Suryaa.co.in

Andhra Pradesh

ఇలాగేనా.. పురస్కారాలు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,

నమస్కారములతో,

ఆర్యా..!

 

మళ్ళీ తెలుగునేలపై ఉగాది పురస్కారాలు/ కళా రత్న అవార్డులను పునరుద్ధరించినందుకు కృత జ్ఞతలు.. అలాగే ఈ ఏడాది నాకు ఉగాది పురస్కా రం ప్రకటించిన రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతాంజలి.
ఈ ఏడాది ఉగాది పురస్కారాలు/ కళారత్న అవార్డు ల ప్రదానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విష యాలను మీ దృష్టికి తెస్తున్నాను.

ఈ ఏడాది ఉగాది పురస్కారాలు ప్రహసనంగా తయారయ్యాయి.. చివరి నిముషం వరకు అసలేం. జరుగుతోందో కూడా తెలీని గందరగోళం పరిస్థితి నెలకొంది. అసలు ఎంతమందిని పురస్కారాలకు/ కళారత్న అవార్డులకు ఎంపికచేశారో కూడా చెప్పకుం డా, అధికారికంగా వెల్లడించకుండా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలదన్నేలా గోప్యత పాటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 100మందికి ఉగాది పురస్కా రాలకు, 73మంది కళారత్న అవార్డులకు ఎంపికైన ట్టు అనధికారికంగా ప్రచారంజరిగింది. 29 వతేదీ రాత్రికి వందమంది కాస్తా. 116 అయ్యారు. 73 మంది కాస్తా 86 అయ్యారు.29 రాత్రివరకు కూడా నాకు తెలిసి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు..తెల్లారే సరికి ఈ సంఖ్యలు కూడా మారవొచ్చు.

పత్రికల్లో, మీడియాలోకూడా కనిపించలేదు.సోషల్ మీడియాలో మాత్రం ఈ అంకెలు షికారు..చేస్తున్నాయి..ఇక తుదిజాబితా 29 తేదీ రాత్రి వెలువడలేదు.(తెల్లారే 8 గం. లకు విజయవాడలో ఫంక్షన్)
నా వరకు నాకు.. 29.3.2025(తెల్లారి 8.00 గంటల కు ఫంక్షన్)మధ్యాహ్నం 3.00 గంటలకు ఫోన్లో పుర స్కారం..వచ్చిందన్న విషయం చెప్పారు. అప్పుడు నేను హైదరాబాదు నివాసంలో వున్నాను. వరుసగా ఉగాది..రంజాన్, శ్రీరామనవమి సెలవులు రావడం తో రైళ్ళు, బస్సుల్లో టికెట్లు దొరకలేదు.. ఫలితంగా నేను పురస్కారం అందుకోవడానికి విజయవాడకు రాలేకపోయాను.

మామూలుగైతే కనీసం నాలుగైదు రోజులముందే ఎంపికైన పురస్కార గ్రహీతలకు అధికారిక సమా చారం అందజేయాలి. రెండు రోజుల ముందు ఆహ్వా న పత్రం, కార్యక్రమ వివరాలు, వసతి,సభాస్థలి వివరాలు స్పష్టంగా తెలియజేయాలి.. అయితే..ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమంలో ఇవేమీ జరగకపోగా…పురస్కార గ్రహీతల ఎంపిక నుంచి,జాబితాప్రకటన వరకు నిండా ఆలస్యం.. దాపరికమే చోటుచేసుకుంది.. ఫలితంగా నాలా దూరప్రాంతాల్లో వున్నవారు ఈ కార్యక్రమానికి.. హాజరుకాలేని పరిస్థితి యేర్పడింది. ఇతరులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగింది.

దీనికి కారణం ఏమంటే డిపార్ట్ మెంట్ వారు,నిర్వాహవర్గం యేం ఏం చెబుతారు.. ఏమిటీ ఆలస్యం? ఎందుకీ… నిర్లక్ష్యం. ఏమిటీ దాపరికం.దాగుడుమూతలాట. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత అవసరం కాదా?

పురస్కారాలకు ఎంపికైన వారికి కనీసం నాలుగైదు రోజులముందుగా తెలియజేయాలి. అలాగే ఆహ్వా నం, కార్యక్రమ వివరాలు, సభా ప్రాంగణం పాస్… అందజేయాలి.. ఈసారి ఇలాంటివేం లేకపోగా…. పురస్కారాలు వచ్చిన వారికి సమాచారం చివరి క్షణంలో ఫోన్ ద్వారా తెలియజేయడంతో పురస్కా రం అందుకోటానికి రాలేకపోయిన వారున్నారు. ఇది సంబంధిత శాఖ, అధికారుల నిర్వహణ అలక్ష్యమా? సమన్వయ లోపమా? ఏదేమైనా సాఫీగా జరగాల్సిన కార్యక్రమం గందరగోళంగా తయారైంది. ఇటువం టి సందర్భాలు, సంఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను, సామర్ధ్యాన్ని తక్కువచేస్తాయి.. పనిచేసే ప్రభుత్వం లో ఇలా జరగడం నిజంగా దురదృష్టం.

ఈ పురస్కారాల ఎంపికకు నియమ నిబంధనలు కానీ, మార్గదర్శక సూత్రాలుకానీ ఏవీ వున్నట్టు లేదు. దీనివల్ల ఎంపికలో అవకతవకలుచోటుచేసుకున్నా యి.ఎవరిష్టం వచ్చినట్టు, వాళ్ళు తమ అభ్యర్థుల్ని ఎంపికచేసుకున్నారు. కూడికలు, తీసివేతలతో ఈ తతంగం చివరి నిముషం వరకు కొనసాగింది.. ప్రభు త్వ పరంగా ఇచ్చే పురస్కారాలు/ అవార్డులు కాబట్టి పారదర్శకంగా వుండాలి. కానీ ఎంపిక కమిటీ ఈ.. విషయాన్ని పూర్తిగా విస్మరించి చివరిదాకా దాపరికం తోనే వ్యవహరించడం శోచనీయం..

కుల ప్రస్తావనలెందుకు?

నాలుగు రోజులముందు కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పిఒకాయన (9505919343) “ మీ కులం.. ఏమిటి? అని అడిగాడు.. ఏడ్వాలో,నవ్వాలో అర్ధం కాలేదు.. అదేంటయ్యా నాపేరు చూశాక కూడా ఈ ప్రశ్న? నేను ముస్లిం అన్నాను.ముస్లింలలో ఇంకేమై నానా? అంటూ సాగదీశాడు..అంటే? అన్నాను.. మరేం లేదు. దూదేకుల పింజారీ.వుంటాయి కదండీ అన్నాడు.తెల్లబోయాను.ఇంతకూ నీకు కులమెందు కు అనే సరికి ఫోన్ పెట్టేశాడు.పురస్కారాలు ప్రతిభకా? లేక కులానికా? అర్ధం కాలేదు.కళకు కులం లేదు..మరి వీళ్ళు మాత్రం కులాల ప్రాతిపదికనే ఎంపిక చేసిన్నట్టుంది..ఇది నిర్ద్వంద్వంగా ఖండించా
ల్సినవిషయం..

దరఖాస్తు ఎందుకు?

అవార్డులు పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవా లన్న నిబంధన మంచిది కాదు.. అవార్డులు అడుక్కో కూడదు.. వ్యక్తుల ప్రతిభా పాటవాలను బట్టి ప్రభుత్వమే గుర్తించి ఇవ్వాలి. అప్పుడే వాటికి మర్యాద, విలువ…అలాకాకుండా ఓ అవార్డు ఇవ్వండి, కనీసం  ఓ పురస్కారమైనా పడేయండి అన్నట్లు అప్లికేష న్ పెట్టుకోవడం కవులు, రచయితలు, కళాకారులను అగౌరవపరచడమేనని నా అభిప్రాయం..

ఏమిటీ సిఫార్సులు..

అనధికారిక సమాచారం ప్రకారం కళారత్న, ఉగాది పురస్కారాలకు ఈ ఏడాది 6000కుపైగా దరఖాస్తు లు వచ్చాయట.చిత్రమేమంటే వీటికి 5000 కు పైగా సిఫార్సులు, ప్రజా ప్రతినిథుల రికమండేషన్ లెటర్లు, రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రుల సిఫార్సు ఉత్తరాలు, చివరకు మన రాష్ట్రానికి చెందినవారే కాకుండా,… ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రుల సిఫార్సు లు కూడా రావడం చోద్యంగా వుంది.. వీటితో పాటు కులాలవారీగా ఎంపిక.. ఇక ఆశ్రిత పక్షపాతం,అస్మ దీయుల ఆశ్రయం, కులం, సిఫార్సుల బలం.కూటమి పార్టీల కోటా..వెరసి అభ్యర్థుల ఎంపికపారదర్శకంగా జరిగిందని ఎలా అనగలం?
ఇక కళారత్న అవార్డుల్లో మతగ్రంథాలు రాసినవారి కి,సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేని సృజన కారులు కానివారికి, సాహిత్యం కేటగిరిలో కళారత్న ఇవ్వడంతీవ్ర అభ్యంతరకరం. ఎంతగట్టి సిఫార్సులు, పైరవీలున్నా ఇలా సంబంధంలేని వ్యక్తులకు అవార్డు లు ఇవ్వడం తగనిపని.. అవాంఛితం.. వందమంది అనర్హులకు అవార్డులు ఇవ్వండి. కానీ దానివల్ల అర్హతగలిగిన ఒక్కరికి అన్యాయం జరిగినా రాజ్యానికి మంచిది కాదు.ఇప్పుడు జరిగింది అదే…!

అన్నట్టు…

ఒక సారి ఉగాది పురస్కారం కళారత్న తీసుకున్న వారు అప్లైచేయడానికి అర్హత లేదన్నారు..గతంలో ప్రకటన ఇచ్చారు..ఈ ఏడాది సారి డబుల్ ధమాకా ఎందుకో ఆర్ మల్లిఖార్జున రావు గారే చెప్పాలి.
ఏతావాతా చెప్పేదేమంటే…

1. వచ్చే ఏడాది నుంచైనాఉగాది పురస్కారాలు/ కళారత్న అవార్డుల ఎంపిక,నిర్వహణను స్ట్రీమ్ లైన్ చేయండి.. రాజకీయాలతో సంబంధం లేని ఆయా రంగాల్లోసుప్రసిద్ధులైనవారితో ఓ ఉన్నత స్థాయి కమిటీవేసి, ప్రభుత్వమే నేరుగా..పురస్కార కర్తల్ని ఎంపిక చేస్తే బాగుంటుంది.మర్యాద,విలువ ఉంటుంది.పైరవీలకు ఆస్కారం తగ్గుతుంది తుంది.

2. ఉగాది పండగకు ఓ వారంముందే పురస్కా రాలకు ఎంపికైనవారికి సమాచారం రాతపూర్వకంగా అందజేయాలి.నాలుగురోజులు ముందే ఆహ్వానపత్రం, కార్యక్రమ వివరాలు పంపాలి.

3. పురస్కార గ్రహీతల ఎంపికకు గైడ్ లైన్స్, తయారు చేసి ప్రకటించాలి.

4. అర్హతగలవారికి, ప్రతిభావంతులకే అవార్డులు అందేలా చూడాలి.

5. పైరవీలు, సిఫార్సు లు అనర్హతగా భావించాలి.

6. పురస్కార గ్రహీతలను ప్రత్యేక అతిథులుగా భావించి మర్యాదగా వ్యవహరించాలి.

పనిచేసే ప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి తగుచర్య నిమిత్తం రాసిన ఈ బహిరంగలేఖను గమనించగలరని మనవి.

– ఎ. రజాహుస్సేన్

LEAVE A RESPONSE