Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

– ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్‌ కుటుంబ సభ్యులు

ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. వైఎస్‌ జగన్, ఆయన సతీమణి శ్రీమతి వైఎస్‌ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

LEAVE A RESPONSE