ఆదుకోవడమే సంస్థల ఆశయం కావాలి: పద్మారావు

విపత్కర పరిస్థితుల్లో సైతం ఆపదలలో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రతి సంస్థ ఆశయం కావాలని తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అభిలషించారు. నగరానికి చెందిన్ స్వచ్చంద్ధ సేవా సంస్థ ‘సహాయ ఫౌండషన్’ ప్రతినిధులు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తో సికింద్రాబాద్ లోని అయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెరాస సీనియర్ నేత కే ఎం ఓడియన్ శ్రీనివాస్, సహాయ ఫౌండషన్ అధ్యక్షులు టీ.శివ ప్రసాద్ యాదవ్ ల అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రతినిధులు కే పీ యాదవ్, మహేష్ యాదవ్, నవీన్ కుమార్, అంకం శ్రీకాంత్, సందీప్ రెడ్డి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర సందర్భాల్లో తమ ఫౌండషన్ ద్వారా రక్త దాన ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, ఇతరత్రా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 53 వందలకు పైగా రక్త దాన శిబిరాలను నిర్వహించమని శివ ప్రసాద్ యాదవ్ తదితరులు తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో సైతం వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని, తమ వంతు సహకారాన్ని అందిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు