Suryaa.co.in

Telangana

హైడ్రా పేరిట పేదల ఇళ్ళు కూల్చివేత అన్యాయం!

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: హైడ్రా పేరుతో ప్రభుత్వం సెలెక్టెడ్ దాడులు చేస్తోందని, పాలమూరులో పేదల ఇళ్ళు కూల్చివేత అన్యాయమని, బయటకు అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుతాం అని చెబుతున్నా… తీసుకుంటున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు.

హైడ్రా కార్యాలయమే అలుగులో ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ పార్క్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నాయి…. ఏవి సరిదిద్దగలం? ఏవి సరిదిద్దలేం? అన్న విచక్షణ లేకుండా తీసుకుంటున్న ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలు బాధితులు అవుతున్నారు… పాలమూరులో 75 మంది దివ్యాంగులు, దళితులైన పేదల ఇళ్ళు కూల్చడం దుర్మార్గం.. ఇళ్ళ కూల్చివేతలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను ప్రభుత్వం పాటించలేదు… రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి హామీ ఇచ్చారు.

తొమ్మిది నెలలైనా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు .. పాలమూరులో పేదల ఇళ్ళు కూల్చేశారు…. ఆ నిర్మాణాలు అక్రమం అయితే వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా కూలుస్తారు? కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదానికి పూర్తి విరుద్దంగా ఉంది. రైతుభరోసా రూ.15 వేలు అన్నారు .. రైతుబంధు రూ.10 వేలకే దిక్కులేదు.

రూ.4 వేల ఆసరా పింఛన్‌ అన్నారు .. రూ.2 వేల ఫించన్లకే దిక్కులేదు… గురుకులాల విద్యార్థులే కాదు .. గురుకులాల ఉపాధ్యాయులు కూడా నేడు రోడ్డెక్కారు.. రాష్ట్రంలో 9 ఏండ్లుగా లేని ఉద్యోగుల జేఏసీ కాంగ్రెస్ 9 నెలల పాలనలో ఏర్పడింది.. అందరికీ రుణమాఫీ అని కొందరికే చేయడంతో రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కారు.. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని ఓట్లు దండకుని నిరుద్యోగులు, విద్యార్థులకు టోకరా పెట్టారు.

LEAVE A RESPONSE