Suryaa.co.in

Andhra Pradesh

సీఎం స్వయంగా కష్టాలు తెలుసుకోవడం భేష్

– ఆంధ్రప్రదేశ్ కు రూ.5 వేల కోట్లు ఇవ్వాలి
– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే 5000 కోట్లు మంజూరు చేయాలి.ఏపీలో వరద నష్టం తీవ్రత ఎక్కువగా వుంది. ప్రకృతి విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలు కారణంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీ లో నష్టం జరిగింది. ప్రజలు కష్టాల్లో, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.

రైతులు పంటలను కోల్పోయి నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. ప్రధానంగా విజయవాడ గుంటూరు గోదావరి జిల్లాలో వరద నష్టం దుఃఖాన్ని మిగిల్చింది. వందలాది కాలనీలు జలవాసాలుగా మారింది. అనేక జిల్లాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.వరదల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కొందరు దుర్మరణం చెందారు. చాలా ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. వరద బీభత్సానికి రోడ్లు పాడైపోయాయి. ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రూ. 5 వేల కోట్లు సాయం అందించాలి.

వరద విపత్తును ఎదుర్కోవడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవ భేష్. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం బాధితుల్ని స్వయంగా కలిసి, కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న తీరు ప్రశంసనీయం.

LEAVE A RESPONSE