– బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ
గుంటూరు నగరం భారత్ లో ఉందా పాకిస్థాన్ లో ఉందా? గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. జిన్నా టవర్ పై జాతీయ జెండాను ఎగరవేయకూడదా? అని బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ప్రశ్నించారు.
రామకృష్ణ ఏమన్నారంటే ‘‘ జాతీయ జెండా ఎగరవేస్తే తప్పా? జాతీయ జెండా ఎగరవేయటం అవమానకరమా? దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా పాకిస్థాన్ జెండా ఎగరవేస్తారా… మీ విధానం అదేనా?
జిన్నాకు మద్దతిచ్చి మీ ఓటు బ్యాంక్ కాపాడుకుంటారా? జాతికి ఏం చెప్పదలుచుకున్నారు? జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగరవేస్తాం. జిన్నా టవర్ పేరును అబ్థుల్ కలాం టవర్ గా మారుస్తాం. ఫిబ్రవరి ఐదు లోపు జిన్నా టవర్ పై జాతీయ జెండాను ప్రభుత్వ మే ఎగరవేయాలి. లేకుంటే బిజెపి నేతలే జాతీయ జెండా ఎగరవేస్తారు ’’.విలేఖరుల సమావేశంలో కుమార్ గౌడ్,కంతేటి బ్రహ్మయ్య, పాల పాటి రవికుమార్,ఈదర శ్రీనివాసరెడ్డి, భీమినేని చంద్రశేఖర్,వనమా నరేంద్ర,ఆవుల రాము,పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.