Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల సంక్షేమానికి పాడెకట్టిన జగన్ రెడ్డి

•అబద్ధాలు, దుష్ప్రచారం తప్ప, ఉద్యోగుల డిమాండ్లు.. సమస్యలు పరిష్కారించాలన్న చిత్తశుధ్ధి లేని జగన్ ప్రసంగంతో ఈ రోజు బ్లాక్ డే గా నిలిచింది.
• ఏపీఎన్జీవో మహాసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగం మొత్తం పరనింద ఆత్మస్తుతి సమ్మేళం
• టీడీపీ హాయాంలో ఉద్యోగులజీతభత్యాల చెల్లింపులు…తన ప్రభుత్వంలో చేస్తున్న చెల్లింపులపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
• జగన్ భజన తప్ప ఉద్యోగసఘం నేతలకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్టడంలేదు
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ఏపీఎన్జీవో 21వ మహాసభలకు హాజరైన జగన్ రెడ్డి తనప్రభుత్వం ఉద్యోగులకు చేసింది చెప్పుకోకుండా, అధికారం చివరిదశకు చేరినా ఇంకా అబద్ధాలు, దుష్ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటని, తెలుగుదేశాన్ని విమర్శించడంపై పెట్టిన శ్రద్ధతో ఒక్క వంతైనా ముఖ్యమంత్రి ఉద్యోగుల సంక్షేమం, వారిసమస్యల పరిష్కారంపై పెడితే బాగుండేదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని తెలిసినా, ఉద్యోగసంఘం నేతలు వైసీపీ కార్యకర్తల కన్నా దారుణంగా ముఖ్యమంత్రి భజనలో మునిగితేలారు. నేడు జరిగిన మహాసభలకు దాదాపు 20వేలమంది వచ్చారంటున్న ఉద్యోగసంఘం నేత బండి శ్రీనివాసరావుకి వచ్చినవారి పేర్లు, హోదాలతో కూడిన జాబితా విడుదలచేసే ధైర్యం ఉందా? నేడు ఏపీఎన్జీవో మహాసభలకు వచ్చిన వారంతా ఎన్జీవోలని వారంతా స్వచ్ఛం దంగా వచ్చారని, ఎన్జీవో సభ్యత్వం ఉన్నవారేనని చెప్పగల దమ్ము, ధైర్యం శ్రీనివాస రావుకి ఉందా?

డీఏ పొందడం ఉద్యోగులహక్కు. దాన్ని ఈ ముఖ్యమంత్రి కాకుంటే, వచ్చేవాళ్లు ఇస్తారు. అదేదో జగన్ రెడ్డేఇస్తున్నట్టు ఉద్యోగసంఘం నేతలు మాట్లాడటం వెర్రితనం కాదా? ప్రభుత్వానికి అమ్ముడుపోయిన వారి మాటలు ఎలా ఉంటాయో అర్థమవుతోంది. జీపీఎస్ ను స్వాగతిస్తున్నామన్న శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఆత్మహత్యతో సమానం. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వంతో పోరాడటానికి భయపడే జీపీఎస్ ను స్వాగతిస్తున్నారు. మహా సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగం, ఉద్యోగసంఘం నేతల స్వామిభక్తి తప్ప, తమకు ఎలాంటి ఉపయోగం లేదని సభలకు వచ్చినవారే వాపోయారు.

ఏపీ ఎన్జీవో మహాసభల్లో జగన్ ప్రసంగం పరనింద..ఆత్మస్తుతి మయం
ఏపీఎన్జీవో మహాసభల్లో ఉద్యోగులకు తాను అందరికంటే ఘనంగా ఇచ్చాడని, వారిని ఉద్ధరించాడని జగన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. రాష్ట్ర విభజనానంతరం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ చంద్రబాబు ఉద్యోగులకు న్యాయంచేశారు. 43శాతం ఫిట్మెంట్ ఇచ్చి, ఎరి యర్స్ ఇవ్వనంటే అప్పుడు సంఘనేతలుగా ఉన్న మేం లేచి వచ్చేశాం. జగన్ రెడ్డి 11వ పీఆర్సీ అమల్లో రివర్స్ పీఆర్సీ అమలుచేసి, ఎరియర్స్ లేకుండా, డీఏను పీఆర్సీలో కలిపి, రిటైర్మెంట్ తర్వాత ఇస్తానంటే తలాడించిన దౌర్భాగ్యపు నాయకత్వా న్ని ఇప్పుడు చూస్తున్నాం.

ఈ ప్రభుత్వ విధానాలతో అత్యంత దారుణంగా నష్టపోయిం ది ఉపాధ్యాయులు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ ఒక్క డీఎస్పీ ప్రకటించలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసినా, ఆ సంస్థ ఉద్యోగులు సంతోషంగా లేరు. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డామని వారే వాపోతున్నారు. రెగ్యులరైజేషన్ కి, ప్రొవెన్షనలైజ్ కి తేడా తెలియని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. వైద్య విధానపరిషత్ పరిధిలోని ఉద్యో గుల జీతాలు కొత్తగా ఏమీ పెరగలేదు.

వారికి జగన్ రెడ్డి గొప్పగా చేసిందేమీ లేదు. ఏపీఎన్జీవో మహాసభలు, ఉద్యోగుల సభలకు గతంలో వచ్చిన ముఖ్యమంత్రులు ఉద్యోగుల సమస్యలు, వారికి చేసిన.. చేయాల్సిన వాటిపైనే మాట్లాడేవారు. కానీ నేటి జగన్ రెడ్డి 55 నిమిషాల ఉపన్యాసమంతా పరనింద ఆత్మస్తుతికే పరిమితమైంది.

ఉద్యోగుల సొమ్ము దిగమింగి, వారిని ఉద్ధరించినట్టు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికే చెల్లింది
జగన్ రెడ్డి ఉద్యోగుల డబ్బు రూ.840కోట్లు దొంగిలించాడని కేంద్రమంత్రే చెప్పాడు. ఉద్యోగుల అనుమతి లేకుండా వారిసొమ్ము తీసుకున్న ముఖ్యమంత్రి వారిని ఉద్ధరిం చాడని చెప్పడం పచ్చిమోసం కాదా? విశాఖపట్నంలో ప్రభుత్వభూములు, కార్యాల యాలు తాకట్టు రూ.25వేలకోట్ల అప్పులు చేశాడు. విద్యుత్ ఉద్యోగుల ఫండ్స్ రూ.12 వేలకోట్లను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లించాడు. ఉద్యోగులతో చెప్పకుండా, సెబీ అనుమతి లేకుండానే జగన్ రెడ్డి ఈ పనిచేశాడు.

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సొమ్ము కాజేశాడు. రెక్కాడితే గానీ డొక్కాడని భవననిర్మాణ కార్మికుల సొమ్ము రూ. 1200కోట్లు స్వాహాచేశాడు. ఈ విధంగా నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి చేయని ఆర్థిక అరాచకం లేదు. ముఖ్యమంత్రి స్థానంలోఉండి నిస్సిగ్గుగా నిర్భయంగా అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికే సాధ్యమైంది.

తన ప్రభుత్వం ప్రతినెలా ఠంచన్ గా ఒకటోతేదీన రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చినట్టు జగన్ రెడ్డి నిరూపించగలడా?
టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో అండగా నిలిచింది. వారి కోరినవి… కోరనివి అన్నీ అమలుచేసింది. హైదరాబాద్ నుంచి రావడానికి ప్రత్యేకంగా రైలు సర్వీసులు అందుబా టులోకి తెచ్చింది. అమరావతిలో ఉండే ఉద్యోగులకు గృహ అలవెన్సులు ఇచ్చింది. జనాభా లెక్కతో సంబంధం లేకుండా 20శాతం హెచ్.ఆర్.ఏ ఇచ్చింది. అంగన్ వాడీ, ఆశావర్కర్లు, హోమ్ గార్డుల వంటి భిన్న సిబ్బందికి అడగకుండానే 40శాతం జీతాలు పెంచిన ఘనత చంద్రబాబుది. గతప్రభుత్వంలో పెంచిన జీతాలు ఇస్తూ, తానే పెంచిన ట్టు జగన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు.

తన హయాంలో ఉద్యోగులు మొత్తానికి ఠంఛన్ గా ఒకటోతేదీన జీతాలు ఇచ్చామని జగన్ రెడ్డి చెప్పగలడా? అలా ఇచ్చినట్టు నిరూ పించే వాస్తవఆధారాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా? జీతాల చెల్లింపు 1వ తేదీన మొదలుపెట్టి… 10, 15వ తేదీవరకు చెల్లిస్తు న్న ఘనత ఈప్రభుత్వానికే దక్కింది. లక్షమంది ఉద్యోగులకు ఒకటోతేదీన జీతాలు ఇ వ్వలేని ముఖ్యమంత్రి, పచ్చి అబద్ధాలు చెబుతుంటే నోరెత్తలేని స్థితిలో ఉద్యోగసంఘం నేతలు ఉండటం నిజంగా ఉద్యోగుల పొరపాటే.

కిందిస్థాయి సిబ్బంది ప్రశ్నించడం లేదన్న ధైర్యంతోనే ఉద్యోగసంఘం నేతలు నిస్సిగ్గుగా జగన్ రెడ్డి భజనలో మునిగి తేలుతున్నారు. తీర్మానాలు, డిమాండ్లతో సాగాల్సిన ఏపీఎన్జీవో మహాసభలు రాజకీ య పార్టీల సభల్ని తలపించాయి. ఆరోగ్యశ్రీ కింద ఉద్యోగుల్ని చేర్చాక, వారి హెల్త్ కార్డులు పనిచేయడంలేదు. ఆసుపత్రులు తమకు బిల్లులు రావడంలేదని వైద్యసేవలు నిరాకరిస్తున్నాయి. ఈ సమస్యపై ముఖ్యమంత్రిని సంఘనేతలు ఎందుకు ప్రశ్నించలేక పోయారు?

ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తానని చెప్పాల్సింది ముఖ్యమంత్రి అయితే, చీఫ్ సెక్రటరీకి చెప్పండని తప్పించుకోవడం ఏమిటి? వారంలో రద్దుచేస్తానన్న సీపీఎస్ ఏమైందో, జీపీఎస్ ఎందుకు తెరపైకి తెస్తున్నారో జగన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? ఉద్యోగ నేతలు దానిపై ఎందుకు ముఖ్యమంత్రిని నిలదీయలేదు? కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విధివిధానాలు ఏమిటో ఎందుకు చెప్పలేదు? పీఆర్సీ దామాషా ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎందుకు పెరగలేదు?

ఉద్యోగుల జీతభత్యాలు తమప్రభుత్వంలోనే ఎక్కువంటున్న ముఖ్యమంత్రి… 2019 ఫిబ్రవరి, 2023 ఫిబ్రవరిలో జీతాలు, పెన్షన్ల చెల్లింపుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయగలడా?
టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఉద్యోగులు, పెన్షనర్లకు చేసే చెల్లింపులు రూ.4,300కోట్లు అయితే, ఇప్పుడు అది రూ.5,400 కోట్లకు చేరింది. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు రూ.1100 కోట్లేనని, మా ప్రభుత్వంలో రూ.3,300కోట్లకుచేరిందని చెప్పడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం. ఆయనకై ఆయన తెలుసుకోడు.. ఎవరైనా చెప్పినా వినడు.

జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏమీ పెంచలేదు. ఆయన చేస్తున్న అదనపు చెల్లింపులు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాలు మాత్రమే. జగన్ రెడ్డి ఏపీఎన్జీవో మహాసభల్లో చెప్పింది చూశాక ఎన్జీవో చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే అనిచెప్పక తప్పదు. ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలుచెప్పినా, ఎంత దుష్ప్రచారం చేసినా ఉద్యోగులు టీడీపీని ఆదరిస్తున్నారు అనడానికి మూడు ఎమ్మెల్సీల గెలుపే నిదర్శనం. ఫిబ్రవరి 2019లో ఉద్యోగుల శాలరీ బిల్లు ఎంతో.. 2023 ఫిబ్రవరికి ఎంత ఉందో తక్షణమే ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి” అని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE