-సమైక్య వాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి, దావత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్
-‘బీఆర్ఎస్’ ఎప్పటికీ ‘బంధిపోట్ల రాష్ట్ర సమితి’ నే
-ఇక్కడే ఏమి పీకలేనోడు … దేశ రాజకీయాల్లో ఏం పీకుతాడు?
-తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
ఇవాళ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ని ప్రకటించి, మీటింగ్ పెడితే… ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదు.అది ఆవిర్భావ సభలా లేదు… సంతాప సభలా ఉంది.పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను తీసేసిండు. బెంగళూరు లో డిపాజిట్ రాని వాళ్ళను తెచ్చుకున్నాడు.పార్టీ ప్రారంభించినప్పుడు ఏం చేస్తాడో చెప్పాలి.సమైక్య వాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి, దావత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్.మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అంటున్నాడు.
కేసీఆర్ తెలంగాణ మీద మాట్లాడే అర్హత కోల్పోయాడు. దిక్కు, దివానా లెనోళ్ళను, తుక్డే గ్యాంగ్ ను పట్టుకొచ్చిండు. బీఆర్ఎస్ కాదు… బందిపోట్ల రాష్ట్ర సమితి.
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు.పంజాబ్ లో రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి.కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడు?కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నది.కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లిక్కర్ దందా చేస్తుందేమో చూడాలి. బిడ్డ లిక్కర్ దందా పక్కకు పోయేందుకే… BRS పార్టీ అంటూ నాటకాలు.
జాతీయ పార్టీ పెడితే… విధివిధానాలు ఉండాలి.కేవలం తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నం.గుజరాత్ లో బిజెపి గ్రాండ్ విక్టరీ నుంచి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ప్రకటన. ‘బీఆర్ఎస్’ ఎప్పటికీ ‘బంధిపోట్ల రాష్ట్ర సమితి’నే.
కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసిండు.తెలంగాణకు 575 టీఎంసీ లు రావాల్సి ఉంటే…299టీఎంసీ లకే సంతకం చేసి, తెలంగాణ నోట్లో మన్ను కొట్టిండు.కాళేశ్వరం ప్రాజెక్టు లో కోట్లు దండుకున్నడు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య పరస్పర కమిషన్ ల అండర్స్టాండింగ్ ఉంది.రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక్కడే ఏమి పీకలేనోడు … దేశ రాజకీయాల్లో ఏం పీకుతాడు? కేసీఆర్ వి అన్నీ బూటకపు వాగ్దానాలే.కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చాడు?కాషాయ జెండా కాంతిలో రంగురంగుల జెండాలు మాడి మసైపోతాయి. కాషాయ జెండా పవర్ అది.