కెసిఆర్ ను ప్రగతి భవన్ నుండి రైతుల వద్దకు తీసుకువచ్చింది బిజెపి కిసాన్ మోర్చా పోరాటమే

-ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ప్రకటన కంటి తుడుపు చర్య
-సిపిఐ, సిపిఎం పార్టీలు కేసీఆర్ భజన చేయడం విచారకరం
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కూడా ఈ రకమైన అక్రమ నిర్బంధాలు లేవు
– కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డిని ఎదులాపురం క్రాస్ రోడ్ లో తన -నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి

బీజేపీ, కిసాన్ మోర్చా నాయకుల అక్రమ అరెస్టులు కెసిఆర్ ఆత్మ న్యూనతా భావాన్ని సూచిస్తున్నాయి. కెసిఆర్ ను ప్రగతి భవన్ నుండి రైతుల వద్దకు తీసుకువచ్చింది బిజెపి కిసాన్ మోర్చా పోరాటమే.రైతుల పక్షాన పోరాడాల్సిన సిపిఐ, సిపిఎం పార్టీలు కేసీఆర్ భజన చేయడం విచారకరం.రైతు సంఘాల నాయకులను ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా నిర్బంధిస్తే తప్ప స్వేచ్ఛగా పర్యటన చేయలేని కెసిఆర్.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో బిజెపి నాయకుల్ని కార్యకర్తలని రాత్రి నుండే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కూడా ఈ రకమైన అక్రమ నిర్బంధాలు లేవు.వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఎక్కడా క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని నమోదు చేయలేదు. మొద్దు నిద్ర వీడిన కేసీఆర్ పరామర్శ కార్యక్రమాన్ని ప్రారంభించారు.రైతు సంఘాల విజ్ఞప్తులను స్వీకరించే ప్రయత్నం చేయకుండా అక్రమంగా నిర్బంధించడం గృహనిర్బంధాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే.ముఖ్యమంత్రి అహంకారం కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల తెలంగాణలో రైతులు బలైతున్నారు.

కేసీఆర్ తన అహంకారాన్ని వీడి ఇప్పటికైనా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలి. ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ప్రకటన కంటి తుడుపు చర్య.
ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్.

Leave a Reply