Suryaa.co.in

Food & Health

ఇనుము లోపం!

ఇనుము లోపం తొలగించుకోవటానికి అవి లభించే పదార్థాలను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
పాలకూర ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. మూడు కప్పుల పాలకూర ఒక రోజులో తీసుకుంటే దాని ద్వారా పద్దెనిమిది మిల్లీగ్రాముల ఇనుము అందుతుంది.అంతేకాదు నిత్యం పాలకూరతో చేసిన పదార్థాలు, సలాడ్‌ తినేలా ప్రణాళిక వేసుకుంటే మంచిది.

ఎర్ర కందిపప్పు దీనిలోనూ పీచు, పొటాషియం, మాంసకృత్తులు, ఇనుము సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు పప్పు ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఇనుము లోపం ఉండదు. రక్తహీనత కూడా బాధించదు. ముఖ్యంగా గర్భిణులు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆహారంలో పప్పు ఉండేలా చూసుకుంటే గర్భస్థ శిశివు ఎదుగుదలకు చాలా మేలు జరుగుతుంది. బంగాళాదుంప ఒక బంగాళాదుంపను బేక్‌ చేసి తీసుకుంటే ఇనుము చక్కగా అందుతుంది. అదే పరిమాణంలో చికెన్‌ తీసుకున్నా అంత ఇనుము అందకపోవచ్చు.
నువ్వులు ఒక చెంచా నువ్వుల్లో 1.4 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది.

వీటిని పొడిలా చేయడం లేదంటే నువ్వులతో ఏదైనా వంటకం చేసి తరచూ తీసుకుంటే ఆ పోషకం శరీరానికి సమృద్ధిగా అందుతుంది. గర్భిణులు మాత్రం వైద్యుల సలహాతో తీసుకోవాలి. అప్పుడే నెలసరులు మొదలైన అమ్మాయిలు ఎక్కువగా తింటే బలహీనంగా మారకుండా ఉంటారు. జీడిపప్పు పావుకప్పు జీడిపప్పులో రెండు గ్రాముల ఇనుము ఉంటుంది. అలానే ఇందులో మాంసకృత్తులు కూడా బాగానే లభిస్తాయి. ఇది కూడా ఇనుము లోపాన్ని అధిగమించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సోయా బీన్స్‌ ప్రతిరోజూ ఉడికించిన సోయా ఒక కప్పు తీసుకుంటే రక్తహీనత సమస్య ఉండదు. ఇనుము లోపం కూడా దూరమవుతుంది. కప్పు సోయా ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది మిల్లీ గ్రాముల ఇనుము అందుతుంది.

ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే +919849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు తెలియ పర్చగలము
గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం.
కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే. ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి.

– అమ్మ సేవా సమితి

LEAVE A RESPONSE