Suryaa.co.in

Andhra Pradesh

మాయల మారీచుడు జగన్మోహన్ రెడ్డి

-పేదల రక్తాన్ని తాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్
-అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?
-జగన్మోహన్ రెడ్డికి ఊరికి ఒక ప్యాలెస్
-వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తే 2గం లలో పట్టుకున్నారు
-మరి రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్న వారిపై ఎందుకు అంత త్వరగా పట్టుకోలేక పోతున్నారు?
-తెనాలిలో 128 మంది కనపడకుండా పోతే ఇంతవరకు అతిగతిలేదు
-పేదల బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్న వైసీపీ నేతలు
-4సం. లుగా 4500 ఇళ్లను మాత్రమే నిర్మించి సిగ్గులేకుండా ఇళ్లను నిర్మించానని చెప్పడం సిగ్గుచేటు
-పేర్ల పిచ్చితో కొట్టుకుంటున్న వైసీపీ అధినేత
-జగన్ సర్కారుపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఫైర్

గుంటూరు జిల్లా తెనాలిలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ తొమ్మిది సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సేవ- సుపరిపాలన, పేదల సంక్షేమం పేరుతో భారీ బహిరంగ సభ.. ఈసభకు ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోనల్ ఇన్చార్జి విష్ణువర్ధన్ రెడ్డి విచ్చేశారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ మాట్లాడుతూ… ఒకప్పట్టి ఆంధ్ర ప్యారీస్ గా చెప్పుకొనే తెనాలి బహిరంగ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గత 9సం. లుగా ఏపీ నుంచి ఓట్లు వేసినా వెయ్యక పోయినా , అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోడీ పథకాలు మీకు గుర్తు చేస్తున్నాను.

ప్రధాని మోదీ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అoతర్జాతీయ స్థాయి కీర్తి పొందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అoతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు ప్రఖ్యాతులుదక్కాయి. రష్యా నుంచి క్రూడాయిల్ ను దిగుమతి చేసుకుని సత్సంబంధాలు కలిగి ఉండటానికి ప్రధాన పాత్ర పోషించిన మోడీ. భారత్ దేశం డాలర్ తో పోటీపడుతూ ఉంటుందంటే ఆనందంగా ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో అతితక్కువ రేటుతో వస్తువులు తయారు చేయడంలో భారతదేశం ముందుండి చైనా దేశాన్ని వెనుకకు నెట్టిన ఘనత సాధించింది. మోదీ ఆధ్వర్యంలో భారత దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతుంది.

మాయల మారీచుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కల్తీ మద్యం సొంత కంపెనీలో తయారుచేసి పేదల రక్తాన్ని తాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి పేదలకు 10వేలు ఇచ్చి 2లక్షల రూపాయలు అప్పనంగా దోచుకుంటున్నారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని సర్వనాశనం చేసాడు.

జగన్ మోహన్ రెడ్డికి పాలనలో అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? పేదల బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్న ప్రభుత్వం వైసీపీ నేతలు. ప్రధానమంత్రి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బెంగళూరులో 27 కిలోమీటర్లు ప్రజలను కలుస్తూ వెళ్లారు. ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి పరదాలు చాటున ప్రజల్లోకి వచ్చి సభలో మాట్లాడి హెలికాఫ్టర్ లో పోవడం చూస్తుంటే విడ్డురంగా ఉంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊరికి ఒక ప్యాలెస్ ఉంది. పేదలకు మాత్రం ఇళ్లను నిర్మించరు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గత 4సం. లుగా 4500 ఇళ్లను మాత్రమే నిర్మించి సిగ్గులేకుండా ఇళ్లను నిర్మించానని చెప్పడం సిగ్గుచేటు.

రైతులు పండించిన పంటకు గత నాలుగేళ్లుగా మద్దత్తు ధర ఇవ్వలేని చేతకాని ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాలు రైతు మోసాల కేంద్రాలుగా విరాజిల్లు తున్నాయి. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పేర ఉన్న పొలాలకు జగన్మోహన్ రెడ్డి పేర్లు తో పుస్తకాలు ఇవ్వడం చూస్తే , పేర్ల పిచ్చితో కొట్టుకుంటున్న వైసీపీ అధినేత. నీటి కుళాయి కనెక్షన్ కోసం రాష్ట్రంలో నిర్దాక్షిణ్యంగా 7వేలు వసూలు చేసుకుంటున్నారు.

కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో వాళ్ళ పథకాలపేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి రైతులను మోసం చేసి రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి జగన్. 250 మంది అమరావతి రైతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేష్టలకు ప్రాణాలు కోల్పోతే విషపు నవ్వులు నవ్వుతూ చోద్యం చూస్తూ కూర్చోవడం ఏమిటని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లాలో హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్న ఆపలేని దద్దమ్మ ప్రభుత్వం ఏపీలో ఉంది. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తే 2గం లలో పట్టుకున్నారు, మరి రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్న వారిపై ఎందుకు అంత త్వరగా పట్టుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అట్టడుగు స్థాయిలో వుందనటానికి ఉదాహరణ తెనాలిలో 128 మంది కనపడకుండా పోతే ఇంతవరకు అతిగతిలేదు.రాష్ట్రంలో రోడ్ల దుస్థితి చూస్తే అద్వనంగా ఉన్నాయి, నేను 23 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయడానికి గంటన్నర పట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోనల్ ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ అధికారంలోకి వచ్చి 9సం. లు పూర్తి చేసుకున్న సందర్బంగా వై. సత్యకుమార్ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ నిర్వహించిన ఘనత బీజేపీ ది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రం పేదలకు ఇచ్చిన బియ్యాన్ని కూడా దోచుకుతిన్న పందికొక్కులు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదలు పేదలను దోచుకు తింటున్నారు. బీజేపీ వేసిన రోడ్లలో తిరుగుతూ, తమ సొంత నిధులు మాదిరిగా ప్రజలకు చెప్పుకోవడం సిగ్గు చేటు. వైసీపీ ప్రభుత్వానికి దోచుకుంటున్న ప్రకృతి వనరులు, మైనింగ్, సాండ్, వైన్, పేరుతో దోచుకుంటు న్నందుకు అస్కార్ అవార్డ్ జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వొచ్చు.

పేదలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇళ్లను కట్టకుండా పేదలను దోచుకుతింటున్న ఘనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వస్తే ప్రజలను భయభ్రాంతులను గురిచేసి దొంగ ఓట్లతో స్థానిక ఎన్నికలలో గెలుపొందారు. విశాఖ వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి కోట్లు వసూలు చేస్తే , రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉందని ప్రశించారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదు, పిల్లలకు రక్షణ లేదు, బడుగు బలహీన వర్గాలకు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ పార్టీ పోవాలి బీజేపీ పార్టీ రావాలి అంటూ పిలుపునిచ్చారు.

జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ… నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలలో భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి లేకుండా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ చేయటమే కాకుండా యువత ను చెడు మార్గాల ద్వారా పయనించే టట్టు ఆంధ్రప్రదేశ్ ను అంధకార ప్రదేశ్ గా తీర్చి దిద్దడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ ఫుల్గా ఈ నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారని తెలిపారు.

జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇంచార్జి నీలకంఠ, మాగంటి సుధాకర్ యాదవ్, పాతూరి నాగభూషణం, సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, యడ్లపాటి రఘునాథ బాబు, మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, శిరసనగండ్ల శ్రీనివాసులు, స్వరూప రాణి, తోట రామకృష్ణ, శనక్కాయల ఉమాశంకర్, మకుటం శివ, భీమినేని చంద్రశేఖర్, వనమా నరేంద్ర, మిట్టా వంశీకృష్ణ, యామిని శర్మ, పంచుమర్ధి ప్రసాద్, సుధాకర్, జగ్గారపు శ్రీనివాస్, అనుమల వంశీ, భాస్కర్, కుమార్ గౌడ్, రంగా, పూర్ణ, తెనాలి పట్టణ అధ్యక్షుడు మంచాల రత్నరాజు, అనంతా చార్యులు, మైలా హరిక్రిష్ణ, అన్నవరపు వేణు రూరల్ మండల అధ్యక్షుడు యోగానంద కిషోర్, కృష్ణ కాంత్ మరియు వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE