• రుషి కొండపై మాయా మహల్.. నిర్మాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
• జగన్ రెడ్డి పెదవులపై పేదల మాట.. మనసులో సిరుల మూట.. ధనవంతుల బాట
• ప్రజల సొమ్ముతో తాను తన భార్య నివసించడానికి రూ. 500 కోట్లతో నిర్మాణం
• భారత దేశంలో కాదు.. ప్రపంచంలో ఏ నాయకుడు తన నివాసానికి ప్రజా ధనం వెచ్చించలేదు అంత భవనం నిర్మించలేదు
• జగన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రం పేదరికంలో మగ్గుతుంటే పేదలు ఇళ్లు లేక అల్లాడుతుంటే రూ. 500 కోట్లతో తాను తన భార్య నివసించడం కోసం ప్రజా ధనాన్ని వృథాచేసి రుషి కొండలో మాయా మహల్ నిర్మించుకున్నారు
• అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజాకి ఎందుకు ఆ బంగ్లా కడుతున్నారో కూడా తెలియదు. అధికారం పోతుందని తెలిసి తూతూ మంత్రంగా ప్రారంభం చేసి ఫెన్సింగ్ వేశారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అధికార మాయలో ఉన్న జగన్ రెడ్డి తనకే అధికారం శాశ్వతం అనుకున్నాడు.. రాష్ట్రంలో ఇళ్లు లేక పేదలు అల్లాడుతన్నా.. తాను తన భార్య అప్పుడప్పుడు నివసించడానికి ప్రజల సొమ్ములు రూ. 500 కోట్లు వెచ్చించి రుషి కొండకు గుండు కొట్టి మాయా మహల్ ను నిర్మించుకున్నాడు.
జగన్ రెడ్డి పెదవులపై మాత్రమే పేదల మాట.. మనసులో సిరుల మూట.. నడిచేది ధనవంతుల బాట అని ఈ మాయా మహల్ ను చూస్తే స్పష్టంగా అర్థం అవుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వర్ల రామయ్య మాట్లాడుతూ.. భారతదేశంలో కాదు.. ప్రపంచంలో ఏ నాయకుడు తన నివాసానికి ప్రజా ధనం వెచ్చించలేదు. ఇంత భవనం నిర్మించలేదు. స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలలో భారత పార్లమెంట్ నిర్మాణంకు రూ. 700 కోట్లు ఖర్చు అయ్యింది.
జగన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రం పేదరికంలో మగ్గుతుంటే పేదలు ఇళ్లు లేక అల్లాడుతుంటే రూ. 500 కోట్లతో తాను తన భార్య నివసించడం కోసం ప్రజా ధనాన్ని వృథా చేసి రుషి కొండలో మాయా మహల్ నిర్మించుకున్నారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజాకి ఎందుకు ఆ బంగ్లా కడుతున్నారో కూడా తెలియదు. అధికారం పోతుందని తెలిసి తూతూ మంత్రంగా ప్రారంభం చేసి ఫెన్సింగ్ వేశారు.
ఈ రూ. 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు నిర్మించవచ్చు. తాను తన భార్య అప్పుడప్పుడు ఉండటానికి జగన్ రెడ్డి మాయా మహల్ ను కట్టుకోవడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి ఏ రంకంగా చూసిన పేదల మనిషి కాదు… మదించిన ధనవంతుడు. రాష్ట్ర ప్రజలు ఇది గమనించారు.
అందుకే జగన్ రెడ్డికి 11 సీట్లకు ఇచ్చారు. జగన్ రెడ్డి పేదవాడి పక్షం కాదు. ధనవంతుడి పక్షమని సరైన వాత పెట్టారు. జగన్ రెడ్డి భార్యా భర్తల ఆశా సౌదం రుషికొండపై కట్టిన మాయా మహల్. ఆ మహల్ లోని ఒక్క బాత్ టబ్ కు రూ. 45 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ టబ్ ఎవరికైనా ఇస్తే మంచి ఇళ్లు కట్టుకోవచ్చు.
అందుకే పేద ప్రజలు జగన్ రెడ్డిని అసహించుకున్నారు. కీలెరిగి వాత పెట్టారు. పేదలు అలోలక్ష్మణ అంటూ కడుపు కాలి అల్లాడుతుంటే ఈజిప్టు మార్బుల్స్ తో మాయా మహల్ కడతారా? 7 స్టార్ హోటల్స్ కూడా లేని కారిడార్.. జగన్ రెడ్డి మాయా మహల్ లో ఉంది అంటే జగన్ రెడ్డి ఏవిధంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశాడో అర్థం చేసుకోవచ్చు.
స్నానం చేసే టబ్ వద్ద ఏర్పాటు చేసిన ట్యాప్ లతో పేదోడికి ఇళ్లే వస్తుంది. రాష్ట్రపతి, ప్రధాని కోసం అని కొత్త నాటకం.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వాళ్లు కూడా ఈ భవనం చూసి ఆశ్చర్యపోతారు.. జగన్ రెడ్డి దుర్వినియోగాన్ని గమనిస్తారు.
విదేశాల్లో కూడా ఇలాంటి భవనాలు అరుదుగా ఉంటాయి. జగన్ రెడ్డి పేదలకు దూరంగా ఉండే వ్యక్తి, పేదలను అసహ్యించుకునే వ్యక్తి. ఇదంతా చూస్తే జగన్ రెడ్డి రాజకీయాలకు అసలు పనికి రాడని అర్థం అయ్యింది. జగన్ రెడ్డి భార్య భర్తల ఆశలను రాష్ట్రంలోని పేద ప్రజలు అడియాశలు చేశారు. పేదలను కించపరిచిన ఏపార్టీ అధికారంలోకి రాదు.