– తాము జిడిసిసిబిలో జరిగిన రుణాల కుంభకోణం గురించి మాట్లాడుతుంటే బ్యాంక్ ఛైర్మన్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు
– గత రెండేళ్లలో ఇచ్చిన రుణాల వివరాలు పబ్లిక్ డోమైన్లో బహిర్ఘతం చేయాలి
– టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరు: 19-03-2022: జిడిసిసి బ్యాంక్ లో గత రెండేళ్లలో ఇచ్చిన ఎల్టి లోన్లు, మార్టిగేజ్ లోన్లు, స్వయం సహాయక గ్రూపుల లోన్లు, గొర్రెల లోన్లు, తదితర అన్నిరకాల లోన్ల లబ్దిదారుల వివరాలను పబ్లిక్ డోమైన్లో బహిర్గతం చేసే దమ్ము, ధైర్యం బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు @ లాల్ పురం రాముకు ఉందా అని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.
పొన్నూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరేంద్ర కుమార్ పార్టీ నాయకులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. బ్యాంక్ రుణాల వ్యవహారంలో ప్రజాబాహుళ్యం నుంచి వస్తున్న ఆరోపణల నేపధ్యంలో తాను లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేయకుండా అనుకూలమైన వాదనను వినిపించే ప్రయత్నం చేయటం, అసలు వాస్తవాలను దాయటం బ్యాంక్ ఛైర్మన్ కు తగదని చెప్పారు. ఆయన చెప్పిన వినుకొండ వ్యవహారంపై విచారణ పూర్థైందని, అక్రమాలను నిర్దారించటం, బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారని తెలిపారు.
చర్యలకోసం రెవిన్యూ అధికార యంత్రాంగానికి లేఖలు వ్రాయటం జరిగిదని చెప్పారు. నూతనంగా వెలుగులోకి వస్తున్న కాకుమాను, పెదనందిపాడు, పొన్నూరు, నిడుబ్రోలు సొసైటీలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపితే కళ్ళుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని అన్నారు. తాము డిసిసిబిలో రుణాల బాగోతం గురించి మాట్లాడుతుంటే, బ్యాంక్ ఛైర్మన్ రాము వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారని విషయాన్ని తప్పుదోవ పట్టించి నందువల్ల ఉపయోగం లేదని, రైతులతో ముడిపడ్డ ఈ వ్యవస్థలోని లోపాలను సరిచేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందని చెప్పారు.
ఈ కుంభకోణంలో ప్రధానంగా దీర్ఘకాలిక రుణాలు (ఎల్టి లోన్లు), మార్టిగేజ్ రుణాలు రైతువారీగా ఏఏ బ్రాంచ్ లో ఎవరెవరికి, ఎంత మొత్తంలో రుణాలు ఇచ్చారో బహిర్గతం చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాల రుణాలలో ఏఏ గ్రూపులకు ఎంతెంత మొత్తం ఏ బ్రాంచ్ ద్వారా ఇచ్చారో బహిర్గతం చేస్తే తాము చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని నరేంద్ర కుమార్ తేల్చి చెప్పారు.
నరసరావుపేట బ్రాంచ్ లో స్వయంసహాయక సంఘాల రుణాల బాగోతం వెలుగుచూసిన తరువాత ఒకే రోజు ఆ మేనేజర్ అవినీతి సొమ్ము రూ|| 35 లక్షలు కటిన విషయాన్ని చూస్తేనే ఏమేరకు అవినీతి జరిగిందో అర్ధమౌతుందని నరేంద్ర కుమార్ వివరించారు. 2019 సంవత్సరానికి ముందు కేవలం రూ|| 21 కోట్లుగా ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలు రెండళ్లలో రూ|| 600 కోట్లకు చెరతంలో ఉన్న అంతర్యాన్ని తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. తాము అడిగినదానికి చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయటం తగదన్నారు.
నేను అయిదేళ్ల కొకసారి ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ప్రతిసారి తాను, తన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆస్తులవివరాలు ఎన్నికల కమీషన్ కు సమర్పిస్తామని, ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు ఉన్నా చూసుకొని తెలుసుకోవచ్చని అన్నారు. వై యస్ ఆర్ సి పికి చెందిన రాయపూడి సొసైటీ అధ్యక్షుడు హరీంద్ర సహకార శాఖ రిజిష్టార్, కమీషనర్ లకు చేసిన పిర్యాధుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రెస్ మీట్లో మీకు కుడి, ఎడమ వైపున కూర్చున్న బ్యాంక్ సిఈఓ, ఉన్నతాధికారులకు అక్రమ పద్దతులలో నిబందనలు ఉల్లంగించి ప్రమోషన్లు, ఇన్సెంటివ్ లు ఇచ్చారని హరీంద్ర పిర్యాధు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
రైతు రుణపరిమితిని మూడు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచి మీ అనుయాయులు, మీకు కావల్సిన వారు దొంగ పేర్లతో రుణాలు పొంది బ్యాంక్ ను దోచిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. డిసిసిబిలో పదుల సంఖ్యలో ఎన్ఎంఆర్ సిబ్బందిని నియమించుకొని వారి దయా దాక్షిణ్యాలకు వదిలేసిన పాపం ఎవరిదని ప్రశ్నించారు. డిసిసిబి ద్వారా రుణం పొందాలంటే వేలాదిరూపాయలు లంచాలు సమర్పించుకోవాల్సి వస్తుందని రైతులు లబో దిబో మంటూ నెత్తి నోరు బాదుకోవాల్సిన పరిస్తితి వచ్చిందని నరేంద్ర కుమార్ ఆరోపించారు.
బ్యాంక్ రుణాల బాగోతంలో అశోక్ రెడ్డి ప్రమేయం ఉందని ఆయన ప్రమేయంతో అక్రమంగా రుణాలు ఇచ్చామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని, ఈ వ్యవహారంలో ఆయన ప్రమేయమేమిటో ఛైర్మన్ చెప్పాలని కోరారు.
రాజదానికి భూములు ఇచ్చారు కాబట్టి రైతులకు సొసైటీ రుణాలు అవసరం లేదని తాడికొండ నియోజక వర్గంలో సొసైటీలను మూసివేసిన మీరు, మంగళగిరి నియోజకవర్గం లోని రాజధాని గ్రామాలలో సొసైటీలను కొనసాగించటంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని నరేంద్ర కుమార్ అన్నారు. బ్యాంక్ టర్నోవర్ రూ|| 2500 కోట్ల నుంచి రూ|| 4800 కోట్లకు పెంచామని ఘనంగా చెప్పుకునే మీరు షేర్ క్యాపిటల్ వాటా తగ్గుతుందని రైతు మూలదనం వాటాను ఐదు నుంచి పది శాతానికి పెంచటం వెనుకున్న ఆంతర్యం ఏమిటో బ్యాంక్ ఛైర్మన్ రాము వివరిస్తే బాగుంటుందని చురకలు అంటించారు.
బ్యాంక్ ఛైర్మన్ రాము ప్రెస్ మీట్ లో టిడిపి వారని చెప్పిన అక్రమార్కులు కోడె సుధారాణి వైకాపాకు చెందిన చిలకలూరిపేట జెడ్పిటిసిఅని, పెరవలి రాజశేఖర్ జెడ్పిటిసి తమ్ముడని వివరించారు. జిడిడిసిసిబి ఛైర్మన్ రాము వైకాపాకు చెందిన వారిని టిడిపి వారని చెప్పిన ప్రజాక్షేత్రంలో కెళితే వారు ఏపార్టీ వారో అందరికీ తెలుస్తుందని అన్నారు.
బ్యాంక్ రుణాలలో అక్రమాలపై చర్చకు పిలిచే భ్యాంక్ ఛైర్మన్ ముందుగా తన రెండేళ్ల పదవీకాలంలో ఇచ్చిన మొత్తం రుణాల వివరాలు పబ్లిక్ డోమైన్లో పెట్టి చర్చకు వస్తే అందులో ఉన్న లోగుట్టును రుణాల బాగోతాన్ని ప్రజాక్షేత్రంలో చర్చించేందుకు తాము సిద్దమని నరేంద్రకుమార్ తేల్చిచెప్పారు.