– వీళ్ళ పదవులు పేరుకే నా?
విశాఖలో దారుణం.. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం
ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికకు బెదిరింపులు.
బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చి నిలదీసిన బాలిక తల్లిదండ్రులు.
భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భార్కను ముక్కలుముక్కలుగా నరికిన భర్త
రోజూ పత్రికలు, టీవీలు చూసే ప్రజలకు ఇలాంటి దారుణ వార్తలు చూడటం- చదవడం సాధారణంగా మారటం విషాదం. ఇది సమాజానికి, సర్కారుకు సిగ్గుచేటు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిర్నిరోధంగా జరుగుతున్నా, ఏఒక్కరిపైనా కఠిన శిక్షలు విధించకపోవడం.. ఆ మేరకు మహిళా కమిషన్లు సీరియస్గా దృష్టి సారించకపోవడమే ఈ విషాదాలకు ప్రధాన కారణం. ఒక్క నిందితుకియికయినా కఠిన శిక్ష విధించి ఉంటే.. అది మిగిలిన వారికి హెచ్చరిక అయ్యేది. అది లోపించడమే నేరమంటే భయం లేకపోవడానికి ఒక కారణమవుతోంది. ఇందులో పౌరసమాజం వైఫల్యమూ లేకపోలేదు. కళ్లెదుట జరుగుతున్న అరాచాలను అడ్డుకుని, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని నేలబారుతనం కూడా ఈ విషాదానికి ఒక కారణమన్నది నిష్ఠుర నిజం.
స్త్రీల మీద దారుణాలు ఎక్కువైపోయినయ్ మరీ పసిపిల్లలను కూడా చూడకుండా కామాంధులుగా పెరుగుతున్నారు ప్రభుత్వం కఠిన శిక్షలు వేయాలి.
ఏపీలో గత ప్రభుత్వంలోని మహిళ హోమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రభుత్వంలోని మహిళా హోంమినిస్టర్. అయినా ఏ మాత్రం తగ్గని సంఘటనలు. ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్న దాడులపై హోం మినిస్టర్స్ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు? ఎలక్షన్స్ ముందు ఒక మాట. ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట ప్రభుత్వాల తీరు.
రాష్ట్రంలోని అక్క చెల్లెలు అందరికీ మేమే అండగా ఉంటాము అన్న మేధావి వర్గం ఎందుకు స్పందించి ఆచరణలో పెట్టడం లేదు? ప్రజలందరూ గమనించండి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న క్రైమ్ రిపోర్ట్ 2025 ఈ సంవత్సరం క్రైమ్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఆగస్టు నెలలో క్రైమ్ విపరీతంగా పెరిగింది. దీనికి కారణం ఏంటి ? ఈరోజు రేపు ఎవరు వంతు? చూస్తూ ఇలాగే ఉందామా? మహిళలకు పేరుకేనా? పదవులు ఐఏఎస్, ఐపిఎస్ పదవిలో ఉన్నవాళ్లు , క్రైమ్ తగ్గించడానికి కార్యాచరణ ఏం చేస్తున్నారు?
గత ప్రభుత్వంలోనూ అంతే! ఇంత జరుగుతున్నా ప్రజల్లో స్పందన కరువు. వీళ్ళ పదవులు పేరుకే నా? నిజంగా ఆ పదవులకు పవర్ ఉంటే వెంటనే స్పందించి, జరుగుతున్న క్రైమ్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి , హోమ్ డిపార్ట్మెంట్ కి పంపించేవారు. పంపించి ఉంటే ప్రెస్ రిలీజ్ చేసేవారు.

సోషల్ ఆక్టివిటీస్, హెవెన్ హోమ్స్ సొసైటీ ఎన్జీవో, ఫౌండర్ ప్రెసిడెంట్, సోషల్ ఎంటర్ ప్రైనర్