తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె ఈశ్వర రెడ్డి కి ఇండియన్ పోలీస్ మెడల్

తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి
అడిషనల్ ఎస్పీ కె ఈశ్వర రెడ్డి కి 2020 సంవత్సరమ్ లో ప్రతిష్టాకరమైన ఇండియన్ పోలీస్ మెడల్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది. ఇప్పుడు ’76 వ’ ఆజాది కా అమృత మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆయన IPM పతాకాన్ని విజయవాడ స్వాతంత్య్ర వేడుకలలో స్వీకరిస్తున్నారు. ఇది వరకే కవలకుంట్ల ఈశ్వర రెడ్డి తన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సేవా పతకం,

ఉత్తమ సేవా పతకం, ముఖ్యమంత్రి శౌర్య పతకం , భారత రాష్ట్రపతి చే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ గ్యాలంటరి పతకం సాధించినారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో 33 సంవత్సరాలుగా సేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎన్నో నగదు రివార్డులు, GSE లను, ప్రశంసాపత్రములను, పొందినారు. ఆయన పని చేసిన అన్ని చోట్ల, అటు సిబ్బందికి గానీ ఇటు సామాన్య ప్రజలకు గానీ అందుబాటులో ఉండి ఏటువంటి సమస్యనైనా చిరునవ్వుతో పరిష్కరిస్తారని ఇటువంటి వారికి తగిన గుర్తింపు లభించిందని అందరూ ఆనందం వెలిబుచ్చారు.