Suryaa.co.in

Telangana

అసమర్ధ ప్రధాని మోడీ

-12 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం
-15 లక్షల రూపాయలు వేస్తామన్న నరేంద్ర మోడీ ఎవరి ఖాతాలోనైనా డబ్బులు వేశారా?
-భూపాలపల్లి బహిరంగ సభలో ప్రతిపక్షాలపై మండిపడ్డ కేటీఆర్

భూపాలపల్లి జిల్లా కేంద్రం : భూపాలపల్లిలో గురువారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు కక్కారు దేశ ప్రధాని అసమర్ధ ప్రధాని అంటూ కేటీఆర్ నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం అందించలేదని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో 40 ఏళ్లలో ఏనాడు లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయిందని, గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం పని తీరుపై మండిపడ్డారు. పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న నరేంద్ర మోడీ ఎవరి ఖాతాలోనైనా డబ్బులు వేశారా?అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

పనికిమాలిన బీజేపీ- కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బండి సంజయ్ లపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చెయ్యాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర మంజూరు చేయలేదని కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పదిసార్లు అవకాశం వస్తే రాష్ట్రంలో ఏమి చేశారంటూ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. 60 ఏళ్ల పాలనలో విద్యుత్తు మంచినీటి సౌకర్యం కల్పించారా? అని కాంగ్రెస్ నాయకులకు సూటి ప్రశ్న వేశారు. రాష్ట్రానికి ఏది చేయాలి ఏం చేయాలి అని ఆలోచించే కేసీఆర్ పైన విమర్శలకు దిగడం పై కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెరాస లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోయేదని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకన్ని నిర్మించుకున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

12 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యము తో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ సంక్షేమ పథకాలు చేపట్టి దేశంలోనే అగ్రస్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవారికి పట్టం కట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE