Suryaa.co.in

Telangana

2047లో భారత్ వికసిత్ భారత్

– ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన ముఖ్య అంశాలు

హైదరాబాద్: జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం యోగా 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.

ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ , పార్లమెంటు సభ్యులు డా.కె.లక్ష్మణ్ , కృష్ణయ్య , ఈటల రాజేందర్ , డీకే అరుణ , రఘునందన్ రావు సహా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ , ఎన్డీఓలు, డిఫెన్స్, పారామిలిటరీ అధికారులు పాల్గొననున్నారు. యోగాకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ , సినీ ప్రముఖులు మీనాక్షి చౌదరి , సాయి ధరమ్ తేజ్ , తేజ పాల్గొంటారు.

మన దేశంలోనే కాకుండా సుమారు 200 దేశాలకు పైచిలుకు జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్వవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. అన్ని యోగా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మంత్రిత్వ శాఖల తరఫున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు.

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో యోగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇందులో లక్షలాది మంది ప్రజలు భాగస్వాములు కాబోతున్నారు. హైదరాబాద్ లో గత ఐదారు సంవత్సరాల నుంచి పెద్దఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా యోగా జేఏసీ అనే సంస్థ కీలకపాత్ర పోషిస్తూ, యోగా వేడుకల కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఎల్బీ స్టేడియంలో జరిగే యోగా వేడుకల్లో యోగా శిక్షకులందరూ హాజరుకావాలని కోరుతున్నాను. యోగా ద్వారా మన ఆరోగ్యానికి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. యోగా ద్వారా శారీరకంగా, మానసికంగా బాగుండేలో దోహదమవుతుంది. అప్పుడే ఆ వ్యక్తులు సమాజానికి, దేశానికి ఉపయోగపడతారు.
2047లో భారత్ వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు వికసిత్ భారత్ సంకల్పాన్ని, లక్ష్యాన్ని సాధిస్తాం.

LEAVE A RESPONSE