Suryaa.co.in

Andhra Pradesh

ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు వైసీపీ నేత కారణం

-జగన్ రెడ్డి ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాల ఆస్తులను కాజేస్తున్నారు
-ఆత్మహత్యకు కారకులైన దోషులపై డీజీపీ 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే సాక్షాధాలతో 
-పీఎం, కేంద్ర హోం శాఖలకు లేఖ రాస్తా
-టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న

రాష్ట్రంలో శాంతి భద్రతలతో వెలుగొందాలని శ్రీరాముడికి నిత్యం పూజలు అందుకుంటున్న ప్రాంతం ఒంటిమిట్ట. ఆ ప్రాంతంలోను వైసీపీ నేతలు ఎవరిని వదలటం లేదు. గతంలో వైసీపీ నేతల ఆరాచకాలకు నంద్యాలలో మైనారిటీకి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

ఆ ఘటన మరువకుందమే ఒంటిమిట్టలో మరో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సర్వే నెం. 2187/2 ప్రకారం పట్టాదారుడైన పాల వెంకట చలపతికి 2020 డిసెంబర్ వరకు సాక్షాత్తు పీఎం కిసాన్ యోజనా కింద డబ్బులు ఖాతాలో పడుతూనే ఉన్నాయి. అయినా సాక్షి పత్రిక తప్పుడు రాతలు రాస్తూ నీచపు కథనాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వం దిగిపోతుందని జగన్ రెడ్డికి తెలిసి రాష్ట్రం మొత్తం మీద బడుగు బలహీన వర్గాల ఆస్తులను కాజేస్తున్నారు. కడప జిల్లాలో పులివెందలకు కూతవేటు దూరంలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే జగన్ రెడ్డి ఇంత వరకు ఎందుకు స్పందించలేదు? ఆత్మహత్యలకు కారకులకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీసులు ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ఘటనపై ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం.

ఒంటిమిట్ట ఘటనపై పోలీసులు చూసి చడనట్లుగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ కుటుంబం బీసీ వ్యతిరేక కుటుంబం. జగన్ రెడ్డి తాత నుంచి కూడా బీసీలను అణచివేస్తూ వస్తున్నారు. డీజీపీని విధుల నుంచి తొలగించి పార్టీలకు సంబంధం లేని నిజాయితీ పరుడిని డీజీపీగా నియమించమని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నాం. అంతే కాకుండా బడుగు బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలని కూడా కోరుతున్నాం.

ఒంటి మిట్ట చేనేత కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఉన్న నేరస్థులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి 24. గంటల సమయం ఇస్తున్నాం. మాజీ శాసనమండలి సభ్యుడిగా ఉన్న నాపై రౌడీ షీటర్లకు పెట్టే బైండవర్ కేసులు పెడుతున్నారు.

పీఎం కిసాన్ యోజనా పథకం కింద ఆ చేనేత కుటుంబం రైతు భరోసా తీసుకుంటున్నా కూడా సాక్షి పత్రిక, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోకపోతే ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ కు లేఖలు రాస్తాను.

పోలీసులతో జగన్ రెడ్డి కుమ్మకై ఈ ఘటనపై చర్యలు తీసుకోకుండా చేస్తున్నారు. బీసీలంటే ఎందుకు జగన్ రెడ్డికి చులకన? ఒంటిమిట్ట వెళ్లి ఆ చేనేత కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను. ఆత్మహత్యకు ముందు వాళ్ల స్వహస్తాలతో లేఖ రాసినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు.

లోకేష్ ను చూస్తుంటే జగన్ రెడ్డి దడపుడుతుంది అందుకే ఆయనను అనేక సార్లు చెక్ చేస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ ను ఓడించేందుకు రూ.500 కోట్లు డంప్ చేశారు. ఇదంతా ప్రజాధనమే. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అన్ని నియోజకవర్గాలకు సాక్షి వాహనాల్లో పోలీసుల ఎస్ కార్ట్ లతో డబ్బులు పంపుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు ఎందుకు ఆపడం లేదు? లోకేష్ ఒక సామాన్య కార్యకర్తలా మంగళగిరిలో తిరుగుతున్నారు. ఆయనను ఓడించేందుకు ముగ్గురు అభ్యర్ధులను వైసీపీ మార్చింది. జగన్ రెడ్డి 2004 నుంచి ఇప్పటి వరకు ఎంత ఆస్తి పెరిగిందే అందరికి తెలుసు. అదంతా ప్రజల నుంచి దోచుకున్న డబ్బే. కాబట్టి ఆ డబ్బులు ఈ ఎన్నికల్లో పంచబోతున్నారు. వాటిని ప్రజలు తీసుకొని టీడీపీ ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE