Suryaa.co.in

Telangana

చిన్నారెడ్డితో ఉద్యోగుల జే.ఏ.సీ ప్రతినిధుల భేటీ

  • రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దు
  • 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
  • లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చాలి
  • ఉద్యోగుల జే.ఏ.సీ. చైర్మన్ వీ. లచ్చిరెడ్డి విజ్ఞప్తి
  • సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీనిచ్చిన చిన్నారెడ్డి

రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు.

శనివారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ఉద్యోగుల జే ఏ సి చైర్మన్ వీ. లచ్చిరెడ్డీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం చిన్నారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది.

రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వవద్దని, 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డిని కోరారు.

ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని లచ్చిరెడ్డి కోరగా అందుకు చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు.

ఉద్యోగుల పెన్షన్ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చిన్నారెడ్డి జే ఏ సి ప్రతినిధి బృందానికి హామీనిచ్చారు.

ఉద్యోగుల పెన్షన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఉందని, త్వరలోనే తగిన నిర్ణయం జరుగుతుందని చిన్నారెడ్డి తెలిపారు.

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చిన్నారెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని చిన్నారెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE