మీరు మీ ఎమ్మెల్యేలకు175 మనమే గెలుస్తామ్. నా బటన్ నేను నొక్కుతూనే ఉన్నాను. మీరు గడప గడప కు వెళ్లి, నేను నొక్కుతున్న బటన్ గురించి చెబితే చాలు. తిరిగి ప్రజలు మనలను 175 నియోజకవర్గాలలో గెలిపిస్తారని బోధించారు.
మీరు ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇవి చాలు. మీరు విచ్చలవిడిగా మద్యం రేట్లు పెంచడం ,ఇసుక రేట్లు పెంచడం, సిమెంట్ రేట్లు పెంచడం, ఇంటి పన్ను పెంచడం, చెత్త పన్ను వేయడం , కరెంటు బిల్లులు పెంచడం ,పెట్రోల్, డీజిల్ పెంచడం ,అభివృద్ధి అనేది మచ్చుకు కూడా లేకపోవడం ,రోడ్ల దుస్థితి అతి భయంకరంగా ఉండడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం,160 కేసులలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ,మీకేసులు కొట్టివేయడం ప్రభుత్వ అధికారులు కోర్టుల ముందు తలదించుకోవడం , వారికి శిక్షలు పడడం … ఇప్పటివరకు మీరు 5 లక్షల కోట్లు అప్పు చేయడం , ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టడం ,కొండలు మింగి వేయడం , మైనింగ్ మాఫియాకు అడ్డు లేకపోవడం,గంజాయి విచ్హలా విడిగా పండిస్టుంటె అదుపు చేయకపోవడం, 180 హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తుంటే సరైన చర్య తీసుకోకపోవడం , హిందూ ధర్మం లో నుండి పనిగట్టుకుని క్రిస్టియన్ మతం లోకి మార్చడం అందుకు మీరు ప్రోత్సహించడం , హిందూ భక్తులు కానుకలుగా ఇచ్చిన దేవాలయాల డబ్బును అన్ని మతాలకు ఖర్చు పెట్టడం , శ్రీరాముడు లేని ఇల్లు,పెళ్లి జరగని ప్రజల ఆరాద్య దేవుని తల నరికితే దోషూలను పాటు కోక పోవడం, దళిత వర్గాలను నిట్టనిలువునా చంపుతుంటే సరైన చర్యలు లేకపోవడం ,యిలాంటి అరాచకాలు చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి .
మీకు మీ పథకాలు తిరిగి గెలిపిస్తాయని అంత నమ్మకం ఉన్నప్పుడు, మీరు మీ సొంత జిల్లా బద్వేల్ బై ఎలక్షన్స్ లో కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఓటుకు 2000 రూపాయలు డబ్బులు ఎందుకు పంచారు ? పోలీసులు చేత ఏజెంట్లను లోబరుచుకొని, ఆశలు చూపి, , డబ్బును,మద్యాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టి , మండలానికో మంత్రిని, ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్చార్జిలు గా వేసి ఎందుకు మీకు అనుకూలంగా చేసుకున్నారు .
ఆత్మకూరు ఎన్నికల్లో మీ అభ్యర్థి చనిపోయిన సింపతి ఉందని మీరు భావించారు కదా! మరి ఆ సింపతి ద్వారా, మీరు పెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా, నవరత్నాల ద్వారా ఎన్నికల్లో గెలవకుండా , మీరు అధికారాన్ని, ప్రతిపక్ష పార్టీ పోలింగ్ ఏజెంట్లను కొనేశారు. ఇవన్నీ చేయకుండా ఉండి ఉంటే, మీరు అనుకున్న లక్ష ఓట్లు మెజార్టీ కూడా వచ్చి ఉండేదిగా ! అపుడు ప్రజలలో మీ నవరత్నాలకు ఎంత ఆదరణ ఉందో తెలిసుండేది.
మీరు శాసనసభ్యులకు చెప్పే మాటలన్నీ, ఆచరణలో జరగవని వారికీ తెలుసు. కాబట్టి వారు ప్రజలలో ఫేస్ చేయలేక ప్రజలడిగే మాటలకు సమాధానాలు చెప్పలేక దాటవేసుకుంటూ … బెదిరించుకుంటూ , కొంతమంది ప్రజలు,మహిళలు అడిగే వాటికి సమాధానం చెప్పలేక, పోలీసులను అడ్డం పెట్టుకొని కొన్నిచోట్ల పోతున్నారు. అందుకనే గడప గడపకు పోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇవన్నీ పత్రికలలో వస్తున్న విషయాలే ఏవి దాచి పెట్టేవి కాదు దాగేవి అంతకన్నా కాదు.
కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877 .