– పండ్లతోటల ప్రోత్సాహం ఇలాగేనా?
– రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ల పొట్ట నింపుతారా?
– భూముల రేట్ల ఫలాలు రైతులను అనుభవించనీయరా?
– కందుకూరు కర్షకలోకం తిరగబడాల్సిందే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెట్లను పెంచండి పండ్ల తోటలను పెంచండి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని ఒక వైపు చెబుతూ.. రెండోవైపు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉలవపాడు మామిడి తోటలను తెగ నరికి సోలార్ ప్రాజెక్టు పెట్టుకోండి అని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత ,జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అయిన విశ్వేశ్వర్ రెడ్డి కి సంబంధించిన ఇండోసోల్ సోలార్ కంపెనీకి.. ఉలవపాడు పరిసర ప్రాంతాలలో అలాగే కరేడు ప్రాంతంలో మామిడి తోటలను ఇవ్వడం చూస్తుంటే ద్వంద్వ నీతి కనపడుతుంది
20 సంవత్సరాలకు పైగా వయసున్న చెట్లను నరికి.. ఎండలు ఎక్కువగా పంటలు పండని ప్రాంతంలో పెట్టవలసిన సోలార్ ప్రాజెక్టు పెట్టడం అంటే భూమి మీద కన్ను పడడమే అని చెప్పదలుచుకున్నాము
రామాయపట్నం పోర్టు అలాగే బీపీసీఎల్ ప్రాజెక్టు పూర్తయితే సముద్రానికి హైవేకి మధ్య ఉన్న భూముల రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఆ ఫలాలను రైతుల అనుభవించకుండా, మనకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకుంటే మన పార్టీలకు నిధులు వస్తాయి అన్న దుర్మార్గ ఆలోచనతోనే, పచ్చని పంట పొలాలను సోలార్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చే పరిస్థితి అని చెప్పదలుచుకున్నాము.
అమ్ ఆద్మీ పార్టీగా అభివృద్ధిని కోరుకుంటూనే అభివృద్ధిలో రైతులను కూడా భాగస్వామ్యం చేయాలి. కానీ రైతుల పొలాలను లాక్కొని రైతుల పొట్ట కొట్టి రైతులను భయపెట్టి అభివృద్ధి చేయడం అంటే కార్పొరేట్ల కోసం పనిచేయడం అనే భావిస్తున్నాము.
రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గం రైతులందరూ కూడా రామాయపట్నం చేవూరు ఉలవపాడు కరేడు పరిసర ప్రాంతాలలో రైతులకు అండగా నిలవ వలసిందిగా కోరుతున్నాము.
– నేతి మహేశ్వర రావు
అమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్