జగన్ మేనమామ కాదు కంసమామ

-పుస్తకాల ముద్రణ టెండర్లలో సైతం వైసీపీ అవినీతి చీడ పురుగులు
-పుస్తకాల ముద్రణ టెండర్లు పేరుతో రూ.120 కోట్లు అవినీతికి ప్రణాళిక
-కమిషన్ల కోసమే పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం
-తమిళనాడు న్యూస్ ప్రింట్ & పేపర్ లిమిటెడ్ కు రూ.200 కోట్లు బాకాయిలు
-గతంలో సప్లయ్ చేసిన వారికి బాకీలు చెల్లింపులు జరపకుండా రాష్ట్ర ప్రతిష్ణను దిగజార్చిన జగన్ సర్కార్
-కొత్త టెండరు విధానంలో ప్రభుత్వ ఖజానాకు రూ.120 కోట్లు గండి
-చక్రం తిప్పిన సీఎంవో అధికారులు
-మంత్రి కుటుంబం యొక్క ఎన్నికల ఖర్చు కోసం భారీ స్కాంకు తెరలేపి మంత్రి బొత్స
-రాష్ట్రంలో ఎమ్.ఎస్.ఎమ్.ఇ లకు జగన్ రెడ్డి మార్క్ షాకు
ఇంకా ఎంత దిగజారతారు జగన్ రెడ్డి గారు
-రూ.120కోట్ల స్కాం టెండర్‌ను తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలి
– కొమ్మారెడ్డి పట్టాభిరాం

రాష్ట్రంలో అన్ని రంగాల్లో జగన్ రెడ్డి దోపిడి పర్వం కొనసాగుతునే ఉంది. చివరకు చీడ పురుగుల స్కూల్ పిల్లలు చదువుకునే పుస్తకాల ముద్రణలో కూడా జగన్ రెడ్డి దొచుకుంటున్నాడని మండిపడ్డ తెలుగుదేశం పార్టి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టి జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన సాక్ష్యాలతో సహా పాఠ్య పుస్తకాల ముద్రణలో జగన్ రెడ్డి అండ్ కో దోచుకుంటున్న విషయాలను ఆయన బయటపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దోపిడికి అనర్హం కాదు నాకేది అన్నట్లు అది ఇది అని తేడా లేకుండా అన్నింటిలో జగన్ రెడ్డి దోపిడి చేసుకుంటున్నాడు. అనర్హం కానటువంటిది నాకు ఏది లేదు.. ఎందులోనైనా దోచేస్తా అనే సిద్ధాంతాన్ని జగన్ రెడ్డి పాటిస్తున్నాడు. నిసిగ్గుగా స్కూల్ పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల ముద్రణలో కూడా దోపిడి చేస్తున్నాడు. దేశంలోనే విద్య వ్యవస్థ నం.1 అనే ప్రచారం చేసుకుంటున్నాడు. స్కూల్ పిల్లలను అడ్డుపెట్టుకొని అత్యధికంగా దోపిడీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దోపిడీలు, అవినీతి చేయటంలో దేశంలోనే జగన్ రెడ్డి నం.1” అని అన్నారు.

జగన్ రెడ్డి మేనమామ కాదు కంసమామ..
మేనమామ అని టైటిల్ పెట్టుకున్న ఈ కంసమామ అన్ని రంగాలను నాశనం చేసినట్లుగానే విద్యా వ్యవస్థను కూడా నాశనం చేశాడు. పని చేసేటటువంటి ప్రభుత్వ పాఠశాలలను మూసేసి అధ్యాపకుల నియామకాలు జరుపకుండా, వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వాళ్ళ చేత మద్యం దుకాణాల ముందు నించోపెట్టి అగౌరవ పరిచాడు. స్కూల్ పిల్లలకు సౌకర్యాల కల్పనలో కూడా భారీగా అవినీతికి పాల్పడుతున్నాడు ఈ కంసమామ.

అభ్యర్ధులు కరువు..అందుకే సత్తిబాబు కుటుంబానికి 5 సీట్లు..
మునిగిపోతున్న నావ లాగా వైకాపా ప్రభుత్వ పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూలిపోతుందని అర్థమయ్యి పోటీ చేసేందుకు అందరూ విముఖత చూపుతున్నారు. అభ్యర్ధులు దొరకక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి 5 సీట్లు కట్టబెట్టారు. 5 చోట్ల ఎన్నికలు ప్రచారం నేను చేయలేనని మంత్రి ప్రాధేయపడితే ఎన్నికల ఖర్చు కోసం పెద్ద పాఠ్య పుస్తకాల ద్వారా డబ్బును పోగేసేందుకు పెద్ద స్కాంకు తెరలేపారు.

పాఠ్య పుస్తకాల ముద్రణలో రూ.100 నుండి రూ.120 కోట్లు దోపిడీ
2022లో పేపర ధర టన్ను రూ.1 లక్ష ఉన్న రోజున ఒక్కో పేజి ముద్రణకు 23 పైసల ధర నిర్ణయించిన కంసమామ సర్కార్ నేడు పేపర ధర భారీగా తగ్గిన పరిస్థితుల్లో కూడా ఒక్కో పేజి ముద్రణకు 34.2 పైసల ధర నిర్ణయించారు. గతంలో ప్రభుత్వమే పేపర్‌ను కొనుగోలు చేసి పాఠ్య పుస్తకాల ముద్రణకు ప్రింటర్స్‌కు అందించే విధానం ఉంటే ఈ రోజున ఆ విధానాన్ని ప్రభుత్వం రద్దు. ప్రభుత్వమే పేపర్ కొనుగోలు చేస్తే నేడు తక్కువ ధరకే మార్కట్లో పేపర్ అందుబాటులో ఉందనే విషయం మంత్రి సత్తిబాబుకు తెలియదా! ప్రభుత్వమే పేపర్‌ను కొనుగోలు చేసి ప్రింటర్స్‌కు అందిస్తే తద్వార రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయిలు ఆదా అయ్యే పరిస్థితుల్లో నేడు పేపర్ కొనుగోలు కూడా నీ బినామీ ప్రింటర్స్‌కు వదిలేసి ఈ భారీ స్కాంకు తెరలేపావు.

జ్యూడిషియల్ ప్రివ్యూలో హెచ్చరించినా జగన్ రెడ్డి బేఖాతర్
జ్యూడిషియల్ ప్రివ్యూలో తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ లిమిటెడ్ వారు, ఏపి ఆఫ్‌సెట్ ప్రింటింగ్ అసోసియేషన్ వారు మార్కెట్లో పేపర్ ధర తగ్గిన అంశాన్ని ప్రస్తావించి, ఈ టెండర్ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయిల నష్టం అని తెలిపినా ఈ ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. పేపర్ ను ప్రింటర్స్ కొనుగోలు చేసుకొని పూర్తి పద్ధతిని ప్రింటర్సే చూసుకొని పాఠ్య పుస్తకాలను ముద్రణ చేయాలనే నిబంధనను పెట్టి మంత్రి బినామీల చేత బిడ్ వేయించారు. గతంలో రిజిస్ట్రేషన్ అయిన సంస్థలకు మాత్రమే టెండర్ కు బిడ్ వేసేందకు అవకాశమిచ్చేవారు.

కానీ నేడు కంసమామ ప్రభుత్వం ఆ నిబంధనను రద్దు చేసి కనీసం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కానటువంటి సంస్థలకు కూడా టెండర్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించి తన బానామీలను తెరమీదకు తీసుకువస్తున్నాడు మంత్రి సత్తిబాబు. ఈ పద్ధతిని అనుసరిస్తూ కోట్లు దన్నుకుంటున్నాడు. తమిళనాడు న్యూస్ ప్రింట్ & పేపర్ లిమిటెడ్ సంస్ధకు చెల్లించవలసని బిల్లులు రూ.200 కోట్లు చెల్లింపులు చేయకపోవటంతో తమిళనాడు ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది.

ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే భారీ స్కాంకు కుట్ర
గత విధానాన్ని మార్చి కొత్త విధానం పేరుతో భారీగా అవినీతికి ప్రణాళికలు రూపొందించారు. దీనిలో ముఖ్యమంత్రి కనుసన్నల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ముఖ్య భూమిక పోషించారు.

గతంతో పోలిస్తే రూ.120 కోట్లు అదనం
2022లో పేపర్ ధర అధికంగా టన్ను లక్ష రూపాయులు పలికిన రోజుల్లోనే ప్రభుత్వం పాఠ్య పుస్తకాల ముద్రణకు పేపరు కూడా ముద్రణా సంస్థ కొనుగోలు చేసే విధానంలో పిలిచిన టెండర్‌లో 5.14 కోట్ల పుస్తకాలు, 679.77 కోట్ల పేజిలకు రూ.160.63 కోట్లకు టెండర్ పిలవడం జరిగింది. అంటే ఒక్కో పేజి ముద్రణకు పేపర్‌తో కలిపి 23 పైసలు కనీస ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నాడు ముద్రణా సంస్థలేవి తామే పేపర్ కొనుగోలు చేపట్టే విధానంలో పాఠ్య పుస్తకాలు ముద్రించటానికి ముందుకు రాకపోవటంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు.

ఆ విధంగా పేపర్ ధర అధికంగా ఉన్న రోజుల్లోనే పాఠ్య పుస్తకాల ముద్రణకు పేజికి 23 పైసలు నిర్ధారించిన జగన్ రెడ్డి సర్కార్. నేడు పేపర ధర భారీగా తగ్గి టన్ను కేవలం రూ.85 వేలకు అందుబాటులోకి వచ్చిన సందర్భంలో 4.78 కోట్ల పుస్తకాలు, 739.58 కోట్ల పేజిలకు రూ.253 కోట్లకు భారీ టెండర్ పెట్టారు. ప్రస్తుతం పేపర్ ధర 2022తో పోలిస్తే భారీగా తగ్గిన నేపథ్యంలో ముద్రణకు ఒక్కో పేజికి గరిష్టంగా 21 పైసలకంటే ఖర్చయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆ లెక్కన 739.58 కోట్ల పేజిలకు కేవలం రూ.155 కోట్ల మాత్రమే ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి.

కానీ నేడు దాదాపు రూ.100 కోట్లు అదనంగా రూ.253.75 కోట్లకు టెండర్‌ను పిలిచి రూ.100 కోట్ల భారీ దోపిడికి రంగం సిద్ధం చేసుకున్నారు సత్తిబాబు ముఠా. పేపర్ నాణ్యతలో ఇంకాస్త కక్కుర్తి పడితే మరో రూ.20 కోట్ల వరకు సత్తిబాబు ముఠా అదనంగా దండుకోవచ్చు. ఆ విధంగా కంసమామ జగన్ రెడ్డి అండతో రేపు ఎన్నికల్లో భారీగా ఓట్లు కొనుగోలుకు వెచ్చిండానికి రూ.100 నుండి రూ.120 కోట్లు పాఠ్య పుస్తకాల టెండర్లను అడ్డంపెట్టుకొని దోచుకోవటానికి సిద్ధపడ్డాడు బొత్స సత్తిబాబు.

టెండర్ డాక్యుమెంట్లో టెండర్ దక్కించుకున్న సంస్థ కనీసం 33% పనిని చేపట్టి నిర్దేశిత సమయంలో పనిని పూర్తి చేయాలనే నిబంధన అనుసారం 6 వేల టన్నుల పేపర్ల ద్వారా పుస్తకాలను ముద్రణ చేయాలంటే కనీసం 40 మిషన్ల అవసరముంటే 11 మిషన్ల ఉంటే చాలని టెండర్ డాక్యుమెంట్‌లో తమ బినామీలకు అనుకూలంగా నిబంధన పెట్టారు. ఈ విధానం వల్ల విద్యార్దులకు పాఠ్య పుస్తకాలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్దితి. అదే విధంగా రాష్ట్రంలో దాదపుగా 2 లక్షల మంది మధ్య, చిన్న తరహా (MSME) ప్రింటింగ్ సంస్థల ఆధారంగా జీవిస్తున్న వారు నేడు ప్రభుత్వం చేపట్టిన ఈ విధానం వల్ల రోడ్డున పడనున్నారు.

గతంలో ప్రభుత్వమే పేపర్ కొనుగోలు చేసి అందించే విధానంలో వీరందరూ ప్రభుత్వం వద్ద నుండి ప్రింటింగ్ జాబ్ వర్క్ పొంది జీవనోపాది పొందేవారు. కానీ నేడు పేపరు కూడా ముద్రణా సంస్థలే కొనుగోలు చేయాలన్న నిబంధనల వల్ల వీరెవ్వరూ టెండర్ ప్రక్రియలో పాల్గొన లేనటువంటి పరిస్థితి. కేవలం ఒకరిద్దరు సత్తిబాబు బినామీలు లబ్ది కోసమే ఈ విధానం తీసుకొచ్చారు. పైకి 25% MSMEలకు పాఠ్య పుస్తకాల ముద్రణ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా పేపర్ కూడా తామే కొనుగోలు చేసే విధానంలో ఎవ్వరూ ఆ పని చేపట్టాడానికి ఆర్దిక వెసులుబాటు చిన్న ముద్రణ సంస్దలకు ఉండదు.

కావున ఆ 25% పనులు కూడా చివరకి సత్తిబాబు బినామీలకు వెళ్ళవలసిందే ఈ రూ.120 కోట్ల స్కాం టెండర్‌ను తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలో తక్కువ ధరకు ప్రభుత్వమే పేపర్‌ను కొనుగోలు చేసి పాఠ్య పుస్తకాల ముద్రణ చేపట్టాలని తెదేపా తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు

Leave a Reply