Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక సంఘం నిధులను కరెంట్ బిల్లుల కు జమ చేసుకున్నాం అనడం దారుణం

– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్

కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, చోరగుడి గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద జరిగిన ” పామర్రు నియోజకవర్గ ” సర్పంచుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రం పంపిన ఆర్థిక సంఘం నిధులు కరెంటు బిల్లుల కు జమ చేసుకున్నాం అనడం అన్యాయం.

రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీ ల కు కేంద్ర ప్రభుత్వం పంపిన 14,15 వ ఆర్థిక సంఘమ్ నిధులు రూ,, 7,66౦ కోట్లు గ్రామ పంచాయితీ లకు జమ చేసి వారికి తెలియకుండా , సర్పంచ్ తీర్మానం లేకుండా నిధులు డ్రాచేసి కరెంటు బిల్లు లు చెల్లించాము అని ఆర్థిక శాఖ మంత్రి అసత్య ప్రకటన చేయడం హాస్యాస్పదం అసలు మా సర్పంచుల సంతకాలు లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు దొడ్డిదారిన దారి మళ్ళించడమే కాకుండా, కరెంటు బిల్లులు కట్టినామని అసత్యాలు చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

అదేవిధంగా నిజంగా మీరు కరెంట్ బిల్లులు కట్టి ఉంటే, మా గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కట్టినట్లు రసీదులు మా సర్పంచ్ లకు ఎందుకు పంపించలేదని, ఇప్పటికీ కూడా కరెంటు బకాయిలు చెల్లించాలని మా సర్పంచ్ ల పై విద్యుత్ అధికారులు తీవ్ర ఒత్తిడి ఎందుకు చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

బుగ్గన గారూ మా ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా?
1) గ్రామ పంచాయితీలకు కరెంటు మీటర్లు ఉన్నాయా ?
2) మీటర్ల లో కరెంటు ఎన్ని యూనిట్లు కాలింది? రీడింగ్ తీసి గ్రామ పంచాయితీలకు ఇచ్చినారా ?
3) గ్రామ పంచాయితీలకు కరెంటు బిల్లు ఎంత కట్టాలి అని చెప్పి బిల్లు ఇచ్చినారా ?
4 ) గ్రామపంచాయితీల లో నిధులు జమ చేసి సర్పంచ్ సంతకం లేకుండా మీరు ఎలా డ్రాచేస్తారు ?
5) రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వం మీ లాగా దొంగతనం గా డ్రా చేస్తే మీరు ఉరుకొంటారా ?
6) మీరు రాష్ట్రానికి ఎంత జవాబు దారిగా ఉంటారో ! సర్పంచ్ గ్రామానికి అంతే సార్ !
7) మీరు ఆర్థిక మంత్రిగా ఉండి తప్పు చేస్తే చదువు కొన్న వారికీ తప్ప ఎవ్వరికి తెలియదు 8) మా సర్పంచ్ తప్పు చేస్తే, చదువు ఉన్నా లేకపోయినా గ్రామం మొత్తానికి
తెలుసుద్ది. పేపర్ వాళ్ళు ,మీడియా వాళ్ళు కోడి కూతకన్నా ఎక్కువగా ఉంటుంది .
9) ఈ రోజు ఉన్న సర్పంచులకు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిధులు , కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంత ఇచ్చారు ? చెప్పగలరా ?

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి మంత్రిగారు ? మీరు 14,15 ఆర్థిక సంఘం నిధులు ఎలా ఖర్చు చేసినది .కేంద్రప్రభుత్వానికి. ,”యూ సి” ఇచ్చినారా ! లేదా ?

అసలు గత ముఖ్యమంత్రులు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ , నారా చంద్రబాబునాయుడు , వైయస్ రాజశేఖర్ రెడ్డి మైనర్ పంచాయతీలకు విద్యుత్ ఫ్రీగా ఇచ్చారని, మీరు మాత్రం పాత బకాయిలంటూ కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులన్నీ దారి మళ్లించి విద్యుత్ బకాయిలు కింద జమ చేసుకున్నాము అని చెప్పడం రాజ్యాంగ మరియు చట్ట వ్యతిరేకమని, ఇప్పటికైనా మీరు చెప్పే కట్టుకథలు పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆర్థిక సంఘం నిధులు రూ,, 7660 కోట్ల ను వెంటనే మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజేంద్రప్రసాద్.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం నాయకులు వసంతరావు, యేనిగళ్ల కుటుంబరావు, చోరగుడి సర్పంచ్ పూర్ణ కుమారి, శ్రీకాకుళం సర్పంచ్ ముమ్మినేని రవి ప్రసాద్, అచ్చంపాలెం సర్పంచ్ గాజుల శ్రీనివాస్, వేములవాడ సర్పంచ్ సత్యనారాయణ, పెదముత్తేవి సర్పంచ్ పూలపాటి నాగలక్ష్మి, వేల్పూర్ సర్పంచ్ రత్నం దిలీప్, మర్రివాడ సర్పంచ్ పంపు గడవల ఫ్రాన్సెస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE