తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులు వీరే

– తొలి జాబితాపై రేవంత్ ముద్ర
– తొలిసారి ఎంపీ ఎన్నికల బరిలో రఘువీర్, సునీతా
(మహానాడు ప్రతినిధి-హైదరాబాద్)

తెలంగాణ లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది.

నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి
మహబూబాబాద్‌- బలరాం నాయక్‌
జహీరాబాద్‌ – సురేశ్‌ షేట్కర్‌
చేవెళ్ల – సునీతా మహేందర్‌రెడ్డి

వీరిలో నల్గొండ నుంచి యువనేత, మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి తొలిసారి లోక్‌సభ బరిలో పోటీకి సిద్ధమవుతున్నారు. కాగా తాజాగా వెలువడిన కాంగ్రెస్ తొలిజాబితా పరిశీలిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.

అభ్యర్ధుల ఎంపికలో రేవంత్‌కు నాయకత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి తర్వాత జాబితాలో కూడా రేవంత్ ముద్ర కొనసాగుతుందన్నది సుస్పష్టం. కాగా తాజా జాబితాలో స్థానం సంపాదించిన వారంతా గెలుపుగుర్రాలేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సునీతా మహేందర్‌రెడ్డి ఎంపిక వ్యూహాత్మకంగా కనిపిస్తోంది.

Leave a Reply