Suryaa.co.in

Telangana

ట్రాక్టర్లకు డీజిల్ పోయకపోవడమేనా మీరు తెచ్చిన మార్పు?

– పల్లెలపై మీకు ఉన్న పట్టింపు ఇదేనా?
– ట్రాక్టర్ లో డీజిల్ లేక 20 రోజుల నుంచి చెత్త సేకరణ చేయడం లేదు
– గ్రామాలు స్వచ్చంగా ఉండాలని కేసీఆర్ ట్రాక్టర్లు ఇస్తే అందులో డీజిల్ కూడా పోయని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది
– కాంగ్రెస్ అన్న మార్పు ఇదేనా?
– సఫాయి కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదు
– ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారు
– రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటని పరిస్థితి
– మీకు హెలికాప్టర్ లో ఇంధనం పోయడానికి డబ్బులు ఉంటాయి కానీ ట్రాక్టర్ లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు
– కాంట్రాక్టర్ల నుంచి 10 శాతం, 20 శాతం కమీషన్ వస్తేనే డబ్బులు రిలీజ్ చేస్తున్నారు.
– సఫాయి కార్మికులు కమీషన్ ఇవ్వరు కాబట్టి జీతాలు ఇవ్వడం లేదా?
– సీఎం రేవంత్ నెలకు ఒకసారి కూడా సచివాలయానికి పోవడం లేదు
– హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడమే రేవంత్ కి సరిపోతుంది

నర్సాపూర్ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిప్పల్ తుర్తి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా హరీష్‌రావు ఏమన్నారంటే.. డీజిల్ లేక గ్రామపంచాయతీ ముందు ఉన్న ట్రాక్టర్ ను 20 రోజుల నుండి తీసే పరిస్థితి లేదు. ట్రాక్టర్ డ్రైవర్, కార్మికుడు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగితే డీజిల్ లేక ట్రాక్టర్ ని తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చెత్త సేకరణకు ట్రాక్టర్ రావడంలేదని ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వారు చెప్పారు. ట్రాక్టర్ కి కనీసం సర్వీసింగ్ చేసే పరిస్థితి లేదు. ట్రాక్టర్ కి ఇన్సూరెన్స్ చేపియ్యడం లేదు. రోడ్ టాక్స్ కట్టడం లేదు. చివరికి డీజిల్ కి కూడా డబ్బులు లేక తాళాలు ఎంపీడీవోకి అప్పచెప్పినమని కార్మికులు చెబుతున్నారు.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలని కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు ఇచ్చి ఇంటింటికీ చెత్తబుట్టలిచ్చి, డంప్ యార్డులు నిర్మించి స్వచ్ఛమైన పల్లెలుగా తయారు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితిలో ఉంది. మార్పు మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పోయకపోవడమేనా? ఇదేనా మీరు తెచ్చిన మార్పు?

వర్షాకాలం వచ్చింది అంటు రోగాలు వ్యాపిస్తాయి. చెత్త సేకరణ జరగకపోతే దోమలు పెరిగి మలేరియా, డయేరియా లాంటి రోగాలు వస్తాయి. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వంది. ఎక్కడైనా మంచినీళ్ళ పైపులు పగిలిపోతే కూడా వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు.

సఫాయి కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సఫాయి కార్మికులకు కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. ఈ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సెక్రెటరీని అడుగుతే భయపడుతూ.. ఇప్పటివరకు 80 వేల రూపాయల తన సొంత నిధులను గ్రామపంచాయతీకి ఖర్చులు పెట్టాను అని చెప్పారు. ఆ పెట్టిన 80,000 ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియదు.

110 వీధి దీపాలు ఉంటే 80 వీధి దీపాలు కాలిపోయి 30 మాత్రమే పని చేస్తున్నాయి. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు పెట్టె పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదా? సీఎం రేవంత్ పాలనలో BRS నేతలపై అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టడమే సరిపోతుంది. మీకు హెలికాప్టర్ లో ఇంధనం పోయడానికి డబ్బులు ఉంటాయి కానీ ట్రాక్టర్ లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు. కాంట్రాక్టర్ల నుంచి 10 శాతం, 20 శాతం కమీషన్ వస్తేనే డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. సఫాయి కార్మికులు కమీషన్ ఇవ్వరు కాబట్టి జీతాలు ఇవ్వడం లేదా..?

కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయ్యింది. సీఎం రేవంత్ నెలకు ఒకసారి కూడా సచివాలయానికి పోవడం లేదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడమే రేవంత్ కి సరిపోతుంది. ఎంతసేపు BRS నేతలను అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం కాదు. ఎప్పుడూ జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటే మీకు సమస్యలు తెలుస్తాయా?

LEAVE A RESPONSE