కమ్మోళ్ళని మోసం చేయడం చాలా ఈజీ

– కమ్మోళ్ళు తెలివైన వాళ్ళం అనుకునే అమాయకులు
– టీడీపీని దెబ్బ కొట్టాలంటే కమ్మోళ్ళని నమ్మిస్తే చాలు
– మరోసారి మోసపోవడానికి రెడీగా ఉండండి

అమిత్ షా ఎన్టీఆర్ & రామోజీరావుని కలవడం వెనుక ఉన్న రాజకీయ ఎత్తుగడ ఏంటి?
అమిత్ షా వీళ్ళ ఇద్దరిని కలవడం అనేది పూర్తిగా బీజేపీ, వైసీపీ రాజకీయ ఎత్తుగడ.

2019 ఎలక్షన్స్ ముందు జగన్ కూడా రామోజీరావుని కలిసాడు, అప్పుడు కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు, కొంతమంది కమ్మవాళ్ళు రామోజీరావు తోపు అంటూ కీర్తించుకుంటూ, జగన్ లో మార్పు వచ్చిందని భ్రమ పడ్డారు. ఇంక అంతక ముందు ఒక సభలో మోడీ చంద్రబాబుని, తన కుర్చీలో కూర్చోమని బలవంతం చేయడం చూసి సంబరపడ్డారు. కాని తరువాత వాళ్ళు చేసింది ఏంటి?

టీడీపీ వాళ్ళకి. అందులో ముఖ్యంగా కమ్మోళ్ళకి కుడుమిస్తే పండగ అనుకునే బ్యాచ్ ఎక్కువ అయ్యారు. వీళ్ళు చంద్రబాబుని చాణుక్యుడు, రామోజీరావుని కింగ్ మేకర్, జూనియర్ ఎన్టీఆర్ అపర మేధావి అనే భ్రమలో బతుకుతుంటారు. అందుకే ప్రత్యర్థులు టీడీపీ మీద ఈజీగా రాజకీయం చేయగలుగుతున్నారు. ముఖ్యంగా కమ్మోళ్ళని మోసం చేయడం చాలా ఈజీ అని అందరికి అర్ధం అయ్యింది.

ఈ పరిణామాన్ని విశ్లేషిస్తే నాకు అర్ధమైంది ఏంటంటే వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుండి మేము తెలివైన వాళ్ళం, చాల సాధించాం అనే భ్రమలో బతుకుతున్నారు. ఎన్నో తరాలు కష్టపడి సంపాధించింది అంతా ఎచ్చులతో రాజకీయాల కోసం తగలెస్తూ, రామోజీరావు లాంటి ఒకరిద్దరు పోజిషన్ లో ఉన్న వాళ్ళని చూసుకొని సంతృప్తిపడుతూ ఉన్నారు. ఎక్కడికో దేశం కాని దేశం వెళ్ళి, అక్కడ సంపాదించి కూడా మెహర్బాని కోసం తగలెసుకుంటున్నారు.

అవతలి వాడు ప్రజల సొమ్ము దోచి, ప్రజలకి బిచ్చం వేసి వాళ్ళ చేత దేవుడు అని కీర్తింప పడుతుంటే, కష్టాన్ని నమ్ముకొని, ప్రజల కోసం ఆస్తులు అమ్ముకొని, ప్రజలకి ఎంతో మేలు చేసిన కమ్మోళ్ళు మాత్రం.. ఇతరుల దృష్టిలో దోపిడీ దారులుగా తిట్లు తింటున్నారు. కమ్మోళ్ళు తెలివైన వాళ్ళం అనుకునే అమాయకులు, సమాజాన్ని నమ్మడం మోసపోవడం వీళ్ళ వీక్నెస్. టీడీపీని కొట్టాలంటే కమ్మోళ్ళని నమ్మిస్తే చాలు, కమ్మోళ్ళని నమ్మించాలంటే ఎవరిని కలవాలో ప్రత్యర్థులకి బాగా తెలుసు, అందుకే మరోసారి మోసపోవడానికి రెడీగా ఉండండి.

రామ్మోహన్

Leave a Reply