Suryaa.co.in

Andhra Pradesh Telangana

వివేకానంద ఆలోచనలు సఫలం చేసిన చంద్రబాబు

-1998లో మహిళా కమిషన్‌ వేసింది తెలుగుదేశం పార్టీయే
– తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు
– తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పాలను ఆర్పించి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు. జనక మహారాజు సభలో యాజ్ఞవల్క్యుడు అనే గొప్ప పండితుడు ఉండేవారు. ఈయనతో గార్గిమాత చర్చలు చేశారు. గార్గి, సీతా వీరిద్దరు మహిళలకు విద్య ఉండాలని మొట్టమొదటగా కోరుకున్నారు.

స్వామి వివేకానంద భారతదేశం అంతా పర్యటించి దేశం బాగుపడాలంటే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం రావాలని, కులం పోవాలని, విద్యా విధానంలో మార్పులు రావాలని, అణగారిన వర్గాలను అక్కున చేర్చుకోవాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వామి వివేకానంద ఆలోచలను సఫలం చేసిన వ్యక్తి చంద్రబాబు . 75 లక్షల మంది మహిళలతో 5 లక్షల డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చారు. తల్లిపేరును రాసే చట్టంను తీసుకొచ్చారు. మహిళలకే ఇంటి స్థలాలను ఇచ్చే విధానాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను, ఆస్తిలో హక్కును ఎన్టీఆర్‌ తీసుకొచ్చారు.

1998లో మహిళా కమిషన్‌ వేసింది తెలుగుదేశం పార్టీయే. ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి సారిగా మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతి ని చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఎంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచారో ఆ ప్రఖ్యాతలో భువనేశ్వరి గారి పాత్ర కూడా ఉంది. ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమి గెలవాలని అందరం ప్రార్థిద్దాం. మనమందరం కలిసి పనిచేయాలని అన్నారు.

రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహా శివరాత్రి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు పండుగలు ఒకేరోజు రావడం యాదృచ్చికమే అయినా అర్థవంతంగా ఉన్నది. శివుడు అర్థనారీశ్వర తత్వానికి ప్రతీక. ఎన్‌టిఆర్‌ పుణ్యం వల్లనే ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం. చంద్రబాబు ని అక్రమంగా నిర్బంధించినప్పుడు నారా భువనేశ్వరి గారు ‘నిజం గెలవాలి’ పేరుతో ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్లారు.

మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినప్పుడే ఈ మహిళా దినోత్సవం అర్థవంతమవుతుందని అన్నారు. దండి ఉద్యమానికి సరోజినీ నాయుడు నాయకత్వం వహించారు. మనం పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలి. మహిళలు శారీరక, మానసిక, ఆర్థిక దోపిడీకి గురవుతూనే ఉన్నారు. పార్టీలో పనిచేస్తున్న మహిళలకు 20శాతం సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.

రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడే మహిళలు పిడికిలి బిగించి మేము సైతం సమానం అని అమెరికాలో ఉద్యమం ప్రారంభించిన మహా శక్తిమంతులు మహిళలు. సంఘ సంస్కర్తలను తయారు చేయాలంటే ప్రధాన పాత్ర మహిళలదే.. చంద్రబాబు గారు భువనేశ్వరి గారిని ప్రోత్సహించడం వల్లనే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా లక్షల మంది ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు భువనేశ్వరి మనకు నాయకురాలు కూడా..

రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజునాయక్‌ మాట్లాడుతూ… మహిళలకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించింది. మహిళలు ఎవరికీ తీసిపోరు. ఏపీలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలి. దీని కొరకు మనమందరం స్వచ్ఛందంగా పనిచేయాలి.

రాష్ట్ర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాం నుంచే మహిళలకు ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. మహిళలు తన కాళ్లమీద తను నిలబడే విధంగా చేసి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదిగే విధంగా ప్రోత్సహించి చైతన్యం చేసింది ఎన్టీఆర్‌, చంద్రబాబు, టీడీపీయే.

మహిళలు బాగుంటే సమాజం బాగుటుంది… సమాజం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది… రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుందని ఎన్టీఆర్‌ మహిళలను గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారు. అనిబిసెంట్‌, మథర్‌ తెరిస్సా వంటి వారు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు, ఆస్తిలో సమాన హక్కులను కల్పించింది ఎన్టీఆర్‌. మహిళా పక్షపాతిగా ఉండే చంద్రబాబు రోష్ని, పావలా వడ్డీ రుణాలు, డ్వాక్రా సంఘాలు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసి మహిళలను అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు.

ఎంతో హుందాగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను నడుపుతూ ఇప్పటి వరకు 20 లక్షల మందికి సేవలందించారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా, చంద్రబాబు భార్యగా నారా భువనేశ్వరి గారు బాధ్యతగా సమాజంలో సేవ చేస్తున్నారు. ఏపీలో కష్టపడి పనిచేసి చంద్రబాబు ని గెలిపించుకుందామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి, జివిజి నాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ధనలక్ష్మీ, సుభాషిణి, కార్యదర్శి ఉప్పల అన్నపూర్ణ, తెలుగు నాడు ఉపాధ్యయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముంజా వెంకటరాజం గౌడ్‌, తెలుగు మహిళా విభాగం నాయకులు ప్రమీల, రaాన్సీ, దాసరి మాల్యావతి, ధనేకడ్‌ రాధిక, ఆశా బింధు, శాంతి, తగరిశ లలిత, మేడిపల్లి రాణి, సుధారాణి, సురేఖ, మహిళా నాయకురాళ్లు వి. శైలజ, రాధిక , దుర్గా, కుంజా స్వరూప తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE