– వైసీపీ పరిపాలన వచ్చిన నాటి నుండి దళితుల పై దాడులు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మంగళగిరి : జగన్ రెడ్డి ని దళిత ద్రోహి అని నేను ఊరికే అనడం లేదు. వైసిపి పరిపాలన వచ్చిన నాటి నుండి దళితుల పై దాడులు మొదలయ్యాయి. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ని వేదించి చంపేశారు.ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడి పోరాడినందుకు వరప్రసాద్ కి శిరోముండనం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం ని హత్య చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసాడు. తిరుపతి లో డాక్టర్ అనితా రాణి గారు వైసిపి నేతల అవినీతి కి సహకరించలేదని వేదించారు. చీరాల లో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపేశారు.
సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల లో దళిత మహిళ నాగమ్మ ని అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యలేదు.సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చేసిన ఖర్చు ని సబ్ ప్లాన్ గా చూపిస్తున్నారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదు.
దళితుల కోసం అనేక ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 26 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు.దళితుల స్వయం ఉపాధి కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.జగన్ రెడ్డి మెంటలోడో, సైకో నో అర్దం కావడం లేదు.విదేశీ విద్య కి ఉన్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. దళితులకు అనేక హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి పేరు తొలగించడం దారుణం.
అంబేద్కర్ పేరు తొలగించినా వైసిపి లో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించకపోవడం దారుణం. తక్షణమే విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. దళితుల పై దాడులు ఆపాలి. దాడి చేసిన వైసిపి నేతల పై చర్యలు తీసుకోవాలి.
జగన్ రెడ్డి ది దరిద్ర పాదం. మూడు ఏళ్ల నాలుగు నెలలు అవుతోంది మూడు రాజధానులు అని ఒక్క ఇటుక పెట్టలేదు. విశాఖ ని నాశనం చేశారు. జగన్ రెడ్డి దరిద్ర పాదం ఎఫెక్ట్ కి విశాఖ లో రోజుకో విషాదం జరుగుతుంది. కర్నూలు లో ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా చెయ్యలేదు. అమరావతి అభివృద్ది అడ్డుకున్నారు. జగన్ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల లిస్ట్ చెప్పాలి అంటే ఒక రోజు సరిపోదు.