Suryaa.co.in

Andhra Pradesh

డీఎస్సీ విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి

కుప్పం: కుప్పం పర్యటనలో భాగంగా డీఎస్సీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ 2009లో మన ట్రస్ట్ తరఫున డీఎస్సీ కోచింగ్ తీసుకున్న 36 మందికి టీచర్ పోస్టులు వచ్చాయి. 2017 లో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆర్మీ కోచింగ్ లో 36 మంది సెలెక్ట్ అయ్యారు. 2012లో డీఎస్సీ కోచింగ్ లో 16 మంది, 2017 డీఎస్సీలో 27 మంది ఎంపికయ్యారు.

2018 లో ట్రస్ట్ తరుపున శిక్షణ తీసుకున్న వారిలో 12 మంది కానిస్టేబుల్ గా ఎంపికయ్యారన్నారు. పదేళ్లుగా ఎంసెట్ లో మన ట్రస్ట్ ద్వారా శిక్షణ తీసుకుని మెరుగైన ఫలితాలు సాధించారని చెప్పారు. ఈ ఉచిత డీఎస్సీ కోచింగ్ ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకొని ఉపాధ్యాయులుగా సేవలు అందించాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. కోచింగ్ ద్వారా నిరుపేదలందరికీ మేలు జరుగుతోందని చెప్పారు. వీరిలో ఒక విద్యార్థి తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి ట్రస్ట్ కే సేవలు అందిస్తానని చెప్పారు. మరో విద్యార్థి సీఎం చంద్రబాబు నాయుడు తనకు రోల్ మోడల్ అన్నారు. అనంతరం డీఎస్సీ విద్యార్థులకు భువనేశ్వరి పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE