జగన్ రెడ్డి రాజధానులంటూ ప్రజలమధ్య విద్వేషాలు రాజేయడానికే పాకులాడుతున్నాడు

Spread the love

– రాజుమారినప్పుడల్లా రాజధాని మార్చడం సాధ్యంకాదని న్యాయస్థానంచెప్పినా,
• రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని విస్మరించి మరీ, జగన్ రెడ్డి మెప్పుకోసం తమపదవులకోసం మంత్రులు అమరావతిరైతుల్ని అవమానిస్తున్నారు.
• ఉత్తరాంధ్రపై ఎక్కడలేని ప్రేమఒలకబోస్తున్న అధర్మాన, బొత్స, తమ్మినేని, ఇతరమంత్రులు, వైసీపీనేతలు ఆ ప్రాంతంలో ఎవరిహాయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పగలరా?
• సాగునీటిప్రాజెక్టులకోసం 2004-14మధ్య ఉత్తరాంధ్రకు రూ.1530కోట్లు కేటాయిస్తే, 2014-19మధ్యన చంద్రబాబు రూ.1590కోట్లు ఇచ్చారని సీఎంవోనే చెప్పింది.
• 2019కి ముందు 90శాతం పూర్తైన 5 ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లను జగన్ ఇప్పటికీ ఎందుకు పూర్తిచేయలేదు?
• ఉత్తరాంధ్ర సాగునీటిప్రాజెక్ట్ లకు నిధులు ఇవ్వకపోవడంపై, అక్కడి భూములలూఠీపై బొత్స, అధర్మాన, ఆప్రాంతమంత్రులు ఎందుకు జగన్ రెడ్డిని నిలదీయరు?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

అమరావతి రైతులపై అక్కసుతోనే జగన్ రెడ్డి మూడురాజధానుల నాటకమాడుతూ, ప్రజల మధ్య విద్వేషాలురెచ్చగొట్టి, ఉత్తరాంధ్రదోపిడీయే లక్ష్యంగా తనకుట్రరాజకీయాలు సాగిస్తు న్నాడని, ఆప్రాంతమంత్రులేమో కళ్లుండిచూడలేని గుడ్డివాళ్లలా ముఖ్యమంత్రి దుశ్చర్యలకు వత్తాసుపలుకుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…“రాష్ట్రంలోని పరిణామాలు జగన్ జుగుప్సాకర పాలనకు దర్పణం పడుతున్నాయి.జగన్ రెడ్డి 2014లోనే అమరావతిని స్వాగతించకుండా, అప్పుడే 3రాజధానులని చెబితే ఎక్కడుండేవాడు? చంద్రబాబు విశాఖను ఆర్థికరాజధాని చేస్తే, జగన్ రెడ్డి క్రైమ్ కేపిటల్ గా మార్చాడు. మాటతప్పి మడమతిప్పడం, మోసందగాచేయడం జగన్ రెడ్డి పేటెంట్ రైట్స్. రీఆర్గనైజేషన్ యాక్ట్ తో ఏర్పడిన రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని హైకోర్ట్ చెప్పినా జగన్ రెడ్డి చెవికిఎక్కదా? రాజుమారినప్పుడల్లా రాజధాని మార్చడం కుదరదని న్యాయస్థానంచెప్పినా వినరా?

2019కి ముందు అమరావతి అంగుళంకూడా కదలదని ప్రజల్ని నమ్మించిన జగన్ రెడ్డి, అధికారందక్కగానే వారిని దారుణంగా వంచించాడు. పదవీవ్యామోహంతో ఆయన అడుగులకు మడుగులొత్తుతున్న మంత్రులు చివరికి రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్నికూడా విస్మరించి, పిచ్చిచేష్టలతో అమరావతిరైతుల్ని అవమానించడం సిగ్గుచేటు. కారుమూరి నాగేశ్వరరావుకి మంత్రి పదవిచ్చింది నల్లబెలూన్లు ఎగరేసి, ప్లెక్సీలు కట్టడానికా? కొట్టుసత్యనారాయణకు ఉపముఖ్యమంత్రి పదవికట్టెబెట్టింది అమరావతి రైతుల్ని ఆడిపోసుకోవడానికా? రైతులకు రూ.700కోట్ల ధాన్యంకొనుగోళ్ల తాలూకా బకాయిలు చెల్లించలేని మంత్రి కారుమూరి, అమరావతి రైతుల్ని అవమానిస్తాడా?

వరిపండించే రైతునైన నాకే జగన్ ప్రభుత్వం 6, 7నెలలు గడుస్తున్నా, చెల్లించాల్సిన రూ.4.11లక్షలు చెల్లించలేదు. మే నెల 21న తాను ధాన్యం అమ్మితే, ఇప్పటికీ ప్రభుత్వం డబ్బులివ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులు 10వేలఎకరాల్లో పంటలసాగువదిలేసి, క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు తెలియదా? రైతులకోసం తాను, తమప్రభుత్వం ఏంచేయాలనేదానిపై ఏనాడైన సత్యనారాయణ, జగన్ రెడ్డితో చర్చించాడా?

ధాన్యం బకాయిలు రైతులకు ఎప్పుడుచెల్లిస్తారని ఎప్పుడైనా కారుమూరి నాగేశ్వరరావు, జగన్ రెడ్డిని ప్రశ్నించాడా? ప్రజలకోసం, రైతులకోసం ఏమీచేయడం చేతగాని మంత్రులు, ఉపముఖ్యమంత్రులు అమరావతి రైతులకు వ్యతిరేకంగాబ్యానర్లుకట్టడం, బెలూన్లు ఎగరేయడం నిజంగా బాధాకరం.
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో శ్రీలంకను మించిపోతోందని, ఏపీ బీహార్ కంటే దారుణంగా తయారువుతోందని ప్రజలంతా ఇప్పటికే తీవ్రంగా ఆందోళన చెందుతుంటే, జగన్ రెడ్డేమో రాష్ట్రాన్ని అరాచకంవైపు నడుపుతున్నాడు. అరసవెల్లి రావడానికి అమరావతి రైతులెవరు అనే ప్రశ్నలు జగన్ రెడ్డి కుట్రరాజకీయాల్లోనుంచి పుట్టుకొచ్చినవే. జగన్ రెడ్డి 2014కు ముందు అమరావతికి ఎందుకు వత్తాసుపలికాడు. 2019ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతే ఉంటుందని, అంగుళంకూడా కదలదని చెప్పింది నిజంకాదా? వైసీపీ మేనిఫెస్ట్ కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుసహా, వైసీపీనేతలంతా పోటీపడిమరీ, అమరావతి ఎక్కడికిపోదని ప్రజల్ని నమ్మించింది వాస్తవం కాదా? మాటతప్పడం, మడమతిప్పడం, దగామోసం చేయడంలాంటి వాటిపై జగన్ రెడ్డికి ఉన్న పేటెంట్ రైట్స్ ఎవరికీ లేవు.

రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చడం కుదరదని హైకోర్ట్ చెప్పినా కూడా జగన్ రెడ్డి ఎందుకింత మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన రాజధాని అమరావతిని మార్చే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదని తెలుసు. తమప్రభుత్వానికి, రాష్ట్రశాసనసభకు ఆ అధికారం కల్పించాలని కోరుతూ, వైసీపీఎంపీ విజయసాయిరెడ్డి 06-08-2022న రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు దాఖలు చేసింది నిజంకాదా? దాన్నిబట్టే రాష్ట్రశాసనసభకు రాజధానిని మార్చే అధికారం లేదని స్పష్టమవుతోంది.
మూడు రాజధానులు చేసే అధికారం, అవకాశం రెండూ తనకులేవని తెలిసి, కావాలనే ప్రాంతాలమధ్య విబేధాలు రెచ్చగొట్టడానికే జగన్ రెడ్డి విద్వేషాలకు ఆజ్యంపోస్తున్నాడు. అభివృద్ధివికేంద్రీకరణే లక్ష్యంగా గతంలో చంద్రబాబు పాలనసాగింది. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజం వేసింది చంద్రబాబుగారు. 2014-19మధ్యన రాష్ట్రంలోని 13జిల్లాల్లో ఆయనచేసిన అభివృద్ధే అందుకు నిదర్శనం. ముఖ్యంగా అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన సాగు,తాగునీటికి ఆయన ఎనలేని ప్రాధాన్యతిచ్చారు. 2014-19 మధ్యన ఆంధ్రప్రదేశ్ లో సాగునీటిప్రాజెక్ట్ ల నిర్మాణంకోసం రూ.60వేలకోట్లు ఖర్చుపెట్టినట్టు, ఆక్రమంలో చంద్రబాబుగారే పులివెందులకు నీళ్లిచ్చారని ఇప్పుడున్న సీఎంవో కార్యాలయమే చెప్పింది. ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రికి, ఆప్రాంత వైసీపీనేతలు, మంత్రులకు మాటల్లోనే ప్రేమఉంది తప్ప, చేతల్లోకాదు.

2004-14 మధ్యన పదేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంత సాగునీటిప్రాజెక్ట్ లకు రూ.1531కోట్లు ఖర్చుపెడితే, 2014-19 మధ్యన టీడీపీహాయాంలో కేవలం 5ఏళ్లలో రూ.1591కోట్లు ఖర్చుపెట్టారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలే చెప్పాయి. రాజశేఖర్ రెడ్డి పాలనలోకంటే చంద్రబాబు పాలనలోనే ఉత్తరాంధ్ర సాగునీటి రంగానికి ఎక్కువఖర్చుపెట్టారని తేలిపోయింది. అదేవిధంగా 5ఏళ్లలో చంద్రబాబుప్రభుత్వం రూ.1591కోట్లు ఖర్చుపెడితే, జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నరేళ్లలో కేవలం తూతూమంత్రంగా రూ.490కోట్లతో సరిపెట్టాడు. ఆ నిధులు కూడా గతంలో పనులు చేసిన వారికి చెల్లింపులరూపంలో ఇచ్చినవే.

వంశధార ప్రాజెక్ట్ రెండోదశ, రెండోభాగానికి రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల పదవీకాలంలో (2004-14మధ్యన) పదేళ్లలో రూ.743కోట్లు ఖర్చుపెడితే, 2014-19మధ్యన రూ.878కోట్లు వెచ్చించారు. జగన్ రెడ్డి మూడేళ్లపాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇచ్చిన నిధులు సున్నా. ఆఖరికి తుఫాన్ పరిహారం సొమ్ముని కూడా ఎగ్గొట్టారు. పేరులో ధర్మం ఉంచుకున్న అధర్మాన, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారామ్ లు నిలబెట్టాల్సింది.. నిలదీయాల్సింది జగన్ రెడ్డిని గానీ, అమరావతి రైతుల్ని కాదని సూచిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా తాగునీటికష్టాలను తీర్చడానికి చంద్రబాబునాయుడు వంశధార-నాగావళి అనుసంధానప్రక్రియ ప్రారంభిస్తే, ఆపనులు జగన్ రెడ్డి వచ్చాక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

2019కి ముందు 90శాతం పూర్తైన 5 ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లను జగన్ ఇప్పటికీ ఎందుకు పూర్తిచేయలేదు? ప్రాధాన్యతక్రమంలో 2020నాటికి ఆప్రాజెక్ట్ లను పూర్తిచేస్తానని గతంలో జగన్ రెడ్డి ప్రగల్భాలుపలికాడు. ఉత్తరాంధ్ర సాగునీటిప్రాజెక్ట్ లకు నిధులు ఇవ్వకపోవడంపై, అక్కడి భూములలూఠీపై బొత్స, అధర్మాన, ఆప్రాంతమంత్రులు జగన్ రెడ్డిని ఎందుకు నిలదీయరు? ఉత్తరాంధ్రలోని రూ.40వేలకోట్ల విలువైన భూములదోపిడీపై ఆప్రాంత మంత్రులు ముఖ్యమంత్రిని, విజయసాయిరెడ్డిని నిలదీయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేని, రైల్వేజోన్ సాధించలేని జగన్ రెడ్డి అసమర్థతను బొత్స, ధర్మాన, తమ్మినేని, ఇతర నేతలు ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నాం.
రూ.25వేలకోట్ల రుణంకోసం ఉత్తరాంధ్రలోని భూముల్నిఎందుకు ముఖ్యమంత్రి తాకట్టు పెట్టాడో ఆప్రాంతమంత్రులు ముఖ్యమంత్రిని నిలదీయాలి. చంద్రబాబు విశాఖను ఆర్థికరాజధానిగా మార్చితే, జగన్ రెడ్డి క్రైమ్ కేపిటల్ గా మార్చాడు. భవిష్యత్ తరాలకు ఆప్రాంతంలో ఆస్తులులేకుండా చేస్తున్న జగన్ రెడ్డిని వదిలేసి, టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నవారంతా ముమ్మాటికీ చేతగానివారే” అని రామానాయుడు తేల్చిచెప్పారు.

Leave a Reply