వారం కింద బీహార్లో మోడీజీ మాతృమూర్తి మీద , అయన మీద అసభ్యంగా , అభ్యంతరకరంగా మహమ్మద్ రిజ్వీ అనే యువకుడు మాట్లాడిన విషయం దేశమంతా చర్చనీయాంశం అయింది . ఆ యువకుడు ఏమన్నాడో మీడియాలో ఎక్కడా దొరకలేదు . అతనిని అరెస్ట్ చేసి రిమాండుకి కూడా పంపటం జరిగింది . బహుశా వివరాలు తర్వాత రోజుల్లో తెలవవచ్చు .
సూది కోసం సోదికి వెళితే పాత వ్యవహారాలన్నీ బయటపడ్డాయని ఒక సామెత ఉంది . మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎన్నికల సమావేశంలో “వాహ్ క్యా గర్ల్ ఫ్రెండ్ హై , అపనే కభీ దేఖా హై 50 క్రోర్ గర్ల్ ఫ్రెండ్” అన్నారని ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతుంది .
సోనియాగాంధీ , మమతాబెనర్జీ , మహాత్మాగాంధీ , నెహ్రూ మీద విసరబడిన అసభ్య పదాలన్నీ వైరల్ అవుతున్నాయి . ఇంకా పైప్ లైన్లో ఉన్నాయేమో తెలియదు . వేచి చూడాల్సిందే .
ఎప్పుడో 13 ఏళ్ల కింద మోడీజీ అంటే ఇప్పుడు చర్చించబడుతుంది . Of course . ఇప్పుడు ఆయన మోడీ గారికి దగ్గర వాడు అయ్యాడనుకోండి . అదెలా ఉన్నా కార్యకర్తలు , నాయకులు , ప్రజాప్రతినిధులు మహిళల మీద , ఇతరుల మీదా కట్టు తప్పి మాట్లాడి పవిత్ర భారతాన్ని అసభ్య భారతాన్ని చేయకండి.
– డిఏఆర్ సుబ్రమణ్యం