Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల కోడ్ వైసీపీ నాయకులకు వర్తించదా?

– మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కాన్వయ్ ని మూడురోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేశారు. లోకేష్ కాన్వాయ్ ని పోలీసులు కుట్ర పూరితంగానే తనిఖీ చేస్తున్నారు. కేవలం టీడీపీ నాయకులు కార్లను మాత్రమే తనిఖీ చేయడం దుర్మార్గం.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కారును ఎందుకు తనిఖీ చేయలేదు? మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారును ఎందుకు తనిఖీ చేయలేదు? ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ముఖ్యమంత్రికి, వైసీపీ లీడర్లకు వర్తించదా? జగన్ రెడ్డి ఆదేశం మేరకే లోకేష్ కాన్వయ్, టీడీపీ నాయకులు కాన్వాయ్‌లు తనిఖీలు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మంగళగిరిలో వైసీపీ ఫ్లెక్సీలు తీయకపోవడం దుర్మార్గం. కేవలం ప్రతిపక్ష నాయకుల ఫ్లెక్సీలు, కాన్వయ్‌లను టార్గెట్ చేసి భద్రతా వైఫల్యాలను ప్రమాదంలో పెడుతున్నారు. ఎన్నికల కోడ్ ఎలక్షన్ కమీషన్ నుంచి వచ్చిందని తెలిసి కూడా పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులు ప్రజల రక్షణ కోసం కాకుండా జగన్ రెడ్డి రక్షణ కోసం పనిచేస్తున్నారు. జగన్ రెడ్డి తన దుర్భుద్దితో లోకేష్ భద్రతను ప్రమాదంలో పెట్టాలని చూస్తున్నారు. తాడేపల్లిలో ఉన్న పిల్లి భయంతోనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనేక అరాచకాలను పాల్పడుతున్నారు.

ఐదేళ్లుగా జగన్ రెడ్డి చేసిన మోసాలను ప్రజలు చూశారు. ఇంకా ప్రజల్ని మోసంచేసి అధికారంలోకి రావాలని ప్రయత్నించడం నీవల్ల కాదు. రాబోయే ఎన్నికలు మీకు చివరి ఎన్నికలు. మళ్లీ ఇలాంటి తప్పులు చేస్తే పోలీసులు మీద, ప్రభుత్వం మీద ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE