Home Political News 2026 మే కల్లా భారత తయారీ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధం

2026 మే కల్లా భారత తయారీ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధం

నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రం వడదరాలో అక్టోబర్ 30న 22 వేల కోట్ల పెట్టుబడితో ఎయిర్ బస్ మరియు టాటా సన్స్ కంపెనీ కలసి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కు (దేశీయ కంపెనీ మేకిన్ ఇండియా) స్వీకారం చుట్టబొతున్నాయి.

మొదటగా C 295 ఎయిర్ క్రాఫ్ట్ పేరుతో సెప్టెంబర్ 20 వ తేదీ 23 లో మొదలై 2026 మే కల్లా ఎయిర్ క్రాఫ్ట్ తయారై మన దేశ యుద్ధరంగానికి ఉపయోగపడబోతుంది. మరియు ఇతర దేశాలతో కూడా వ్యాపారం చేయుటకు దోహదం కలుగుతుంది. .56 యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలని నిర్ణయం చేసి 16 యుద్ధ విమానాలను స్పెయిన్ నుంచి కొని అందులో ఉన్న టెక్నాలజీని మన ఇంజనీర్లు తెలుసుకొని మన దేశంలోనే తయారయ్యెట్టుగా 40 యుద్ధ విమానాలు చేస్తున్నారు.96% స్పేర్ పార్ట్స్ మనదేశంలోని తయారవుతున్నాయి .

ఇందులో 7 మేజర్ అసెంబ్లీ ఉంటాయి. 1304 చిన్నచిన్న పార్ట్స్ ఇండియాలో తయారవుతున్నాయి .వీటి విడిభాగాలు అంతా ఎక్కువగా భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర కేంద్ర పరిశ్రమల నుండి ఉత్పత్తి కాబోతున్నాయి. (అయితే ఇప్పటికీ ఇంజన్లు మాత్రం మనము విదేశాల నుండి కొనవలసి వస్తుంది) .దీనివలన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మేడిన్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కు పనికొస్తుంది.

దీని వలన మన ఇంజనీరింగ్ పట్టబద్రులు ఇంజనీరింగ్ కాలేజీలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశ పెట్టవలసి వస్తుంది. రాబోవు రోజులలో ఈ ఇంజనీరింగ్ కు చాలా డిమాండ్ వస్తుంది.ఇప్పటివరకు మనము మన దేశం ఎయిర్ క్రాఫ్ట్ లను విదేశాల నుండి కొనుగోలు చేస్తుంటాము.

ఈ తయారయ్యే 40 విమానాలు వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చాలా ఉపయోగపడుతుంది . రక్షణ రంగం బాగ బలపడుతుంది ఈ ఎయిర్ క్రాఫ్ట్ వల్ల దేశంలో జరిగే ఉపద్రవాలకు గంటల వ్యవధిలోనే అక్కడికి మన సైనికులు చేరుకునేందుకు ఉపయోగపడబోతున్నాయి. శత్రు దేశాలు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చి దేశం చాలా పటిష్టంగా తయారు కాబోతుంది .

దేశం దిగుమతి రంగం నుండి ఎగుమతి రంగానికి చేరుకుంటూ మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశంలోనే తయారుచేసి మనం ఇతర దేశాలకు అమ్మే పరిస్థితి వచ్చిందంటే ఇది నిజంగా ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉండే యువత పట్ల మోడీ కి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది .ఈ ప్రాజెక్టుల వల్ల నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు కొత్తగా రాబోతున్నాయి .

దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ దేశాన్ని ప్రతి రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించుటకు కృషిచేసి దేశ అవసారాలు తీర్చుకొని విదేశాలకు కూడా ఎగుమతి చేసి తద్వారా ఆర్థికంగా బలపడుతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే దానికి ఇదొక తార్కాణం.

2025 నాటికి మన రక్షణ తయారీ స్థాయి 25 బిలియన్ డాలర్లను దాటుతుందని ఉత్తరప్రదేశ్ తమిళనాడులో ఏర్పాటు చేయబోతున్న డిఫెన్స్ కారిడార్లు ఇందుకు సహకరించబోతున్నాయి. భారతరక్షణ ఎయిర్ స్పేస్ రంగం లో ఇంత పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి.

కావున దేశ ప్రజలందరూ మోడీ బాటలో నడవాలని ,ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వారికి సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రంలో కూడా బిజెపి + జనసేన డబుల్ ఇంజన్ సర్కార్ ను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877

NO COMMENTS

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com