Suryaa.co.in

Andhra Pradesh

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జగన్ రెడ్డి రైతుల్ని ఆదుకోక పోవడం దురదృష్టకరం

– తుఫాన్ ప్రభావంతో ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన రైతులకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భువనేశ్వరి
– నిరుపయోగంగా పడి ఉన్న 11లక్షల టిడ్కో ఇళ్ళు
– అక్కచెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూడటానికే మహిళల కోసం మహాశక్తి పధకం
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
– అడుగడుగునా నల్లారికి నీరాజనం

అన్నమయ్య జిల్లా:పీలేరు రాష్ట్రంలో వరుస తుఫానుల ధాటికి రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ పండించిన పంటలు చేతికందక చేజారుతుండడంతో మళ్లు,చేలు చెరువులను తలపిస్తుంటే జగన్ రెడ్డికు చీమకుట్టినట్టులేదని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం సహాయం అందించక పోవడం ఏంటని,రైతన్నకు కన్నీరు మిగిల్చి, మొద్దునిద్రలోఉన్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపాలని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శించారు.

ఆయన పీలేరు పట్టణంలోని వెలుగు కార్యాలయం,పద్మావతి నగర్, పలువీధుల్లో బాబుషూరిటీ-భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన ఇంటింటా తిరిగి తెలుగుదేశంపార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో పొందుపరిచిన పధకాలను అందరికి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పట్టణంలో మహిళలు, ప్రజలు, అందరూ అడుగడుగునా కిషోర్ కుమార్ రెడ్డికి నీరాజనం పలికారు.

ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వేల ఎకరాల పంటలు నీట మునిగి అతలాకుతలం అవుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో సేద తీరుతున్న జగన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

తుఫాన్ ప్రభావంతో ప్రకృతి ప్రకోపానికి గురైన రైతులకు,సహాయ సహకారాలు అందించడానికి యుద్ధ ప్రాతిపదికనగా శ్రీ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ భువనేశ్వరి సూచనలమేరకు టీడీపీ నాయకులు అందు బాటులో ఉండి సహాయం అందించ నున్నారని అన్నారు.

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పేదోడి స్వంత ఇంటికల నెరవేర్చడానికి “ఎన్టీఆర్ గృహనిర్మాణం పథకం” కింద గేటెడ్ కమ్యూనిటీ తరహాలో 11లక్షల టిడ్కో ఇళ్ళు నిర్మించి పేద కుటుంబాలకు బాసటగా నిలిచి చరిత్ర సృష్టించారని వాటిని పేదలకు అందివ్వడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారని,అవి నిరుపయోగంగా పడి వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కచెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూడటానికి, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి మహిళల కోసం మహాశక్తి పధకం ద్వారా పెరిగిన గ్యాస్ ధరలనుంచి ఉపశమనం కల్పించడానికి దీపం పధకం ద్వారా గృహిణీలకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందించాలని,”తల్లికి వందనం”ద్వారా ప్రతి ఆడబిడ్డకు ఆంక్షలు, నిబంధనలు లేకుండా ఏడాదికి 15వేల రూపాయలు అందించడంకోసం తెలుగుదేశంపార్టీ శ్రీకారం చుట్టనుందని అక్క చెల్లెమ్మలకు అన్నివిధాల ఆదుకొని అగ్రస్థానంలో నిలపడమే తెలుగు దేశంపార్టీ లక్షమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,జనసేన నాయకులు కార్యకర్తలు, అనుబంధం సంఘాలు నల్లారి అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE