ రెడ్డి హాయాంలో బడ్జెట్ రూ.9.50లక్షలకోట్లకు చేరినా, సంక్షేమానికి 15శాతం కూడా ఖర్చుచేయలేదు.
• టీడీపీ హాయాంతో పోలిస్త్తే, ఆదాయం పెరిగినా, లక్షలకోట్ల అప్పులు తెచ్చినా పేదలకు మాత్రం జగన్ రెడ్డి మొండిచెయ్యే చూపాడు.
• జగన్ రెడ్డి, చంద్రబాబులో ఎవరు సంక్షేమానికి ఎక్కువ నిధులు వెచ్చించారనేది బడ్జెట్ లెక్కలు, సీ.ఎఫ్.ఎమ్.ఎస్, కాగ్ సమాచారమే చెబుతోంది.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

సంక్షేమ పథకాలతో పేదల్ని లక్షాధికారుల్ని చేశానని ఊకదంపుడు ఉపన్యాసా లిస్తున్న జగన్ రెడ్డి మాటలకు, వైసీపీ ప్రభుత్వ పనితీరుకి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఎక్కడా పొంతనలేదని, ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల తీరుని, 2014 – 19మధ్య టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన వాటిని సరిపోల్చి, ఆధారాలతో సహా జగన్ రెడ్డి మోసకారీ సంక్షేమాన్ని నిరూపిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామ హేశ్వరరావు తేల్చిచెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

టీడీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ నిధుల్లో సంక్షేమానికి 20శాతం ఖర్చుచేస్తే, జగన్ రెడ్డి 15శాతం కూడా ఖర్చుచేయలేదు
“ ఐదేళ్ల చంద్రబాబు పాలన మొత్తం సంక్షేమ పథకాలతో కూడిన స్వర్ణ యుగమనే చెప్పాలి. ఆనాడు ఐదేళ్లలో మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.7లక్షల కోట్లు అయితే, జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనలో మొత్తం బడ్జెట్ రూ.9.40లక్షల కోట్లు. ఈ ప్రభుత్వంలో బడ్జెట్ వ్యయం రూ.2.40ల క్షల కోట్లు పెరిగింది. టీడీపీప్రభుత్వం మొత్తం బడ్జెట్ లో 20శాతం నిధుల్ని ఎస్సీ..ఎస్టీ…బీసీ..మైనారిటీవర్గాల సంక్షేమానికి కేటాయించింది.

జగన్ రెడ్డి వచ్చాక అంతా బటన్ నొక్కుడు వ్యవహారం తప్ప, దానివల్ల పేదలకు ఎలాంటి న్యా యం జరగడంలేదు. దొంగబటన్లు నొక్కుతూ, ప్రజలకు అవాస్తవాలు చెబుతున్న జగన్ రెడ్డి పేదవాళ్లకు గోరంతసాయం చేస్తూ, కొండంతప్రచారం చేస్తూ, వందలకోట్ల ప్రజాధనం తో సాక్షి మీడియాలో తప్పుడు సమాచారంతో కూడిన ప్రకటనలు ఇస్తున్నాడు.

టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమపథకాల అమలు తీరుతెన్నులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలతోనే తాము మాట్లాడుతున్నాం
బడ్జెట్ లెక్కలతోపాటు, సీ.ఎఫ్. ఎమ్.ఎస్, కాగ్ సమాచారంతోనే మాట్లాడుతున్నాం. 2014-19తో పోలిస్తే జగన్ రెడ్డి హాయాంలో ఆదాయం పెరిగింది. దాంతోపాటు అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి. చంద్రబాబు హాయాంలో రాష్ట్ర అప్పులు రూ.2లక్షలకోట్లు ఉంటే, జగన్ రెడ్డి హాయాంలో రూ.10లక్షలకోట్లకు చేరాయి.

ఈ ప్రభుత్వం లో ఆదాయం పెరిగినా, ఇబ్బడిముబ్బడిగా అప్పులుచేసినా వాస్తవంగా క్షేత్రస్థాయిలో జగన్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెట్టిన ఖర్చు కేవలం 15శాతం మాత్రమే. రూ.10లక్షల కోట్ల సొమ్ము ఏమైందో, ఎటు పోయిందో జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. పథకాలన్నింటినీ కుదించి నవరత్నాలని చెప్పిన జగన్ వాటిలో కొత్తగా అమలుచేసింది ఏమీలేదు.

అమ్మఒడిపేరుతో తల్లుల్ని..పిల్లల్ని వంచించాడు
అమ్మఒడి కింద ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒక్కొక్కరికీ రూ.15వేలచొప్పున తల్లుల ఖాతాల్లో జమచేస్తానన్న జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక చదివే పిల్లలకు కాదు..తల్లికే అమ్మఒడి సాయం అని మాటమార్చాడు. నాలుగేళ్లలో రూ.15వేలను రూ.13వేలకు కుదించాడు. రాష్ట్రంలో 80లక్షల మంది విద్యార్థులుంటే, ఆ సంఖ్యను 40లక్షలకు కుదించాడు. తొలుత ప్రతిఇంట్లో చదువు కునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తానని, తీరా అధికారంలోకి రాగానే పిల్లలకు కాదు ప్రతి తల్లికి అని మెలిక పెట్టలేదా?

నాలుగేళ్లలో నాలుగువిడతలు ఇవ్వాల్సిన అమ్మఒడిసాయాన్ని మూడువిడతలే ఇచ్చి, ఒక సంవత్సరం ఎగ్గొట్టింది నిజంకాదా? ఈ విధంగా అమ్మఒడి పథకాన్ని పెద్ద మోసపురత్నంగా మార్చాడు. ఆసరా, అమ్మఒడి, చేయూత అంటూ గతంలో అమలైన పథకాలపేర్లు మార్చి, ప్రజలకు మాయమాటలు చెప్పి, వారిని జగన్ రెడ్డి దారుణంగా వంచించాడు అనడా నికి బడ్జెట్ లెక్కలు, సీ.ఎఫ్.ఎమ్.ఎస్, కాగ్ విభాగాల సమాచారమే నిదర్శనం.

వాహనమిత్ర ముసుగులో సంవత్సరానికి రూ.10వేలు ఇస్తూ, లక్షరూపాయలు లాక్కుంటున్నాడు
టీడీపీప్రభుత్వంలో ప్రతి వర్గానికి ప్రత్యేకమైన పథకాలు అమలయ్యాయి. ఎస్సీ, ఎస్టీల్లో డ్రైవర్లుగా ఉన్న యువత వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చంద్రబాబు కార్లు అందించారు. జగన్ రెడ్డేమో వాహనమిత్ర పేరుతో వాహనదారులకు ఏటా రూ.10వేల ముష్టివేస్తూ, వారినుంచి ఏటా లక్ష రూపాయలు కొట్టేస్తున్నాడు. డీజిల్ ధరలతో పాటు, గ్రీన్ ట్యాక్స్ , రోడ్ ట్యాక్స్, పోలీస్, ఆర్టీవో అధికారులసాయంతో వాహనదారుల్ని దోచుకుంటున్నా డు. టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పా టుచేసి, ఆయావర్గాల్లోని పేదలకు ఆర్థిక చేయూత అందించింది.

ప్రభుత్వం నుంచి లక్షరూపాయల సబ్సిడీతోకూడిన రుణం, బ్యాంకులనుంచి మరో రూ.లక్ష అందించి, కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. నాలుగేళ్లపాలనలో జగన్ రెడ్డి ఒక్క యువకుడికైనా స్వయం ఉపాధి కింద లక్షరూపాయల రుణం ఇచ్చారా అని ప్రశ్నిస్తు న్నా. పేదలఇళ్లల్లో జరిగే పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు రాకూడదని రూ.లక్ష రూపాయలు పెళ్లి కానుక పథకం కింద అందించారు చంద్రబాబు. అలానే అన్నాక్యాంటీన్లు, విదేశీవిద్య, సంక్రాంతి కానుక, వంటి పథకాలు అమలుచేశారు. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం జననం నుంచి మరణం వరకు ప్రజలకోసం పలు పథకాలు అమలుచేసింది.

రైతుభరోసా అనిచెప్పి రైతులనోట్లో మట్టికొట్టాడు…
రైతుభరోసా పేరుతో జగన్ రెడ్డి రైతుల నోట్లో మట్టికొట్టాడు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రైతురుణమాఫీ కింద అన్నదాతలకు రూ.21వేలకోట్లు అందిస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్ల లో రూ.15వేలకోట్లతో సరిపెట్టాడు. దానిలోకూడా అందరూ రైతులకు సాయం అందిం చలేదు. అధికారంలోకి వస్తే ప్రతిరైతుకి రూ.50వేల ఆర్థికసాయం చేస్తానన్న జగన్ రెడ్డి, వాస్తవంగా రూ.37వేలు మాత్రమే అందించాడు.

ఏటా రూ.13,500ల చొప్పున ఇస్తే, దానిలో రూ.6వేలు కేంద్రప్రభుత్వ సొమ్ము. జగన్ ఇచ్చింది ఏటా రైతుకి ఇచ్చింది కేవలం రూ.7,500లు మాత్రమే. రైతులకు ఎంతఇస్తానని చెప్పిన జగన్ ఎంత ఇచ్చా డు.. ఎంతమంది రైతులకు ఇచ్చాడో చూస్తే రైతుభరోసా పెద్ద బోగస్. రైతుభరోసా పేరుతో రైతుల్ని మోసగించినట్టే, అమ్మఒడితో తల్లుల్ని వంచించాడు.

కుంటిసాకులతో 14 లక్షల పింఛన్లు తీసేసి, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్ని రోడ్డునపడేశాడు
టీడీపీప్రభుత్వం 54 లక్షలమందికి సామాజిక పింఛన్లు అందిచింది. రూ.200లు ఉన్న పించన్ ను చంద్రబాబు రూ.2వేలకు పెంచాడు. 2019ఎన్నికల సమయంలో చంద్రబా బు రూ.3 వేల పింఛన్ ఇస్తానన్నహామీని కాపీకొట్టిన జగన్ రెడ్డి, రూ.3వేలు ఇస్తానని ఈ నాలుగేళ్లలో రూ.750 మాత్రమే పెంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్ని వంచించింది నిజంకాదా? కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, ట్యాక్స్ కడుతున్నారని, సొంతఇల్లు ఉందని, పిల్లలు ఉద్యోగం చేస్తున్నారని, నాలుగుచక్రాల వాహనంఉందని కుంటిసాకులుచెప్పి 14లక్షల మందికి పింఛన్లు ఎగ్గొట్టింది నిజంకాదా?

పత్రికా ప్రకటనల్లో 64 లక్షలమందికి పింఛన్లు ఇస్తున్నట్టు చెబుతున్న జగన్ ప్రభుత్వం, వాస్త వంలో మాత్రం 50లక్షలమందికే ఇస్తోంది. పింఛన్లకోసం వాలంటీర్లు, సచివాలయాల చుట్టూ తిరిగలేక వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు అర్హుల్ని వెతికి మరీ వారికి పింఛన్లు అందిస్తే, జగన్ రెడ్డి వెతికివెతికి వాటిని తీసేయడం లో సఫలీకృతుడు అయ్యాడు.

టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో పేదలకు 12లక్షల ఇళ్లుకట్టిస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో కట్టింది 833 ఇళ్లు మాత్రమే
అధికారంలోకి వస్తే ఏటా 5లక్షల చొప్పున ఐదేళ్లలో పేదలకోసం 25లక్షల ఇళ్లు కట్టిస్తా నన్న హామీని కూడా జగన్ రెడ్డి విస్మరించాడు. టీడీపీ ప్రభుత్వం 2104-19 మధ్య పేదలకోసం 12లక్షల ఇళ్లు కట్టిస్తే, నాలుగేళ్లలో జగన్ రెడ్డి కట్టించింది కేవలం 833 ఇళ్లే నని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రే చెప్పారు.
అర్బన్, రూరల్ హౌసింగ్, సెంటుపట్టా భూముల్లో వైసీపీప్రభుత్వం ఇప్పటివరకు కట్టిన ఇళ్లు కేవలం 833. పేదలకు ఇళ్లు కట్టించేందుకు సెంటుపట్టాలు ఇస్తున్నామని చౌకగా భూములుకొని, అధికధరకు ప్రభు త్వానికి అంటగట్టి, వైసీపీనేతలు అడ్డగోలుగా రూ.7వేలకోట్లు దోచేశారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతో 6 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం
టీడీపీప్రభుత్వంలో 16లక్షల మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిం చింది. ప్రతి సంవత్సరం కాలేజీ యాజమాన్యాలకు క్రమంతప్పకుండా డబ్బులు చెల్లిం చింది. దాంతో విద్యార్థులు ఇబ్బందిలేకుండా చదువుకున్నారు. జగన్ రెడ్డి వచ్చాక విద్యార్థుల సంఖ్యలో కోతపెట్టి, 6లక్షల మందికి ఎగ్గొట్టాడు. టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో రూ.10,130కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కు చెల్లిస్తే, జగన్ రెడ్డి విడతలవారీగా నాలు గేళ్లలో కేవలం రూ.5వేలకోట్లు మాత్రమే చెల్లించాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ వస్తుందో రాదో తెలియక విద్యార్థులు, వారితల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

మద్యనిషేధం మాటున నాలుగేళ్లలో రూ.లక్షా20వేలకోట్ల మద్యం విక్రయాలు
ఇవన్నీ ఒకెత్తు అయితే మద్యనిషేధం పేరుచెప్పి, ప్రజల్ని వంచించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాలుగేళ్లలో లక్షా 20వేలకోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిపించాడు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి, రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చాడు. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మహిళల్నిమోసగించి, పిచ్చి మద్యం అమ్ముతూ, ఆదాయమే పరమావధిగా ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు.
చంద్రబాబు అమలుచేసిన పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి..

ఎస్సీలకు టీడీపీప్రభుత్వం అమలుచేసిన 27 పథకాలు రద్దుచేశాడు. ఎస్టీలకు సంబం ధించి 29పథకాలు రద్దుచేశాడు. బీసీలకు అమలుచేసిన 30 పథకాలు రద్దు చేశాడు, రైతులకు సంబంధించిన 13 పథకాలు రద్దుచేశాడు. మహిళలకు చెందిన 10పథకాలు రద్దుచేశాడు. మొత్తంగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ప్రజలకు అందాల్సిన 120 పథకాలు రద్దయ్యాయి. బటన్ నొక్కుడు పేరుతో ఒకచేతికి రూ.10లు ఇస్తూ, మరోచేతి నుంచి రూ.100లు లాక్కుంటున్నాడు.

నాలుగేళ్లలో జగన్ రెడ్డి ప్రజలపై వేసిన భారం…
వివిధరకాల ఛార్జీల పేరుతో 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.50వేలకోట్ల భారం. ఆర్టీసీ ఛార్జీల పెంపు, ధరల పెంపు, పన్నులభారంతో జగన్ రెడ్డి బాదుడేబాదుడికి తట్టుకోలేక జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ రకమైన బాదుడికి తోడు నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలుపెంచి మరింత భారంమోపాడు. జగన్ రెడ్డి హాయాంలో ధర పెరగని వస్తువు ఏదైనా ఉందా? పన్నులభారం పడని కుటుంబం ఒక్కటైనా ఉందా?

నాలుగేళ్లలో సంక్షేమం పేరుతో ప్రజల్ని నిట్టనిలువునా ముంచేసిన కోతల రాయుడు జగన్ రెడ్డి. అన్నిరకాలుగా పేదల్ని వంచించి, రాష్ట్రాన్ని అప్పులపాలుచేసి, తన ఖజా నా నింపుకుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వం మొత్తం 7లక్షలకోట్ల బడ్జెట్లో 20శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుపెడితే, 9.40లక్షల బడ్జెట్లో నాలుగేళ్లలో 15శాతం నిధులు కూడా జగన్ రెడ్డి సంక్షేమానికి ఖర్చుపెట్టలేదు. జగన్ రెడ్డి మోసపు రత్నాలతో రాష్ట్రంతో పాటు ప్రజలంతా అథ:పాతాళానికి వెళ్లిపోయారు” అని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE