Suryaa.co.in

Andhra Pradesh

షిర్డీ సాయి అవినాష్ రెడ్డికి బినామీ కాదా?

-రూ.12 వేలు ఖరీదు చేసే ఒక్కో స్మార్ట్ మీటర్ ను రూ.30 వేలు పెట్టి కొని రూ.3000 కోట్ల భారీ కుంభకోణం
-స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారు? కుంభకోణం కోసం కాదా?
-సున్నా వడ్డీ రైతు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చి వేయలేదు
-రూ. 3 వేల కోట్ల రూపాయల కుంభకోణం కోసమే స్మార్ట్ మీటర్లతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు
-జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పే లెక్కలు కరెక్టు అయితే ప్రయాస్ రిపోర్టు పబ్లిక్ డౌమైన్ లో ఎందుకు పెట్టడం లేదు?
– మాజీ విద్యుత్ శాఖామాత్యులు కిమిడి కళావెంకట్రావు

రైతులే మాకు స్మార్ట్ మీటర్లు పెట్టండని మ్యాండేటరి పత్రాలు ఇచ్చారని జగన్ రెడ్డిఎనర్జీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరి విజయానంద్ తో అసత్యం చెప్పించారు. అంగీకార పత్రాలు ఇవ్వకుంటే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించి రైతుల దగ్గర తీసుకున్నమాట వాస్తవం కాదా? రూ.12 వేలు ఖరీదు చేసే ఒక్కో స్మార్ట్ మీటర్ ను రూ.30 వేలు పెట్టి కొని రూ.3000 కోట్ల భారీ కుంభకోణానికి షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. షిర్డీ సాయి అవినాష్ రెడ్డికి బినామీ కాదా? మహారాష్ట్ర మీటర్ ప్రాజెక్టు రేటు కన్నా ఏపీ మీటర్ టెండర్ రేటు మూడు రెట్లు అధికంగా ఉన్నదని విజయానంద్ గారు లేఖ రాయలేదా? షిరిడీసాయి, అదానీ లాంటి సంస్థలకు భారీ లబ్ది చేకూర్చి డిస్కంలకు నష్టం కలిగించే చర్య కాదా?.

విద్యుత్ పంపిణీలో స్థూల సాంకేతిక, వాణిజ్య నష్టాలు 15 శాతం కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం స్మార్ట్ మీటర్లు అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాల్ని కోరింది. స్మార్ట్ మీటర్లు, పీడర్లు విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ లైన్లు ఏర్పాటు ద్వారా 2024-25 నాటికి పంపిణీ నష్టాలు 12-15 శాతం తగ్గించాలన్నదే స్మార్ట్ మీటర్లు ప్రధాన లక్ష్యం. దీన్ని అమలు చేసే అధికారాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాల డిస్కంల విచక్షణకు వదిలిపెట్టింది గాని, తప్పనిసరి చేయలేదు. అందువల్లనే తెలంగాణ స్మార్ట్ మీటర్లు ను చేపట్టలేదు. అలాగే దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 36 ఉండగా, అందులో 20 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లు ను చేపట్టలేదు. APలో 2021-22 నాటికే మూడు డిస్కంల సరఫరా నష్టాలు 5-6 శాతానికి మించి లేకపోయినా స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారు? కుంభకోణం కోసం కాదా?

ఫీడర్ స్థాయిలోనే ఎంత వ్యవసాయ విద్యుత్ ఎంత? ఖర్చువుతుందో తెలుసుకోగలినప్పుడు అతి భారీ ఖర్చుతో స్మార్ట్ మీటర్లు పెట్టి ఒక్కో రైతు ఎంత వాడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? మీరు చెబుతున్నవి కరెక్టు అయితే ప్రయాస్ రిపోర్టు ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు? ఇప్పటికే రూ.55 వేల కోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై మోరారు. రేపు ఏప్రిల్ 1 నుండి మరో రూ.3,081 కోట్ల భారాలు మోపబోతున్నారు. స్మార్ట్ మీటర్ల ఖర్చు వేల కోట్లు కూడా రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతారుగానీ, జగన్ రెడ్డి భరించారు. మీటర్ల కోసం వినియోగదారులపైన భారం మోపమనేది అబద్ధం. సున్నా వడ్డీ రైతు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చి వేయలేదు. రైతులే ముందుగా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రేపు మోటార్లకు మీటర్లు పెడితే రైతులు మరింత మునిగిపోతారు. కాబట్టి వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించడాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.

LEAVE A RESPONSE