Home » తినాలి భోజనం..కానీ మితంగా!

తినాలి భోజనం..కానీ మితంగా!

నేతి గారెలు పది కి మించ కూడదు అల్లప్పచ్చడి తో సహా, మొత్తంగా!!
కరివేపాకు ఇంగువ పులిహోర మూడు కప్పులే తినాలి స్థిమితంగా!!
సేమ్యా జీడిపప్పు కిస్మిస్ పాయసం ఒక పెద్ద గిన్నె కంటే వద్దు హితంగా!!
అన్నం లో ముద్ద పప్పూ నెయ్యీ మూడు సార్ల కంటే కలపకూడదు, ముక్కలపులుసు భరితంగా!!
మినప వడియాలు 30 కంటే వద్దు వీటికి ఊతంగా !!
అన్నం ఒక శేరెడు కన్నా వద్దు, చేమదుంప ముద్దకూర సమేతం గా !!
ఇంగువ జీలకర్ర కందిపొడి వేడన్నం లో మూడు సార్లకంటే కలపద్దు, గానుగ నువ్వుల నూనె సహితంగా!!
ఆనపకాయ ఇంగువ తిరగమాత మజ్జిగ పులుసు ఆరు గరిటెల కంటే కలపకూడదు చాదస్తంగా!
అవనిగడ్డ ఆవు నెయ్యి, ముద్దకి మూడు చెంచాల కంటే వద్దు, ధారాపాతంగా!!
చివరగా అన్నం లో ఒక కుండెడు మించని మీగడ గడ్డపెరుగు మాత్రమే కలపాలి వ్రతంగా!

వాగ్దేవి

Leave a Reply