కోడిగుడ్లు, ఆహార ప్యాకెట్లపై బొమ్మలు వేసుకోవడంలో ఉన్న శ్రద్ధలో సగం కూడా జగన్ కు అంగన్ వాడీ కేంద్రాల్లోని సమస్యలు, అహారంపై లేదు
• జగన్ పేదల పక్షపాతే అయితే పేద పిల్లలు తినే ఖర్జూరాల్లో పాము కళేబరాలు వస్తే ఎందుకు స్పందించలేదు?
• కాంట్రాక్టర్లతో కుమ్మకై, చిన్నపిల్లల ఆహారాన్ని కూడా విషతుల్యం చేస్తున్న సొంతపార్టీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోడు?
• ఆహార ప్యాకెట్లపై, కోడిగుడ్లపై తన బొమ్ములు వేసుకోవడం మానేసి, తక్షణమే అంగన్ వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారం.. మంచి ఆహారంపై జగన్ దృష్టిపెట్టాలి.
• భూకబ్జాలు, రిసార్టుల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ అంగన్ వాడీ కేంద్రాలు..అక్కడి ఆహారంపై మంత్రి ఉష శ్రీ చరణ్ కులేదు.
• చిక్కీల్లో పురుగులు … కోడిగుడ్లు మురిగిపోవడం.. ముక్కిపోయిన బియ్యం సరఫరాపై గతంలో ఆధారాలు బయటపెట్టినా మంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు?
• ఆనాడే మంత్రి.., ప్రభుత్వం స్పందిస్తే, పిల్లలు తినే ఆహారపదార్థాల్లో నేడు పాము కళేబరాలు వచ్చేవా?
టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
అంగన్ వాడీ పాఠశాలల్లోని చిన్నారులకు అందించే పోషకాహారం విషయంలో జగన్ కక్కుర్తికి పాల్పడుతున్నా డని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకా న్ని వైఎస్సార్ పురుగుల పోషణగా మార్చాడని టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
“ రాష్ట్రంలో ఉన్న 55 వేలకు పైగా అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు 25 లక్షల మంది ఉంటే, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే నాణ్యమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించాలి. కానీ వాస్తవంలో జరుగేది అందుకు పూర్తి భిన్నం. చిత్తూరు జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే ఖర్జూ రాల్లో పాము కళేబరం బయటపడటం ఈ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం.
పేద మహిళలు…బిడ్డలకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించలేని ముఖ్యమంత్రి పేదల ప్రతినిధా? మంత్రి ఉషశ్రీ చరణ్ తక్షణమే ఖర్జూరప్యాకెట్లలో పాము కళేబరం వచ్చిన ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపించి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి.
పిల్లలకు పాము కళేబరాలు.. పురుగులతోకూడిన అహార పదార్థాలు అందించ డమేనా జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ? ఇలాంటి విషతుల్యమైన ఆహారం పేద పిల్లలకు అందిస్తున్న జగన్ .. తాను పేదల ప్రతినిధినని సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకుంటున్నాడు. పేద మహిళలు.. పేదబిడ్డలకు సరైన నాణ్యమైన ఆహారం అందించలేని ముఖ్యమంత్రి పేదల ప్రతినిధా? పిల్లలు తినే ఖర్జూరాల్లో పాము కళేబరాలు రావడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?
స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తక్షణమే ఈ అంశంపై స్పందించాలి. భూకబ్జాలు, రిసార్టుల ఏర్పాటుపై పెట్టే శ్రద్ధలో సగమైనా మంత్రి అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు.. అక్కడి ఆహారంపై పెట్టాలి. ఖర్జూర ప్యాకెట్లలో పాము కళేబరం రావడంపై మంత్రి తక్షణమే శాఖాపరమైన దర్యాప్తు జరిపించి, అలాంటి ఆహారాన్ని సరఫరా చేసిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
కోడిగుడ్లపై , ఆహారప్యాకెట్లపై తనబొమ్మలు వేసుకోవడంపై జగన్ కు ఆసక్తి… అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న నాసిరకం ఆహరంపై లేకపోవడం విచారకరం
టీడీపీ ప్రభుత్వంలో అంగన్ వాడీ కేంద్రాలు మనో వికాస కేంద్రాలుగా వ్యవహరిం చాయి. మహిళలు, చిన్నారులకు రోజుకో విధంగా నాణ్యమైన, బలవర్థకమైన ఆహారాన్ని అందించాయి. చిన్నారుల జ్ఞాపకశక్తిని.. అవగాహనాశక్తిని పెంచేలా బోధనాపరమైన కార్యక్రమాలు నిర్వహించాయి. అలాంటి అంగన్ వాడీ కేంద్రాల్ని జగన్ రెడ్డి తన ప్రచార పిచ్చి కేంద్రాలుగా మార్చాడు. ప్రభుత్వ పాఠశాలలు.. భవ నాలతోపాటు వాటికి పార్టీ రంగులేసి వేలకోట్ల ప్రజలసొమ్ముని దుర్వినియోగం చేశాడు. ఆఖరికి అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు, ఆహార ప్యాకెట్లపై కూడా తనబొమ్మలు, వైసీపీ రంగులేసే దుస్థితికి దిగజారాడు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో అందించిన కిట్లపై కూడా జగన్ బొమ్మలే. ఏం ఘనకార్యం చేశాడని జగన్ తన బొమ్మలు, తన పార్టీ రంగుల కోసం ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా.. దేశం మెచ్చిన నాయకుడా? తన బొమ్మలు, పార్టీ రంగులకు తగలేసిన సొమ్ముని పిల్లల సంక్షేమానికి వెచ్చించి ఉంటే, నేడు పాము కళేబరాలతో కూడిన అహారం అంగన్ వాడీ కేంద్రాల్లో కనిపించేది కాదు.
గతంలో కూడా ఇలానే కాల పరిమితి ముగిసిన పాలను మహిళలకు, పిల్లలకు అందిం చారు. గతంలో ఎన్నోసార్లు అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసే వస్తువులు, ఆహారపదార్థాలు నాసిరకంగా ఉండటం, బియ్యంలో చిక్కీల్లో పురుగులు రావడంపై ఫిర్యాదులు వచ్చినా… అధికారులు, పీడీలు పట్టించుకున్న దాఖలా లు లేవు. ఈనాడు ఏకంగా ఖర్జూరం ప్యాకెట్లలో పాము కళేబరం వచ్చిందంటే అధికారులు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ఆయన భార్యా పిల్లలు మాత్రం వేలకోట్లు ఖర్చుచేసి మంచి రుచికరమైన ఆహారం తినవచ్చు.. కానీ పేద పిల్లలు పేద మహిళలు మాత్రం పురుగులమయమైన పదార్థాలు తినాలా?
ఉషశ్రీ చరణ్ దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధలోసగమైనా అంగన్ వాడీ కేంద్రాల దుస్థితి.. సిబ్బంది సమస్యలు.. అక్కడి ఆహారంపై పెట్టాలి
అంగన్ వాడీ భవనాలు శిథిలావస్థకు చేరినా, వాటిలో కనీస వసతులు లేకపో యినా..అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచమని కోరినా.. కేంద్రాలకు నాణ్యమైన ఆహారం అందకపోయినా ముఖ్యమంత్రి , సంబంధిత మంత్రి స్పందించరు. చిత్తూ రు జిల్లాలో పాము కళేబరమున్న ఖర్జూరాలు అంగన్ వాడీ కేంద్రానికి ఎలా వచ్చాయో, అవి సరఫరా చేసే కాంట్రాక్టర్ ఎవరో.. వారిపై ఏం చర్యలు తీసుకుంటా రో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మంత్రి ఉషశ్రీ చరణ్ పదవిని అడ్డుపెట్టు కొని దోచుకోవడం కాకుండా..అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు..అంగన్ వాడీ కేంద్రాల దుస్థితి.. కేంద్రాల్లోని ఆహారంపై దృష్టిపెట్టాలి.
అంగన్ వాడీ సిబ్బందికి పనిభారం పెంచిన ప్రభుత్వం వారు అడిగే కనీస వేతనం ఎందుకివ్వదు? దిక్కుమాలిన యాప్ లు పెట్టి… అంగన్ వాడీ సిబ్బందిని..మహిళల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం కేవలం పథకాల్లో కోతలు పెట్టి… లబ్డి పొందాలని చూస్తోంది . జగన్మోహన్ రెడ్డే పెద్ద విషపురుగు.. అలాంటి వ్యక్తి పాలనలో చిన్నారులు, మహిళలకు నాణ్యమైన ఆహారం అందుతుందా?
అంగన్ వాడీ సిబ్బందితో పాటు ఆశావర్కర్లు, యానిమేటర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా మోసపూరిత ముఖ్యమంత్రికి ఎలా బుద్ధిచెప్పాలా అని ఎదురుచూస్తున్నారు. బటన్ నొక్కుతు న్నాను.. తాను పేదలపక్షపాతినని గొప్పలు చెప్పడం మానేసి జగన్ ప్రజల్లోకి వస్తే, వారు పడే బాధలు తెలుస్తాయి. అంగన్ వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆరోగ్యక రమైన ఆహారం అందించే వరకు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వదిలిపెట్టేది లేదు. బాలింతలు, గర్భిణులు, చిన్నారుల పక్షాన ప్రభుత్వంపై పోరాడతాం.” అని సునీత స్పష్టం చేశారు.