-టిడిపి సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది
-దళితుల్లో ఉన్న 62 ఉపకులాలకు న్యాయం చేస్తాం
-టిడిపి హయాంలో 3 వేల ఎకరాలు భూమి కొనుగోలు చేసి మరీ దళితులకు ఇచ్చాం
-దళితులకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తాం
-జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి
-డోన్ నియోజకవర్గం జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్
ఎన్ఎస్ఎఫ్డీసి పథకం కింద గత ప్రభుత్వం లో స్వయం ఉపాధికి అనేక అవకాశాలు కల్పించారు. ఇన్నోవాలు, జేసిబిలు అందించారు. ఇప్పుడు ఆ పథకం అమలు అవ్వడం లేదు. జగన్ పాలన వచ్చిన తరువాత బిజినెస్ లేదు. పైగా కరోనా దెబ్బతో ఈఎంఐ లు కట్టలేని దుస్థితి. ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిని వైసిపి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన దళిత మహిళ రమణమ్మ.
ఎస్సీలకు స్మశాన వాటికలు కూడా లేవు. ఉన్న స్మశాన భూమిని కూడా వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారు. టిడిపి హయాంలో జరిగిన వర్గీకరణ వలన దళితుల్లో అన్ని ఉప కులాలకు న్యాయం జరిగింది. కానీ సుప్రీం కోర్టు తీర్పు వలన మాకు నష్టం జరిగింది. టిడిపి అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు. దళితుల భూముల్ని వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారు. దళితుల ఉన్నత విద్యకు ఉపయోగపడిన విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. అంబేద్కర్ గారి పేరు తొలగించారు. మళ్లీ పథకం ప్రారంభించి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. – డోన్ నియోజకవర్గం ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులు
లోకేష్ మాట్లాడుతూ..
2001 లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు.దాని ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయి.వేల మందికి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. వైయస్ వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన నాటకం, జగన్ పాలనలో జరుగుతున్న నాటకం మీరు చూస్తున్నారు.సుప్రీంకోర్టు పార్లమెంట్ లో చట్టం ద్వారా వర్గీకరణ చెయ్యాలని డైరెక్ట్ చేసింది. ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో చంద్రబాబు జీఓ 25 తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాల అమలు లో వర్గీకరణ తీసుకొచ్చారు.ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా జీఓ 25 తీసుకొచ్చారు చంద్రబాబు. జీఓ 25 వలనే జగన్ మూడు కార్పొరేషన్లు తీసుకొచ్చారు.మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్కరికి రుణం ఇవ్వలేదు.
టీడీపీ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది.దళితుల్లో ఉన్న 62 ఉపకులాలకు న్యాయం చేస్తాం. నేను నా జీవితంలో మొదటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఒక దళిత యువతీ కుటుంబానికి న్యాయం చెయ్యమని పోరాటం చేసినందుకు.గుంటూరు లో రమ్య అనే దళిత యువతి ని ఒక మృగాడు నడి రోడ్డు మీద హత్య చేసాడు. ఆ కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగినందుకు నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి 5 లక్షలు సాయం చేసాం. న్యాయ పోరాటానికి కూడా సాయం చేసాం. దళిత రైతుల కోసం పోరాడినందుకు రెండో సారి స్టేషన్ కి వెళ్ళాను.
కావలి లో వైసిపి నాయకులు వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే టిడిపి ఆదుకుంది. 15 లక్షల ఆర్ధిక సాయం అందించి తనఖాలో ఉన్న ఇల్లు విడిపించి కుటుంబానికి అందజేసాం.దళిత యువతి స్నేహాలతను చంపేస్తే పోరాడింది టిడిపి. రెండు లక్షల ఆర్ధిక సాయం అందించాం.రేపల్లె రైల్వే స్టేషన్ లో ఒక దళిత మహిళ పై అత్యాచారం జరిగితే ఆమె న్యాయం చెయ్యాలి అని పోరాడింది టిడిపి. ఆమె కు రెండు లక్షల ఆర్ధిక సాయం చేసింది టిడిపి.
ఎన్ఎస్ఎఫ్డీసి పథకం ద్వారా ఇన్నోవాలు, జేసిబిలు పొందిన వారు జగన్ పాలన లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలన, కరోనా కారణంగా ఇబ్బంది పడిన లబ్దిదారులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీ భూమి నీకు అందిస్తాం అంటూ హామీ ఇచ్చిన లోకేష్. స్మశానం భూములు లేవని ఎంతో మంది నా దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల స్మశానం కోసం భూములు కేటాయిస్తాం.
జగన్ దళిత ద్రోహి
వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రమణ్యం ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సన్మానం చేసి పాలాభిషేకం చేశారు. సుబ్రమణ్యం కుటుంబానికి 5 లక్షల ఆర్ధిక సాయం చేసింది టిడిపి. పోరాడిన మా ఎస్సీ నాయకుడు ఎంఎస్ రాజు, దళిత నాయకుల పై లాఠీ ఛార్జ్ చేయించింది జగన్ ప్రభుత్వం. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల లో దళిత మహిళ నాగమ్మ ను కిరాతకంగా హత్య చేస్తే టిడిపి నాయకులు పోరాడారు. పోరాడిన ఎస్సీ నాయకులు ఎంఎస్ రాజు, అనిత గారి పైనే ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు. టిడిపి హయాంలో 3 వేల ఎకరాలు భూమి కొనుగోలు చేసి మరీ దళితులకు ఇచ్చాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు భూమి కేటాయింపు కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తాం.
విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. విదేశీ విద్య పథకం కి అంబేద్కర్ పేరు తొలగించడం దుర్మార్గం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. జగన్ పేరు తొలగించి అంబేద్కర్ గారి పేరు పెడతాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం పై చర్చిస్తు న్నాం. త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం.
దళితుల పై అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీని పై విచారణ చేసి అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. టిడిపి పరిపాలనలో ఎప్పుడూ ఎస్సీల పై దాడులు జరగలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎస్సీలకు అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అమలు చేస్తాం. దళితులకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తాం.ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఘోరమైన పరిస్థితి ఉంది. దీనిపై టిడిపి పోరాటం చేస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్ఫేర్ హాస్టల్స్ ని మెరుగుపరుస్తాం. టిడిపి హయాంలో ఎస్సీ ల కోసం 40 వేల కోట్లు ఖర్చు చేసాం. జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఎస్సీలకు 100 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఎవరి హయాంలో న్యాయం జరిగిందో దళితులు అర్దం చేసుకోవాలి.