– వాషింగ్పౌడర్ నిర్మా వెటకారం అందుకేనా?
– బీజేపీలో చేరితే కేసులు మాఫీ
( నరేష్)
మధు కోడా, చింతామణి మహారాజా, నవీన్ జిందాల్ లను బొగ్గుల పులి.. కోల్ కింగ్స్ అని మోదీ నిందించి..చివరికి వారికే బీజేపీ ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చరిత్ర చెరిపినా చెరిగేది కాదు.
చరిత్రను క్రీస్తు పూర్వం..క్రీస్తు శకం అని చెప్పుకున్నట్లే..కింది నేతల చరిత్రను బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది.
బీజేపీలో చేరక ముందు కేసులు- చేరిన తర్వాత కేసుల నిలిపివేతలు
ఒక్కరా… ఇద్దరా…వందలాది మంది నేతలు…అంటే వాషింగ్పౌడర్ నిర్మా అన్నమాట. ఇంకేం.. కేసులున్నవారు ‘కమలవనం’లో సేద దీరితే.. వారంతా పునీతులు, పులుకడిగిన ముత్యాలేనన్నమాట!
మచ్చుకు కొందరు
1. మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజీత్ పవార్- సహకార శాఖలో మనిలాండరింగ్ కేసు, ఈడీ విచారణ ..బీజేపీతో చేతులు కలిపాక కేసు మూసివేత
2. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్- ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలు పై ఈడీ, సీబీఐ దర్యాప్తు..బీజేపీతో చేతులు కలిపాక కేసు మూసివేత
3. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నిక్- శివసేనలో ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు, దర్యాప్తు..షిండేతో కలిసి బీజేపీ తో జతకట్టాక కేసు క్లోజ్
4. అస్సాం సీఎం హిమంతా బిస్వాస్ శర్మ- కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారదా చిట్ ఫండ్ స్కాం, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కాంలో సీబీఐ, ఈడీ విచారణ…బీజేపీలో చేరాక ఫైల్ కోజ్..ఎనిమిదేండ్లుగా విచారణ లేదు.
5. ఎన్ సీ పీ నేత హసన్ ముష్రిఫ్..ఆయన చక్కెర పరిశ్రమపై ఈడీ దాడులు..బీజేపీతో కలవగానే విచారణ నిలిపివేత
6. శివసేన యావత్ మాల్ ఎంపీ భవనా గావ్లి.. ఆమె సంస్థలపై ఈడీ దాడులు..షిండే గ్రూపులో చేరిన తర్వాత కనీసం చార్జ్ షీట్ దాఖలు చేయని ఈడీ
7. శివసేన ఎమ్మెల్యే యామిని- ఆమె కుటుంబం ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ, ఐటీ దాడులు…బీజేపీలో చేరగానే కేసుల్లో పురోగతి లేదు
8. టీడీపీ రాజ్య సభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి- బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో ఈడీ, ఐటీ కేసులు.. ఆంధ్రా మాల్యాలను రాజ్య సభ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్.. ఈ ఆంధ్రా మాల్యాలు బీజేపీలో చేరగానే చర్యలు లేవు
9. పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కుమారుడు రనీందర్ సింగ్- ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు..బీజేపీలో అమరేందర్ సింగ్ చేరగానే కేసుల్లో పురోగతి లేదు
10. సమాజ్ వాది పార్టీ ఎంపీ సంజయ్ సేథ్-ఈయన కంపెనీలపై ఐటీ దాడులు, కేసులు, బీజేపీలో చేరగానే చర్యలు శూన్యం, రాజ్య సభ సభ్యత్వం
11. టీఎంసీ ఎంపీ సువేందు అధికారి- డొల్ల కంపెనీల ద్వారా మనిలాండరింగ్ కు పాల్పడ్డారని నరదా స్టింగ్ అపరేషన్ లో దొరికిన సువేందు. వెంటనే సీబీఐ కేసు నమోదు. బీజేపీలో చేరగానే చర్యలు నిల్. బెంగాల్ లో ప్రతిపక్షనేతగా ప్రమోషన్
12. వైసీపీ అరకు ఎంపీ కే. గీత- తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 42 కోట్లు కొల్లగొట్టారని సీబీఐ దర్యాప్తు. బీజేపీలో చేరగానే చర్యలు నిల్, అరకు బీజేపీ అభ్యర్ధిగా అవకాశం
13. కలకత్తా మాజీ మేయర్ సోవన్ చటర్జీ- శారదా చిట్ ఫండ్ కేసులో సీబీఐ దర్యాప్తు. బీజేపీలో చేరగానే దర్యాప్తు నిలిపివేత. ఏడాది తర్వాత తిరిగి టీఎంసీలో చేరగానే అరెస్టు. తర్వాత బెయిల్ పై ఉన్నారు.
14. ఎన్ సీ పీ మంత్రి చగన్ బుజ్ బల్- మనిలాండరింగ్ కేసులో ఈడీ విచారణ. అరెస్టు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత..బీజేపీతో దోస్తి. ఆ తర్వత నత్తనడకగా కేసు విచారణ. విచారణ తీరు పట్ల ప్రత్యేక కోర్టు అసంతృప్తి .
15. కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రుపాశంకర్ సింగ్- అక్రమాస్తులు, మనిలాండరింగ్ కేసులో ఈడీ విచారణ, బీజేపీలో చేరిన తర్వాత కేసు మూసివేత. యూపీ నుంచి లోక్ సభ బీజేపీ టికెట్.
16. గోవా కాంగ్రెస్ మాజీ సీఎం దిగంబర్ కామత్- ప్రభుత్వ కాంట్రాక్టల్లో మనిలాండరింగ్ కేసులో ఈడీ విచారణ. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరక, ఈడీ కేసు లో పురోగతి శూన్యం.
17. కాంగ్రెస్ మహరాష్ట్ర సీఎం ఆశోక్ చవాన్- ఆదర్శ హౌసింగ్ సోసైటి అక్రమాలపై సీబీఐ కేసు, దర్యాప్తు. బీజేపీలో చేరగానే కేసు నిలిపివేత. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక
18. కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్- బొగ్గు స్కాం ఎఫ్ ఐ ఆర్ లో నవీన్ జిందాల్ పేరు. సీబీఐ ఈడీ విచారణ. బొగ్గు దొంగ నవీన్ జిందాల్ అంటూ మోడి 2014, 2019 ఎన్నికల్లో ప్రచారం. బీజేపీకి 123 కోట్ల ఎన్నికల చందా ఇచ్చిన జిందాల్. ఆ తర్వాత బీజేపీలో చేరిక. బీజేపీ ఎంపీగా పోటీ. బొగ్గు స్కాం విచారణ గాలికి పోయింది.
19. టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్- సివిల్ పనుల్లో మనిలాండరింగ్. ఈ డీ కేసు విచారణ. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ. నిలిచిపోయిన ఈడీ విచారణ.
20. కాంగ్రెస్ నేత అర్చనా పాటిల్- కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు. ఆమె కంపెనీపై ఐటీ దాడులు, కేసులు. ఫిబ్రవరి 2024 లో ఐటీ క్లీన్ చిట్. మార్చిలో బీజేపీలో చేరిక. లాతుర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధి.
21. గీతా కోడా- బొగ్గు స్కాంలో సీబీఐ విచారణ ఎదుర్కుంటున్న మధు కోడా సతీమణి. నత్త నడకగా సీబీఐ విచారణ. బీజేపీలో చేరిక, జార్ఖండ్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ .
22. ఎన్ సీ పీ నేత బాబా సిద్దిఖి- మనిలాండరింగ్ కేసులో ఉన్నారు. అజీత్ పవార్ తో కలిసి బీజేపీతో చేతులు కలిపాక, నిలిచిపోయిన ఈడీ విచారణ.
23 కాంగ్రెస్ నేత జ్యోతి మిర్ధా- షెర్ మార్కెట్ మోసాలకు సంబంధించి జ్యోతి మిర్ధా కంపెనీలపై ఈడీ దాడులు. బీజేపీలో చేరిక, రాజస్థాన్ నుంచి లోక్ సభ టికెట్. నిలిచిపోయిన ఈడీ విచారణ.
ఇలా ఇంకెందరో నేతలున్నారు. బీజేపీలో చేరగానే విచారణ నుంచి విముక్తులయ్యారు. ఇంకా చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. అవినీతిపరుల అంతు చూస్తామని చెప్పడం విచారకరం. నమ్మలేని వింతల్లో వింత. అది బీజేపీకే సాధ్యం మరి!