Suryaa.co.in

National

ఇన్వెస్ట్‌మెంట్స్ ఫెస్టివల్.. జాబ్ ఆపర్చునిటీస్ సూపర్ బూస్ట్!

– వైజాగ్ ఇప్పుడు ఐటీ హబ్‌గా గట్టి పోటీ, అమరావతి క్వాంటం వ్యాలీకి ధీటుగా!

(బాబు భూమా)

ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది, బాస్! 7వ SIPB మీటింగ్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఓకే చెప్పడంతో మన స్టేట్ ఫ్యూచర్ సూపర్ సేఫ్. ఇది ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ లాంటి టాప్ సెక్టార్స్‌లో యూత్ కోసం లక్షలాది జాబ్స్ క్రియేట్ చేస్తుంది.

వైజాగ్ ఇప్పుడు మరో సిలికాన్ వ్యాలీగా మారుతోంది! టీసీఎస్ లాంటి గ్లోబల్ జెయింట్స్ ఆల్రెడీ ఇక్కడ గేమ్ చేంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు, మరో బిగ్ ఫారిన్ ఐటీ జెయింట్ కాగ్నిజెంట్ రూ.1583 కోట్లు ఇన్వెస్ట్ చేసి వైజాగ్‌లో 8,000 జాబ్స్ (3 దశల్లో) ఇస్తోంది. ఇది వైజాగ్ ఐటీ సీన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.

అంతేకాదు, గూగుల్ లాంటి వరల్డ్ దిగ్గజాలు కూడా మన రాష్ట్రంపై కన్నేసి, ప్లాన్స్ వేస్తున్నాయంట! ఇది మన యూత్ ఆశలకు ఫుల్ బూస్ట్ ఇస్తోంది. చంద్రబాబు నాయుడు మరియు లోకేశ్, యూత్ కోసం ఒక బ్రైట్ ఫ్యూచర్‌ని క్రియేట్ చేయడానికి కసిగా పనిచేశారు, దాని రిజల్ట్స్ ఇప్పుడు కళ్ళముందే కనిపిస్తున్నాయి!

SIPB ఆమోదించిన కొన్ని టాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ డీటెయిల్స్:

ఐటీ పవర్: కాగ్నిజెంట్ (వైజాగ్) – 8,000 జాబ్స్.

మ్యానుఫ్యాక్చరింగ్ మల్టీప్లై: రేమండ్ (రూ.1,201 కోట్లు), జి.ఇన్ఫ్రా (రూ.1150 కోట్లు), రిలయన్స్ (రూ.1622 కోట్లు) – వేల జాబ్స్.

రెన్యువబుల్ ఎనర్జీ బూమ్: చింతా గ్రీన్ ఎనర్జీ (రూ.2,323 కోట్లు), అదానీ రెన్యువబుల్ (రూ.8,010 కోట్లు), అదానీ హైడ్రో (రూ.10,900 కోట్లు) – వేల జాబ్స్.

ఇతర కీలక సెక్టార్స్: సంగం డెయిరీ, 3ఎఫ్ ఆయిల్ పామ్, ఏబీఐఎస్ ప్రొటీన్స్, మెల్గాన్ లైజర్స్, పావని హోటల్స్, గ్రీన్ పార్క్ హోటల్స్, బెర్రీ అల్లోస్, ఛానల్ ప్లే – వందల నుండి వేల జాబ్స్.

ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ కేవలం నంబర్స్ కాదు. ఇవి లక్షలాది ఫ్యామిలీస్ కి హోప్, ఆస్పిరేషన్స్ ఇచ్చే ప్రోగ్రెస్ ఇండికేటర్స్. లోకల్ జాబ్స్‌తో పాటు, స్కిల్స్ డెవలప్ చేయడానికి, ఎకానమీ గ్రోత్ కి ఈ ప్రాజెక్ట్స్ ఫుల్ హెల్ప్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతోంది, మరియు మన యూత్ కి సూపర్ ఫ్యూచర్ ఉంది!
వెయిట్.. మరో గుడ్ న్యూసో.. బ్యాడ్ న్యూసో కూడా ఒకటి వుంది.

గ్రేట్ ప్రొఫెషనల్ రాజారెడ్డి ఫౌండేషన్ గ్రూపు ద్వారా.. రఫ్ఫా రఫ్ఫా నరికే స్కిల్ల్స్ ప్రోత్సహిస్తున్నామని నిన్న ఆయన గ్రేట్ గ్రాండ్ సన్ అనౌన్స్ చేశారు. ఛాయిస్ మనదే.

LEAVE A RESPONSE