Suryaa.co.in

Andhra Pradesh

పూర్తిస్థాయి సైకోగా మారిన జగన్

– ఆరు నెలలకే ప్రభుత్వ వ్యతిరేకత అంటూ పిచ్చి ప్రేలాపనలు
– పార్టీని వీడుతున్న నేతలను నిలుపుకునేందుకు అబద్దాలు
– మంత్రి అనగాని సత్యప్రసాద్

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి పూర్తిస్థాయి సైకోగా మారాడని రాష్ర్ట రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అందువల్లే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు మాత్రమే అయినప్పటికీ ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఉందంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు.

ఎన్నికల్లో ప్రజలచ్చిన తీర్పును గౌరవించే సంస్కారం జగన్ రెడ్డిలో లోపించిందని, తన తప్పులకు ప్రాయాశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి ఓటమిని జీర్ణించుకోలేక ఊహాలోకంలో విహరిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డిలోని నాయకత్వఅపరిపక్వతను గమనించిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం పలోమని వేరే పార్టీలోకి చేరిపోతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎంగా చేసిన నాయకుల నుండి వార్డు మెంబర్లు వరకు అందరూ వైసీపీని వీడుతున్నారని తెలిపారు.

పార్టీని ఎలా రక్షించుకోవాలో తెలియని జగన్ రెడ్డి తనకు అలవాటైన అబద్దాలనే నమ్ముకున్నాడని, తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు అబద్దాలు చెప్పి వారిని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది జరగదని అన్నారు. జగన్ రెడ్డి రాష్ర్టాన్ని సర్వ నాశనం చేసి అప్పుల కుప్పగా మార్చగా.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ర్టాన్ని తిరిగి గాడిలో పెడుతోందని అన్నారు. ఒకవైపు ప్రగతికర విధానాలను చేపడుతూ ఆదాయ మార్గాలను పెంచుకుంటూనే మరోవైపు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు.

రాష్టం పాలిటి శాపాలుగా మారిన జగన్ పాపాలను సరిదిద్దుకుంటూ వెళుతున్నామని, రైతులకు జగన్ రెడ్డి బకాయి పెట్టిన 1674 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్ముకోవడమే కష్టంగా ఉండేదని, అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు. తమ ప్రభుత్వంలో ధాన్యాన్ని కొన్న 24 గంటల్లోగా నిధులు రైతు ఖాతాల్లోకి చేరుతున్నాయని చెప్పారు.

మొదటి సారిగా కౌలు రైతులకు ఈ క్రాపింగ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, విద్యార్ధులకు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టారని, వీటన్నింటనీ కూటమి ప్రభుత్వం తీర్చుతుందోంటూ చెప్పారు. కాగా గత ప్రభుత్వంలో సామన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని, తమ అనుయాయులకు భూములను దోచిపెట్టేందుకు జగన్ రెడ్డి ఎప్పుడూ లేనన్ని భూ వివాదాలను సృష్టించాడని, వాటన్నింటనీ పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు.

LEAVE A RESPONSE