-టిడిపి, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
-రాష్ట్రంలో పోలీసు పాలన
-పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించాలి
-పులి అని చెప్పుకునే జగన్ పొత్తుల పై భయం ఎందుకు?
-జగన్ అనే ఒక రాక్షస పాలన బ్రాండ్ చూసి పెట్టుబడులు ఎలా వస్తాయి?
-టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు: ఇప్పటం ప్రజల మీద కక్ష సాధింపు జరుగుతుంది.ఈ ప్రభుత్వం కులగొట్టడాలతోనే ప్రారంభం అయ్యింది.ఈ ప్రభుత్వం ఒక్క కట్టడం ఎక్కడైనా కట్టారేమూ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇవ్వడం ఇప్పటం ప్రజలు చేసిన తప్పా?
టిడిపి, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పులి అని చెప్పుకునే జగన్ పొత్తులపై భయం ఎందుకు?జగన్ అనే ఒక రాక్షస పాలన బ్రాండ్ చూసి పెట్టుబడులు ఎలా వస్తాయి?
జగన్ కు ఎన్నికల సంవత్సరం పెట్టుబడుల అంశం గుర్తుకు రావడం ఆశ్చర్యం గా ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సంతోషమే. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతుంది.పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించాలి. విశాఖ లో పెట్టుబడి దారులకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు.సుప్రీంకోర్టు లో ఉన్న రాజధాని అంశాన్ని మభ్య పెట్టి విశాఖ రాజధాని చేస్తాను అని మోసం చేస్తున్నారు.