– కష్టించి పండించినా కొనుగోళ్లు చేయరా?
– గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర
– రేవంత్‌రెడ్డి సర్కారుపై ‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: బడా భాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం. చోటా భాయ్ పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తు. గుజరాత్ లో మద్దతు ధరకు మించి రూ.8,257 రేటు. మరి తెలంగాణలో పత్తి రైతుకు కేవలం రూ.5 వేలేనా ? మార్కెట్ కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలెక్కడ ? ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెస్తారా ?
రెండేళ్ల క్రితం పత్తికి 10 నుంచి 15 వేల ధర. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏమిటీ అనర్థం ? నిన్న పెట్టుబడి సాయం అందించలేదు.నేడు కష్టించి పండించినా కొనుగోళ్లు చేయరా? పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం. ముందుచూపు లేని ముఖ్యమంత్రి వల్లే ఈ అన్యాయం.
గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర
ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వేల కోట్లు ఉన్నాయి కానీ.. పేద విద్యార్థుల చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా ? సిగ్గు, సిగ్గు….. ఇది గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర లాగా కనబడుతున్నది.