Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ గారూ.. పాలించడం చేతకాకపోతే పక్కకు తప్పుకోండి

– అప్పులు చేసి పరిపాలించడం కూడా గొప్పేనా?
– 8 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిన ఏకైక సీఎం జగనే
-కేంద్రం ఇచ్చే నిధులతో సొంత స్టిక్కర్లతో ప్రచారమా?
– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ

గుంటూరు : భారతీయ జనతా పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో అధిక విద్యుత్ చార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ గుజ్జనగండ్ల విద్యుత్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం విద్యుత్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ శిరిష కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు ఈధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, పరిశ్రమలపై మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే గద్దె దించుతాము. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం దురదృష్ట కరమన్నారు. పరిశ్రమలు సైతం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో అపారనష్టాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సామాన్య పేద ప్రజలయితే విద్యుత్ ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారని, ఇటువంటి పాలన చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించుతారన్నారు.

ప్రభుత్వాన్ని నడపడాన్ని చేతకాకపోతే సీఎం పక్కకు తొలగాలన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం 5సంవత్సరాల కాలంలో 8సార్లు విద్యుత్ చార్జీల పెంచి పేద ప్రజల నడ్డి విరిచారు. గతంలో 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లులు ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తున్న పరిస్థితికి తీసుకొచ్చారు. విద్యుత్ చార్జీల పెంపుతో సామన్యుడినుంచి చిన్న తరహా పరిశ్రమలవరకు మూతపడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెంచిన ట్రూ అప్ చార్జీల మోతతో పేదల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. విద్యుత్ బాదుడుతో ప్రజలు విసికిపోయారని వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం తప్పదని హెచ్చరించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని, అలాగే దేశంలో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్ ను కేవలం 1 రూపాయి 99 పైసలకు ఇస్తుందని, ఉజాలా పధకం క్రింద ఎల్ఈడి బల్బులను దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందించిందని, కాని మన రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం విద్యుత్ బిల్లులను సర్ చార్జీల రూపంలో భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని, మాట తప్పం మడమ తిప్పం అని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని త్వరలో జరిగే ఎన్నికలలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడతారని తెలిపారు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 5ఏళ్లలో 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందనీ ప్రజలకు నాణ్యమైన కరెంటు ఇవ్వటం లేదని, కరెంటు కోతలు ఉంటున్నాయని, ఎక్కడ విద్యుత్ పెంపుకు చర్యలు తీసుకోవడం లేదని, కానీ విద్యుత్ చార్జీలు ఎప్పటికప్పుడు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని, విద్యుత్ చార్జీలు పెంపుకు అనేక రకాల కొత్త పేర్లు పెట్టి ప్రజల నడ్డి విరిచి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నారు.

ప్రజలకు ఉపయోగపడరు, ప్రజల నడ్డి విరుస్తారు, ప్రజల మీద భారం వేస్తారు, ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ప్రజలకు అవసరమైన పనులు చేయాలని జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర నటిస్తూ ఉన్నాడో మొద్దు నిద్ర వదలాలని ధనిక, పేద అని తేడా లేకుండా కరెంటును ఖరీదుగా మార్చిన ఘనత ఈప్రభుత్వానికే దక్కుతుందని, విద్యుత్తును ఖరీదైన వస్తువుగా మార్చిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, యడ్లపాటి స్వరూపరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చెరుకూరి తిరుపతిరావు, కుమార్ గౌడ్, వైవి సుబ్బారావు, మాజీ మంత్రివర్యులు శనక్కాయల అరుణ, రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్, ఇంటలెక్చువల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ టివి రావు, జిల్లా ఉపాధ్యక్షులు తులసి యోగేష్ చంద్ర, మంత్రి సుగుణ, పద్మనాభం, జిల్లా కార్యదర్శులు ఏలూరి లక్ష్మి, జూపూడి దుర్గాభవాని, చంద్రశేఖర్ గుప్తా, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తుళ్ళిమిల్లి రామకృష్ణ యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు నరేంద్రషా, అసెంబ్లీ కన్వీనర్లు కంతేటి బ్రహ్మయ్య, సుధాకర్, కన్నా రవి దేవరాజ్, అనుమోలు ఏడుకొండలు గౌడ్, మండల అధ్యక్షులు బొలగాని సాంబయ్య, రాంబాబు, కూనిశెట్టి చంద్రశేఖర్, శ్రీకల్యాణి, జితేంద్రగుప్త, సాంబమూర్తి, తోట శ్రీనివాస్, షేక్ బిలాల్ వెంకట్, స్టాలిన్, శాస్త్రి, ముత్యం నరేంద్ర, చిలకా సాంబయ్య, దేసు సత్యనారాయణ, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A RESPONSE