– జీహె చ్ఎంసీ కీలక సూచన
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా అప్పటికప్పుడు వెల్లువెత్తుతున్న వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది.
నేడు బుధవారం కూడా అతిభారీ వర్షాల ముప్పు పొంచివుండడంతో జీహె చ్ఎంసీ కీలక సూచన చేసింది. సాయంత్రం వరకు బయటకు రావొద్దని హైదరాబాదీలను హెచ్చరించింది. నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అతిభారీ వర్షాలు, గాలులతో చెట్లు కూలడం, విద్యుత్తు స్తంభాలు దెబ్బతినే అవకాశం సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలిపింది.
కాగా హైదరాబాద్‌కు భారీ ముప్పు పొంచివుందని ఐఎండీ హైదరాబాద్ విభాగం హెచ్చరించింది. గంటలో 3-5 సెం.మీ నుంచి 5-10 సెం.మీ వాన కురిసే అవకాశం అప్రమత్తం చేసింది. మరోవైపు హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాలను కూడా భారీ వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.