-ప్రజాసేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచారు
-పుట్టినరోజుని పండగ చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
నా పుట్టిన రోజుని ఓ పండగలా జరిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జన్మదినం జనంకి ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల నా జన్మ సార్థకమైందని ఆనందిస్తున్నాను. వివిధ మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నాకు కొండంత బలం. నా జీవితం ప్రజాసేవకే అంకితం.